PoliticsSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-641f6bb9-dcd1-4e0f-bda4-ba1d85e18e92-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-641f6bb9-dcd1-4e0f-bda4-ba1d85e18e92-415x250-IndiaHerald.jpgకరోనా భారత దేశాన్ని వణికిస్తోంది. వారూ వీరూ తేడా లేకుండా అందరి మీద పగ పట్టేసింది. దాని కాటుకు ఎవరూ అతీతులు కారు అని కూడా తెలిసిపోయింది. కలి కాలం బదులుగా కరోనా కాలం అని చదువుకోవాల్సివస్తోంది. మరో వైపు చూస్తే రోజుకు నాలుగు లక్షలకు తక్కువ లేకుండా కేసులు నమోదు అవుతున్నాయి. carona;cbn;nani;kodali nani;jagan;minister;war;police station;traffic police;partyవేరియెంట్ వార్... పాలిటిక్స్ హుషార్.... ?వేరియెంట్ వార్... పాలిటిక్స్ హుషార్.... ?carona;cbn;nani;kodali nani;jagan;minister;war;police station;traffic police;partySun, 09 May 2021 10:23:22 GMTకరోనా భారత దేశాన్ని వణికిస్తోంది. వారూ వీరూ తేడా లేకుండా అందరి మీద పగ పట్టేసింది. దాని కాటుకు ఎవరూ అతీతులు కారు అని కూడా తెలిసిపోయింది. కలి కాలం బదులుగా కరోనా కాలం అని చదువుకోవాల్సివస్తోంది. మరో వైపు చూస్తే రోజుకు నాలుగు లక్షలకు తక్కువ లేకుండా కేసులు నమోదు అవుతున్నాయి.

ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా రాజకీయాల జోరు ఎక్కడా ఆగడంలేదు. అధికార పార్టీ మీద దుమ్మెత్తిపోయడానికి కరోనా సాకుని విపక్షాలు చక్కగా ఉపయోగించుకుంటున్నాయి. కరోనాతో జనం అల్లాడుతూంటే అంతా కలసి సాయం చేయాలి. ఈ ఆపద సమయంలో తలా ఒక చేయి వేస్తేనే తప్ప అడుగు ముందుకు పడదు. కానీ ఏపీలో జగన్ సర్కార్ కి చంద్రబాబు టార్గెట్ చేశారు. ఆయన కరోనా పెరిగిపోవడానికి జగనే కారణం అంటున్నారు. అంతే కాదు కర్నూల్ లో ఎన్ 440 కె భయంకరమైన  వేరియెంట్ వేగంగా వ్యాపిస్తోందని కూడా చెప్పుకొచ్చారు.

అసలే కరోనా భయంతో ఉన్న జనాలకు ఇది కంగారు పుట్టించే వార్తే.  పానిక్ సిట్యుయేషన్ ని ఎవరూ కోరి క్రియేట్ చేయకూడదు. కానీ బాబు మాత్రం జనాలను అప్రమత్తం చేయడానికి ప్రభుత్వానికి వేడి పుట్టించడానికి ఇలా చేశానని చెబుతున్నారు. మరి అక్కడ ఉన్నది జగన్. ఆయన ఇదంతా చూస్తూ ఊరుకుంటారా. అందుకే చంద్రబాబు మీద కర్నూల్ పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ అయింది.

ఇది కక్ష సాధింపు అని విపక్షం అంటోంది. మరో వైపు ఏపీలో ప్రమాదకరమైన వేరియెంట్లు లేవని, ఉన్నదల్లా నారా వారి వేరియెంట్ మాత్రమేనని మంత్రి కొడాలి నాని చంద్రబాబును గట్టిగా అటాక్ చేశారు. ఏది ఏమైనా కరోనా సంగతి పక్కన పెట్టి మరీ ఏపీలో రాజకీయం జోరుగా సాగుతోంది. కరోనా విషయంలో అంతా కలసి అదుపు చేసేందుకు ప్రయత్నం చేయల్సిన వేళ ఇలా రాజకీయాలు చేయడం అంటే బాధాకరేమే. ఇందులో ఎవరూ ఎక్కువ కాదు, తక్కువా కాదు, మొత్తానికి ఏపీలో కరోనా వేరియెంట్ వారు యమ జోరుగా సాగుతోంది.








Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హ్యాపీ సండే 9-MAY : ఈ వారం వివాదాల్లో నిలిచిన‌ సెల‌బ్రెటీలు వీరే.. ?

ఈ స్పెషల్ రికార్డులు ఒక్క సాయి పల్లవికే సొంతం.. ఎవరూ అందుకోలేరు..!!

కరోనా విజృంభణలో ఆ మూడు రాష్ట్రాలే టాప్..!!

మ‌ద‌ర్స్ డే : ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే.. !

సాయి పల్లవి విజయ రహస్యమిదే ?

హ్యాపీ సండే 9-MAY: ఈ వారం ఎన్టీఆర్ విశేషాలివే.. !

మదర్స్ డే: రాజీవ్‌ గాంధీని నడిపించిన శక్తి ఇందిరాగాంధీ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>