PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lockdownf1f24f78-2fe6-45e2-8f57-e78f854b8c19-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lockdownf1f24f78-2fe6-45e2-8f57-e78f854b8c19-415x250-IndiaHerald.jpgఏపీలో కరోనా కేసులు దారుణంగా పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఇలాంటి సమయంలో ఏపీలో కర్ఫ్యూ, ఆంక్షలు తీవ్రంగా అమలు చేస్తున్నారు. అయితే ఈ మధ్య ఏపీలో కొత్తగా మరో కరోనా వేరియంట్ వచ్చిందని చాలా మంది చర్చించుకుంటున్నారు. దీని వల్ల పొరుగు రాష్ట్రాల వారు ఏపీ నుంచి తమ రాష్ట్రాలకు ఎవ్వరూ రాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఏపీ నుంచి ఎవ్వరూ తమ ప్రాంతాలకు రాకుండా సరిహద్దుల వద్ద కఠిన ఆంక్షలను విధిస్తున్నారు. lockdown;amala akkineni;gautham new;gautham;krishna river;andhra pradesh;telangana;district;police;krishna district;jaggayyapetaపొరుగు రాష్ట్రాలకు వెళ్లేవారికి షాక్..!పొరుగు రాష్ట్రాలకు వెళ్లేవారికి షాక్..!lockdown;amala akkineni;gautham new;gautham;krishna river;andhra pradesh;telangana;district;police;krishna district;jaggayyapetaMon, 10 May 2021 13:13:31 GMTఏపీలో కరోనా కేసులు దారుణంగా పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఇలాంటి సమయంలో ఏపీలో కర్ఫ్యూ, ఆంక్షలు తీవ్రంగా అమలు చేస్తున్నారు. అయితే ఈ మధ్య ఏపీలో కొత్తగా మరో కరోనా వేరియంట్ వచ్చిందని చాలా మంది చర్చించుకుంటున్నారు. దీని వల్ల పొరుగు రాష్ట్రాల వారు ఏపీ నుంచి తమ రాష్ట్రాలకు ఎవ్వరూ రాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఏపీ నుంచి ఎవ్వరూ తమ ప్రాంతాలకు రాకుండా సరిహద్దుల వద్ద కఠిన ఆంక్షలను విధిస్తున్నారు. దీని వల్ల ప్రజలు అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. సరిహద్దులో తెలంగాణ పోలీసులు కొత్త ఆంక్షల్ని అమలు చేస్తున్నారు. కొవిడ్ పేషెంట్లను అనుమతించడంపై కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. బెడ్స్, ఆస్పత్రి అనుమతి ఉంటేనే అంబులెన్స్‌లకు అనుమతి ఇస్తున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సరిహద్దులో అనుమతి లేని వాహనాలను తెలంగాణ పోలీసులు వెనక్కు పంపుతున్నారు. సాధారణ ప్రయాణికుల్ని మాత్రం అనుమతిస్తున్నారు.
 

కర్నూలు - తెలంగాణ సరిహద్దులో కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కొంతమంది పేషెంట్లు ఇబ్బంది పడుతుండటంతో కర్నూలు జిల్లా ఎస్పీ గద్వాల్ జిల్లా ఎస్పీతో మాట్లాడారు. అత్యవసరం ఉన్న రోగుల్ని మాత్రం అనుమతించాలని కోరారు. తెలంగాణ పోలీసులు కూడా సహకరించి కొందర్ని సరిహద్దులో అనుమతిస్తున్నారు. 


ఈ తరుణంలో తెలంగాణ సరిహద్దులో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఏపీలోకి అనుమతిస్తున్నారు. ఆ తర్వాత మాత్రం వాహనాలను అనుమతి ఇవ్వడం లేదు. అత్యవసరంగా వెళ్లేవారు ఈ-పాస్ తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచనలు జారీ చేశారు. సోమవారం నుంచి ఈ పాస్‌లు ఉంటేనే ప్రయాణించాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఇంటి పట్టునే ఉండి జాగ్రత్త వహించాలని అధికారులు సూచిస్తున్నారు. కాబట్టి మీరు ప్రయాణం చేసే ముందే ఈ-పాస్ లను ఏర్పాటు చేసుకోవడం మంచిది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకింగ్: హైదరబాద్ లో భారీ అగ్నిప్రమాదం..!!

ఇంతకీ పప్పన్నం ఎప్పుడు పెడతావో చెప్పన్నా .... ??

బ్రహ్మచారి 'దేవి' పెళ్లికి మహూర్తం ఎప్పుడో..?

టీఎన్‌ఆర్‌ జీవిత విశేషాలు ఇవే..!

TNR మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం..!!

వెండి తెర మీదా తళుక్కున మెరిసిన పరిటాల శ్రీరాం ?

ఆ చక్రవర్తిగా మహేష్ బాబు.. ఒప్పించిన రాజమౌళి..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>