PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/estrogenica-vaccine2b46ee5b-e923-4a3c-a356-d4d4a96d9470-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/estrogenica-vaccine2b46ee5b-e923-4a3c-a356-d4d4a96d9470-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు ఈ వైరాస్ బారిన పడేవారి ఈ మహమ్మారి కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీటిలో అధిక శాతం ఆక్సిజన్‌ అందక చనిపోతున్న వారే ఉంటున్నారు. అంటే కరోనా కన్నా.. ప్రాణవాయువు కొరతే ప్రధాన సంకటంగా మారిందన్న మాట.Estrogenica vaccine;amala akkineni;israel;kanna lakshminarayana;vegetable market;contract;coronavirusఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ ఈయూ సంచలన నిర్ణయం..!ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ ఈయూ సంచలన నిర్ణయం..!Estrogenica vaccine;amala akkineni;israel;kanna lakshminarayana;vegetable market;contract;coronavirusMon, 10 May 2021 13:00:00 GMTదేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు ఈ వైరాస్ బారిన పడేవారి ఈ మహమ్మారి కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీటిలో అధిక శాతం ఆక్సిజన్‌ అందక చనిపోతున్న వారే ఉంటున్నారు. అంటే కరోనా కన్నా.. ప్రాణవాయువు కొరతే ప్రధాన సంకటంగా మారిందన్న మాట. మరోవైపు దేశంలో వ్యాక్సిన్ కోసం ఆసుపత్రుల వద్ద ప్రజలు పడిగాపులు కాస్తున్నారు.

అయితే బ్రిటిష్-స్విడిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి అభివృద్ధి చేసిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ సమర్థతపై తొలి నుంచీ అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ టీకా తీసుకున్న పలువురిలో ప్రతికూల ప్రభావాలు కనిపించాయని, ఒంట్లో రక్తం గడ్డలు కట్టి మరణాలు సంభవించినట్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చిన సంగతి అందరికి తెలిసిందే.

ఇక కరోనా టీకాలను సరఫరా  చేస్తామంటూ యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేయడంలో ఆస్ట్రాజెనెకా విఫలమైంది. చేసుకున్న ఒప్పందం మేరకు టీకాలను సరఫరా చేయలేకపోతోంది. దీంతో ఎప్పటి నుంచో గుర్రుగా ఉన్న యూరోపియన్ యూనియన్ ఆస్ట్రాజెనెకాపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది.

ఈ క్రమంలో తాజాగా, ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందం జూన్‌తో ముగియనున్న నేపథ్యంలో దానిని ఇక పునరుద్ధరించకూడదని నిర్ణయించింది. ఈ మేరకు యూరోపియన్ ఇంటర్నల్ మార్కెట్ కమిషనర్ తెలిపారు. కాంట్రాక్ట్‌ను రెన్యువల్ చేయాలని అనుకోవడం లేదని, తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని పేర్కొన్నారు.

2023 నాటికి 1.8 బిలియన్ మోతాదుల కోసం భారీ కాంట్రాక్ట్‌ పొడిగింపునకు అంగీకరించడం ద్వారా ఫైజర్-బయోఎన్‌టెక్ టీకాకు మద్దతు ఇచ్చిన తర్వాతి రోజే ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఆస్ట్రాజెనెకాకు బదులుగా ఫైజర్ వ్యాక్సిన్‌ను తెప్పించుకుంటామని పేర్కొంది. ఆస్ట్రాజెనెకాతో పోలిస్తే ఫైజర్ వ్యాక్సిన్ ధర తక్కువని ఈయూ స్పష్టం చేసింది. ఐరోపాలో కరోనా వ్యాక్సినేషన్ నెమ్మదిగా సాగుతోంది. ఇజ్రాయెల్, బహ్రెయిన్తో పోలిస్తే టీకా పంపిణీలో ఈయూ వెనకే ఉంది. దీనిపై సభ్య దేశాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకింగ్: హైదరబాద్ లో భారీ అగ్నిప్రమాదం..!!

ఇంతకీ పప్పన్నం ఎప్పుడు పెడతావో చెప్పన్నా .... ??

బ్రహ్మచారి 'దేవి' పెళ్లికి మహూర్తం ఎప్పుడో..?

టీఎన్‌ఆర్‌ జీవిత విశేషాలు ఇవే..!

TNR మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం..!!

వెండి తెర మీదా తళుక్కున మెరిసిన పరిటాల శ్రీరాం ?

ఆ చక్రవర్తిగా మహేష్ బాబు.. ఒప్పించిన రాజమౌళి..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>