MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tnr1b00a26d-62a0-45b6-94f9-9abaf32495da-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tnr1b00a26d-62a0-45b6-94f9-9abaf32495da-415x250-IndiaHerald.jpgరెండవ దశలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా ఎందరో ప్రముఖులు, సామాన్య యువత ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం భారతదేశంలో నెలకొంటున్న పరిస్థితులు మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఏ క్షణాన ఎవరి మరణవార్త వినాల్సి వస్తుందోమోనని భారతీయ ప్రజలు హడలిపోతున్నారు. ఫస్ట్ వేవ్ లో చాలామంది జర్నలిస్టులను పొట్టనబెట్టుకున్న కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కూడా జర్నలిస్టుల ప్రాణాలను తీసేస్తోంది. తాజాగా ప్రముఖ యూట్యూబ్‌ యాంకర్‌, జర్నలిస్ట్‌, నటుడు తుమ్మల నరసింహారెడ్డి.. టీఎన్‌ఆర్‌ కరోనా తో పోరాడుతూ ప్రాణాలు విడtnr;chiranjeevi;ali;ali reza;jeevitha rajaseskhar;india;industries;cinema;telugu;youtube;you tube;interview;industry;minister;thriller;george reddy;reddy;savariటీఎన్‌ఆర్‌ జీవిత విశేషాలు ఇవే..!టీఎన్‌ఆర్‌ జీవిత విశేషాలు ఇవే..!tnr;chiranjeevi;ali;ali reza;jeevitha rajaseskhar;india;industries;cinema;telugu;youtube;you tube;interview;industry;minister;thriller;george reddy;reddy;savariMon, 10 May 2021 12:26:00 GMT
తాజాగా ప్రముఖ యూట్యూబ్‌ యాంకర్‌, జర్నలిస్ట్‌, నటుడు తుమ్మల నరసింహారెడ్డి.. టీఎన్‌ఆర్‌ కరోనా తో పోరాడుతూ ప్రాణాలు విడిచారు. నేనే రాజు నేనే మంత్రి, సుబ్రహ్మణపురం, ఫలక్నుమా దాస్, జార్జ్ రెడ్డి, సవారీ, హిట్, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమాల్లో నటించి మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఎఫ్3లో నటించే అవకాశం కూడా దక్కించుకున్నారని సమాచారం. కానీ ఆ సినిమాలో నటించకుండానే ఆయన అకాల మరణం చెందారు. ఎంతో చురుకుగా ఉత్సాహంగా ఉండే టీఎన్‌ఆర్‌ 45 ఏళ్ల లోనే చనిపోవడంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురయింది.

ఇక ఆయన జీవిత విశేషాల గురించి తెలుసుకుంటే చిరంజీవి అంటే ఆయనకు అత్యంత ఇష్టం. ఉత్తమ సినిమాలు రూపొందించాలన్న ఆసక్తితో ఆయన దర్శకుడు కావాలని తపన పడేవారు. 1992లో దేవదాస్‌ కనకాల శిక్షణలో దర్శకత్వంపై మెళకువలు నేర్చుకున్న ఆయన తర్వాత ఎల్బీ శ్రీరామ్‌ కి అసిస్టెంట్ గా పని చేశారు. హాస్యనటుడు ఆలీ నటించిన సినిమాలకు ఆయన స్క్రిప్టు రైటింగ్ లో సహాయం అందించారు. అయితే దర్శకత్వంపై మక్కువ ఉన్నప్పటికీ అవకాశాలు రాకపోవడంతో సినిమా ఇండస్ట్రీ కి దూరమై బుల్లితెర వైపు అడుగులు వేశారు. పలు న్యూస్ ఛానల్ లలో విలేకరిగా పనిచేశారు.

ఆ తర్వాత యూట్యూబ్ లో ఫ్రాంక్లీ విత్ టీఎన్‌ఆర్‌ అనే ఛానల్ స్టార్ట్ చేసి ప్రముఖులను ఇంటర్వ్యూ చేయడం ప్రారంభించారు. అయితే ఆయన ఇంటర్వ్యూ చేసే విధానం నచ్చడంతో ఆయన వీడియోలు రెండుగంటలకుపైగా ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో చూసేవారు. ఎంతోమందిని ఇంటర్వ్యూ చేసి ఎన్నో విషయాలను తెలియజేస్తూ తెలుగులో ఉత్తమ ఇంటర్వ్యూయర్ గా పేరు తెచ్చుకున్నారు.

కొంతకాలం తర్వాత సినిమాల్లో నటించే అవకాశాలు రావడంతో ఆయన వెండితెరపై అరంగేట్రం చేశారు. ‘బోణి’ సినిమాలో మంత్రి పాత్ర పోషించి ప్రేక్షకులను బాగా అలరించిన ఆయన తర్వాత వరుసగా క్యారెక్టర్ రోల్స్ సంపాదించారు. ఇటీవల వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ వై సినిమాలో ఆయన కీలక పాత్ర పోషించి ప్రేక్షకులను అలరించారు. మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న ఆయన మంచి దర్శకుడిగా కూడా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న క్రమంలోనే కరోనా బారిన పడి మరణించారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టీమిండియా క్రికెటర్‌ ఇంట విషాదం..క‌రోనాతో తండ్రి మృతి..!!

ఇంతకీ పప్పన్నం ఎప్పుడు పెడతావో చెప్పన్నా .... ??

బ్రహ్మచారి 'దేవి' పెళ్లికి మహూర్తం ఎప్పుడో..?

TNR మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం..!!

వెండి తెర మీదా తళుక్కున మెరిసిన పరిటాల శ్రీరాం ?

ఆ చక్రవర్తిగా మహేష్ బాబు.. ఒప్పించిన రాజమౌళి..!!

బ్రేకింగ్: కరోనాతో జర్నలిస్ట్ TNR కన్నుమూత..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>