PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cm-kcr8b113081-5c88-4e89-a2f1-440e248e60f9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cm-kcr8b113081-5c88-4e89-a2f1-440e248e60f9-415x250-IndiaHerald.jpgఏడు ఎమ్మెల్సీ ప‌ద‌వుల్లో ఆరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ప‌ద‌వీకాలం జూన్‌3న పూర్త‌వుతుండ‌గా, గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీ ప‌ద‌వీకాలం జూన్ 16న పూర్త‌వుతోంది. ప్ర‌స్తుతం తెరాస ఎమ్మెల్యేల సంఖ్యాబ‌లం చూసుకుంటే ఏడు ఎమ్మెల్సీ స్థానాలు తెరాస‌కు ద‌క్క‌నున్నాయి. ప్ర‌స్తుతం సిట్టింగ్ ఎమ్మెల్సీలుగా గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, క‌డియం శ్రీ‌హ‌రి, నేతి విద్యాసాగ‌ర్‌, బోడ‌కుంటి వెంక‌టేశ్వ‌ర్లు, మ‌హ్మ‌ద్ ఫ‌రీదుద్దీన్‌, ఆకుల ల‌లిత‌, ప్రొఫెస‌ర్ శ్రీ‌నివాస్‌రెడ్డి ఉన్నారు. వీరిలో ఇద్ద‌రికి రెన్యువ‌ల్ అవుతుంద‌ని ప్ర‌చారం సాగCM KCR;view;kcr;nagarjuna akkineni;telangana rashtra samithi trs;backward classes;mla;minister;june;reddy;partyఆ విష‌యంలో కేసీఆర్‌కు అగ్నిప‌రీక్షే .. ఎలా మేనేజ్ చేస్తారు?ఆ విష‌యంలో కేసీఆర్‌కు అగ్నిప‌రీక్షే .. ఎలా మేనేజ్ చేస్తారు?CM KCR;view;kcr;nagarjuna akkineni;telangana rashtra samithi trs;backward classes;mla;minister;june;reddy;partyMon, 10 May 2021 07:33:31 GMTరాజ‌కీయ చాణుక్యుడిగా పేరుపొందిన సీఎం కేసీఆర్ వ్యూహాలు ఎవ‌రికి ఒక్క‌ప‌ట్టాన అర్థం కావు. ఎంత‌టి క్లిష్ట స‌మ‌స్య‌నైనా సింపుల్‌గా ప‌రిష్క‌రించే చ‌తుర‌త కేసీఆర్‌కు వెన్న‌తోపెట్టిన విద్య‌. అలాంటి కేసీఆర్‌కు త్వ‌ర‌లో ఓ స‌మ‌స్య ఎదురుకాబోతున్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో టాక్ న‌డుస్తుంది. ఇత‌ర పార్టీల నుండి అధికార పార్టీలోకి వ‌చ్చిన వారికి, సొంత పార్టీలోని అసంతృప్తుల‌కు ఎమ్మెల్సీ ప‌దువులు ఇస్తాన‌ని కేసీఆర్ హామీ ఇస్తూ వ‌స్తున్నాడు. ఇలా ఇప్ప‌టికే చాలామందికి హామీలు ఇచ్చిన‌ట్లు తెరాస‌లో టాక్ న‌డుస్తుంది. అయితే జూన్‌లో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు భ‌ర్తీ చేయాల్సి ఉంటుంది. కేసీఆర్ హామీ ఇచ్చిన లిస్ట్ చాంతాడంత ఉండ‌గా.. వారిలో ఎవ‌రికి ఈ ఎమ్మెల్సీ స్థానాలు క‌ట్ట‌బెడ‌తారన్న అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఏడు ఎమ్మెల్సీ ప‌ద‌వుల్లో ఆరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ప‌ద‌వీకాలం జూన్‌3న పూర్త‌వుతుండ‌గా, గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీ ప‌ద‌వీకాలం జూన్ 16న పూర్త‌వుతోంది. ప్ర‌స్తుతం తెరాస ఎమ్మెల్యేల సంఖ్యాబ‌లం చూసుకుంటే ఏడు ఎమ్మెల్సీ స్థానాలు తెరాస‌కు ద‌క్క‌నున్నాయి. ప్ర‌స్తుతం సిట్టింగ్ ఎమ్మెల్సీలుగా గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, క‌డియం శ్రీ‌హ‌రి, నేతి విద్యాసాగ‌ర్‌, బోడ‌కుంటి వెంక‌టేశ్వ‌ర్లు, మ‌హ్మ‌ద్ ఫ‌రీదుద్దీన్‌, ఆకుల ల‌లిత‌, ప్రొఫెస‌ర్ శ్రీ‌నివాస్‌రెడ్డి ఉన్నారు. వీరిలో ఇద్ద‌రికి రెన్యువ‌ల్ అవుతుంద‌ని ప్ర‌చారం సాగుతుంది. ఇటీవ‌ల గ‌వ‌ర్న‌ర్ కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాల‌కు గోర‌టి వెంక‌న్న‌, బ‌స్వ‌రాజు సార‌య్య‌, బొగ్గార‌పు ద‌యానంద్‌తో భ‌ర్తీ చేశారు కేసీఆర్‌. అప్పుడు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఆశించిన అనేక మందికి నిరాశ త‌ప్ప‌లేదు. త్వ‌ర‌లో ఖాళీ అయ్యే ఏడు ఎమ్మెల్సీ స్థానాల్లో నాలుగింటిని బీసీ సామాజిక వ‌ర్గాల‌కు కేటాయిస్తాన‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. దీంతో ఆ నాలుగు స్థానాల్లో అవ‌కాశం ద‌క్కించుకొనేందుకు మంత్రి కేటీఆర్‌, కేసీఆర్‌ల వ‌ద్ద పైర‌వీలు షురూ అయ్యాయ‌ని ప్ర‌చారం సాగుతుంది.


నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక స‌మ‌యంలో టికెట్ ఆశించిన భంగ‌ప‌డ్డ ఎంసీ కోటిరెడ్డికి ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇస్తాన‌ని ఇప్ప‌టికే కేసీఆర్ హామీ ఇచ్చారు. హామీమేర‌కు అవ‌కాశం క‌ల్పిస్తారాఅన్న‌చ‌ర్చ పార్టీ వ‌ర్గాల్లో సాగుతుంది. ఎమ్మెల్సీ ప‌దువుల ఆశిస్తున్న వారిలో మాజీ స్పీక‌ర్ సిరికొండ మ‌ధుసూద‌నాచారి, ఎర్రోళ్ల శ్రీ‌నివాస్‌, మాజీ ఎంపీలు పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి, సీతారాం నాయ‌క్‌ల‌తో పాటు దాదాపు 15 నుంచి 20 మంది వ‌ర‌కు ఉన్నార‌ట‌. వీరిలో సీఎం కేసీఆర్ ఎవ‌రికి అవ‌కాశం క‌ల్పిస్తార‌న్న అంశం తెరాస శ్రేణుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. వీరి ఎంపిక‌ కేసీఆర్‌కు అగ్నిప‌రీక్ష ఎదురుకాబోతుంద‌న్న చ‌ర్చ ఆ పార్టీ నేత‌ల నుండి వినిపిస్తుంది. రాజ‌కీయ చ‌తుర‌త‌, క్లిష్ట స‌మ‌స్య‌ల‌ను తేలిగ్గా ప‌రిష్క‌రిస్తార‌ని పేరుపొందిన సీఎం కేసీఆర్‌.. ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల ఎంపిక విష‌యంలో ఎలాంటి వ్యూహాన్ని అమ‌లు చేస్తారో, అవ‌కాశం ద‌క్క‌ని వారిని ఎలా స‌ముదాయిస్తారో వేచి చూడాల్సిందే.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌రోనా నుంచి కోలుకున్నా.. కంటి చూపు కోల్పోతున్న బాధితులు..!

జూనియర్ పుట్టినరోజు పై రాజమౌళికి పెరిగిపోతున్న టెన్షన్ !

పుదుచ్చేరి ముఖ్యమంత్రి కి కరోనా

షాకింగ్ : ఈటలతో టచ్‌లో ఇప్పటికే ఇద్దరు మంత్రులు..?

వైరస్ విషయంలో టార్గెట్ వైసీపీ..

స్టే హోమ్.. స్టే సేఫ్ : అప్పుడే చెప్పిన ఓ మహాభారత కథ...!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కమల్ కు విషయం అర్ధమైపోయిందా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>