PoliticsSpydereditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/etala-kcr931094d9-9944-4d84-a364-203803ccb04e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/etala-kcr931094d9-9944-4d84-a364-203803ccb04e-415x250-IndiaHerald.jpgమాజీ మంత్రి ఈటల రాజేందర్‌ పార్టీకి, ఎమ్మెల్యే ప‌ద‌వికి త్వ‌ర‌లోనే రాజీనామా చేయ‌నున్నార‌ని తెలుస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న భ‌విష్య‌త్ రాజ‌కీయ ప్ర‌యాణంపై ర‌క‌ర‌కాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయ‌న ప్ర‌త్యేకంగా రాజ‌కీయ పార్టీ పెట్ట‌బోతున్నార‌న్న‌ది ప్ర‌చారంలో ప్ర‌ధాన‌మైన అంశమ‌ని చెప్పాలి. అదే జ‌రిగితే పార్టీలోని అసంతృప్తులు, ఉద్య‌మ‌కాలంలో ప‌నిచేసి రాజ‌కీయంగా గుర్తింపు ద‌క్క‌ని నేత‌లు, ఇత‌ర పార్టీల్లోని మాజీ ఎమ్మెల్యేలు, టీఆర్ ఎస్‌లోని మాజీ ఎమ్మెల్యేలు, అవ‌కాశాలు ద‌క్క‌క ఎదురుచూస్తున్న క్యాడ‌ర్etela;kcr;telangana;రాజీనామా;backward classes;mla;minister;partyబీసీ నినాద‌మే ఈట‌ల‌ను నిల‌బెట్ట‌నుందా..? తెలంగాణ‌ సామాజిక కోణం మారిందా..?బీసీ నినాద‌మే ఈట‌ల‌ను నిల‌బెట్ట‌నుందా..? తెలంగాణ‌ సామాజిక కోణం మారిందా..?etela;kcr;telangana;రాజీనామా;backward classes;mla;minister;partySun, 09 May 2021 11:16:18 GMTమాజీ మంత్రి ఈటల రాజేందర్‌ పార్టీకి, ఎమ్మెల్యే ప‌ద‌వికి త్వ‌ర‌లోనే రాజీనామా చేయ‌నున్నార‌ని తెలుస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న భ‌విష్య‌త్ రాజ‌కీయ ప్ర‌యాణంపై ర‌క‌ర‌కాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయ‌న ప్ర‌త్యేకంగా రాజ‌కీయ పార్టీ పెట్ట‌బోతున్నార‌న్న‌ది ప్ర‌చారంలో ప్ర‌ధాన‌మైన అంశమ‌ని చెప్పాలి. అదే జ‌రిగితే పార్టీలోని అసంతృప్తులు, ఉద్య‌మ‌కాలంలో ప‌నిచేసి రాజ‌కీయంగా గుర్తింపు ద‌క్క‌ని నేత‌లు, ఇత‌ర పార్టీల్లోని మాజీ ఎమ్మెల్యేలు, టీఆర్ ఎస్‌లోని మాజీ ఎమ్మెల్యేలు, అవ‌కాశాలు ద‌క్క‌క ఎదురుచూస్తున్న క్యాడ‌ర్ ఆయ‌న పంచ‌న చేరుతాయ‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఇది జ‌ర‌గ‌డానికి ఎంత ఆస్కారం ఉందో... జ‌ర‌గ‌క‌పోవ‌డానికి అంతే ఆస్కారం ఉంద‌ని విశ్లేష‌కులు సూచిస్తున్నారు. మొత్తంగా ఈట‌ల వ్య‌వ‌హారం రాష్ట్ర రాజ‌కీయాల్లో అతిపెద్ద హాట్ టాపిక్‌గా మారింది.

ఈట‌ల వ్య‌వ‌హారంపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఈ విష‌యం నుంచి మీడియాను ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు కూడా ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌డం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. బీసీ ఉద్య‌మాలు ఇప్ప‌టికే బ‌లంగా ఉన్న నేప‌థ్యంలో బీసీ నినాదం ఎత్తుకుంటే ఈట‌ల‌ రాజ‌కీయ ప్ర‌యాణానికి, అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన సామాజిక వ‌ర్గాల‌కు న్యాయం ద‌క్కే ఆలోచ‌న‌ను జ‌నంలోకి తీసుకెళ్ల గ‌లిగితే క‌చ్చితంగా విజ‌యం ద‌క్కుతుంద‌ని ఆయ‌న స‌న్నిహితులు సూచిస్తున్నారంట‌. తెలంగాణ రాజ‌కీయాల్లో కుల బ‌లం త‌క్కువ‌. ప్ర‌మేయం కూడా త‌క్కువే.. కానీ గ‌డిచిన కొన్నేళ్ల నాటి రాజ‌కీయాల‌ను, హామీల‌ను ప‌రిశీలిస్తే ఇక్క‌డ కూడా కుల ప్ర‌భావం పెరుగుతోంది.


తెలంగాణ సమాజంలో ఇంతకాలం కులం అంతర్లీనంగా ఉందని ఒప్పుకుని తీరాల‌ని చెబుతున్నారు విశ్లేష‌కులు. తెలంగాణలో కులాల ప్రాతినిధ్యాలు ఎక్కువే అయినా ఉమ్మడి రాష్ట్రంలో అవి అంతగా ప్రాధాన్యం కాలేదు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక తెలంగాణ సమాజంలో కులాలు సైతం ఆ స్పృహను పెంపొందించుకున్నాయి. తమ అస్తిత్వాన్ని చాటాయి. అభ్యున్నతికి ప్రయత్నించాయి. మొదటగా కొలువుదీరిన తెలంగాణ రాష్ట్ర సమితి కూడా దీన్ని గుర్తించిందనే చెప్పాలి. పార్టీలు కుల ప్రాతిపదికనే ఆలోచించినా ఓటర్లలో అంతగా కుల సమీకరణలు కనిపించేవి కావు. కానీ ఆరున్న‌రేళ్ల‌లో  పరిస్థితి మారింది. కులం కిందిస్థాయిలో కూడా బలం పుంజుకుంది. అందుకే కుల‌ రాజ‌కీయ‌మే ఈట‌ల‌కు మేలు..










Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎడిటోరియల్: ఇక బెంగాల్ వేదికగా మమత - మోదీ సమరం - రణభేరి మ్రోగింది

ఈ టైం లో ఇవేం పనులు సార్...?

అమ్మ ఇచ్చిన వెయ్యి రూపాయిలతో కోట్లకు అధిపతి అయిన కోటి రెడ్డి !

వేరియెంట్ వార్... పాలిటిక్స్ హుషార్.... ?

ఈ స్పెషల్ రికార్డులు ఒక్క సాయి పల్లవికే సొంతం.. ఎవరూ అందుకోలేరు..!!

కరోనా విజృంభణలో ఆ మూడు రాష్ట్రాలే టాప్..!!

మ‌ద‌ర్స్ డే : ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>