CrimeN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/murder69048a89-f84a-4be7-8fcf-2b67f14ae4ad-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/murder69048a89-f84a-4be7-8fcf-2b67f14ae4ad-415x250-IndiaHerald.jpgసమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. ఆ యువకుడు నిత్యం మద్యం సేవించేవాడు. ఇంటికి వచ్చి కుటుంబసభ్యులతో గొడవపడేవాడు. అంతేకాకుండా సొంత అన్నదమ్ముళ్లను చంపుతానంటూ బెదిరిస్తూ ఎప్పడూ కత్తిని వెంట పెట్టుకొని తిరిగేవాడు. తాగుడు మనేసి చక్కగా ఏమైనా పనిచేసుకోమని ఎంత చెప్పినా వినలేదు.murder;nithya new;prasad;smart phone;police;murder.;katthiసొంత అన్నలనే చంపుతానని బెదిరించిన వ్యక్తి.. చివరకి..!సొంత అన్నలనే చంపుతానని బెదిరించిన వ్యక్తి.. చివరకి..!murder;nithya new;prasad;smart phone;police;murder.;katthiMon, 10 May 2021 10:00:00 GMTసమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. ఆ యువకుడు నిత్యం మద్యం సేవించేవాడు. ఇంటికి వచ్చి కుటుంబసభ్యులతో గొడవపడేవాడు. అంతేకాకుండా సొంత అన్నదమ్ముళ్లను చంపుతానంటూ బెదిరిస్తూ ఎప్పడూ కత్తిని వెంట పెట్టుకొని తిరిగేవాడు. తాగుడు మనేసి చక్కగా ఏమైనా పనిచేసుకోమని ఎంత చెప్పినా వినలేదు. ఆ కుటుంబంలో అతడి వల్ల ప్రాణ హాని ఉంటుదని తన అన్నలు భావించారు. ఏ రకంగానైనా అతడిని చంపేయాలని నిర్ణయం తీసుకున్నారు.

అయితే ఒక రోజు రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన అతడు తన సోదరులు, అమ్మతో డబ్బుల విషయంలో వాగ్వాదానికి దిగారు. తర్వాత అతడు తన ఇంటికి వెళ్లాడు. ఇద్దరు అన్నదమ్ముళ్లు కలిసి తమ్ముడి ఇంటికి వెళ్లి ఇద్దరు కలిసి చున్నీతో మెడకు గట్టిగా బిగించి అతడిని హత్య చేశారు. ఈ సంఘటన మంగళ్‌హాట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్నది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మంగళ్‌హాట్‌ ఇన్‌స్పెక్టర్‌ రణవీర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి.

మంగళ్‌హాట్‌లోని గుఫానగర్‌లో నివసించే దుర్గమ్మకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కొడుకు రవీందర్‌(28) మియాపూర్‌లో నివసిస్తుండగా, రెండో కుమారుడైన నరేందర్‌(25) గుఫానగర్‌లోనే అద్దె ఇంట్లో తల్లితో కలిసి ఉంటున్నాడు. చిన్న కుమారుడైన ప్రసాద్‌(22) మద్యం, గంజాయికి అలవాటు పడి నిత్యం సోదరుల్ని తల్లిని వేధిస్తుండేవాడు.

ఓ రోజు తల్లి, మహేందర్ వద్దరకు వచ్చి గొడవకు దిగాడు. భయపడిపోయిన నరేందర్ అన్న రవీందర్ కు ఫోన్ చేసి పిలిపించాడు. అక్కడే ఉన్న ప్రసాద్ మిమ్మల్ని చంపుతానంటూ కత్తి పట్టుకొని బెదిరించాడు. ఎప్పటికైనా తమ్ముడితో ప్రాణహాని ఉందని భావించి అతణ్ని ఎలాగైనా అంతమొందించాలనే నిర్ణయానికి వచ్చారు సోదరులు. ప్రసాద్ ఉండే ఇంటికి వెళ్లి అతనితో వాగ్వాదానికి దిగారు.

అయితే పథకం ప్రకారం చున్నీతో మెడకు బిగించి చెరో వైపు లాగి అంతమొందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రసాద్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించి అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ మేరకు తల్లి ఫిర్యాదు మరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

డైరక్టర్ మహీ సెటైర్ వెనుక అంతర్యం !

విజయవాడ వాసులకు వాక్సినేషన్ వాయిదా

జూనియర్ పుట్టినరోజు పై రాజమౌళికి పెరిగిపోతున్న టెన్షన్ !

పుదుచ్చేరి ముఖ్యమంత్రి కి కరోనా

షాకింగ్ : ఈటలతో టచ్‌లో ఇప్పటికే ఇద్దరు మంత్రులు..?

వైరస్ విషయంలో టార్గెట్ వైసీపీ..

స్టే హోమ్.. స్టే సేఫ్ : అప్పుడే చెప్పిన ఓ మహాభారత కథ...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>