Moviesyekalavyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-fans-trolling-salman-khandd336258-91f9-4308-bc7f-3d497f1f4318-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-fans-trolling-salman-khandd336258-91f9-4308-bc7f-3d497f1f4318-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్‌లోకి, బాలీవుడ్ సినిమాలు టాలీవుడ్‌లోకి.. ఇలా అన్ని ఉడ్‌ల సినిమాల మిగతా ఉడ్‌లలోకి రీమేక్‌లు జరిగిపోతున్నాయి. ఇందులో కొన్ని సినిమాలు కేవలం కొన్ని సినిమాల్లోని హిట్ సాంగ్స్‌ను తీసుకుని రీమేక్ చేసుకుంటున్నాయి కూడా. అయితే ఆ రీమేక్ ఏ స్థాయిలో ఉందనే దానిపైనే ఆ రీమేడ్ సాంగ్ సక్సెస్ ఉంటుంది. తాజాగా రాదే సినిమా కోసం సల్లూ భాయ్ కూడా ఇలాంటి ప్రయోగమే..happy-sunday;mahesh;prabhu deva;salman khan;allu arjun;disha patani;jaaki;bollywood;tollywood;cinema;twitter;remake;comedy;success;duvvada jagannadham;arjun 1;v;raccha;khaleja;baadshahస్పెషల్ సండే: అల్లు పాట చెడదొబ్బావ్ కదా సల్లూభాయ్‌! వారం నుంచి ఒకటే ట్రోల్స్స్పెషల్ సండే: అల్లు పాట చెడదొబ్బావ్ కదా సల్లూభాయ్‌! వారం నుంచి ఒకటే ట్రోల్స్happy-sunday;mahesh;prabhu deva;salman khan;allu arjun;disha patani;jaaki;bollywood;tollywood;cinema;twitter;remake;comedy;success;duvvada jagannadham;arjun 1;v;raccha;khaleja;baadshahSun, 09 May 2021 16:00:00 GMTటాలీవుడ్ సినిమాలు బాలీవుడ్‌లోకి, బాలీవుడ్ సినిమాలు టాలీవుడ్‌లోకి.. ఇలా అన్ని ఉడ్‌ల సినిమాల మిగతా ఉడ్‌లలోకి రీమేక్‌లు జరిగిపోతున్నాయి. ఇందులో కొన్ని సినిమాలు కేవలం కొన్ని సినిమాల్లోని హిట్ సాంగ్స్‌ను తీసుకుని రీమేక్ చేసుకుంటున్నాయి కూడా. అయితే ఆ రీమేక్ ఏ స్థాయిలో ఉందనే దానిపైనే ఆ రీమేడ్ సాంగ్ సక్సెస్ ఉంటుంది. తాజాగా రాదే సినిమా కోసం సల్లూ భాయ్ కూడా ఇలాంటి ప్రయోగమే చేశాడు. అయితే ఈ ప్రయోగం బాలీవుడ్ ఫ్యాన్స్‌కు, సల్లూ భాయ్‌కు ఫ్యాన్స్‌కు ఎలా అనిపించిదో ఏమో కానీ.. టాలీవుడ్ ఫ్యాన్స్ మాత్రం సల్లూ భాయ్‌ని తెగ తిట్టి పోస్తున్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తూ నానా రచ్చ చేస్తున్నారు. దాదాపు ఈ వారమంతా బాలీవుడ్‌పై టాలీవుడ్ ఫ్యాన్స్ దాడి కొనసాగింది.

టాలీవుడ్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎలాంటి డ్యాన్స్‌ర్ అనే విషయం అందరికీ తెలుసు. ఇక డీజే సినిమాలోని సీటీమార్ పాటకు అల్లు అర్జున్ వేసిన స్టెప్పులు ఇప్పటికీ టాప్ లేపుతుంటాయి. అలాంటి పాట బాలీవుడ్‌లో రీమేక్ అవుతుందంటే అటు బాలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్ అభిమానులు కూడా ఎంతో ఎగ్జైట్ అయ్యారు. అయితే ఆ పాటను సల్లూ భాయ్య రీమేక్ చేస్తున్నాడని తెలిసేసరికి టాలీవుడ్ ఫ్యాన్స్ కొంత భయపడ్డారు. చివరికి వాళ్లు భయపడినంతా జరిగింది. దీంతో సల్లు భాయ్ పాటలో డాన్స్ వేయకపోగా.. వెకిలి చేష్టలతో, వింత స్టెప్పులతో పాటను ఖూనీ చేసేశాడంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.
 
సల్లూ భాయ్ అంత డ్యాన్సర్ కాదు. నిజానికి ఓ మోస్తరు డ్యాన్సర్ కూడా కాదు. ఏదో అలా అలా బండి నెట్టేస్తుంటారు. అలాంటిది సీటీమార్ సినిమాను పాటను ఎంచుకోవడం ఓ సాహసమనే చెప్పాలి. చివరికి ఈ పాట టాలీవుడ్ ఫ్యాన్స్‌కు నచ్చక పోవడంతో ట్విటర్ వేదికగా.. విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇక యూట్యూబ్‌లో అయితే దీనిపై ట్రోలింగ్ వీడియోలు కూడా వస్తున్నారు. ఈ వారం రోజుల్లో దాదాపు 100ల సంఖ్యలో ఇలాంటి వీడియోలు యూట్యూబ్‌లో చక్కర్లు కొట్టాయి. ఇక ట్వీట్లు లెక్క పెట్టడం కూడా కష్టమే.

అంతేకాకుండా అల్లు అర్జున్ వేసిన స్టెప్స్‌, సల్మాన్ వేసిన స్టెప్స్ కంపేర్ చేస్తూ.. బన్నీ వేసినవి స్టైలిష్‌గా ఉంటే.. సల్లూ భాయ్ వేసినవి ఏదో చేతకాక ఇంకేదో చేసినట్లు ఉందంటూ ట్రోల్స్ మొదలయ్యాయి. టాలీవుడ్‌లోని అనేక సినిమాల్లోని కామెడీ క్లిప్స్ తీసుకుని ఈ స్టెప్స్‌ వీడియోలను ఎడిట్ చేసి వీడియోలు పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు. బాద్‌షా సినిమాలో నాజర్ డ్యాన్స్‌కు కుటుంబ సభ్యులంతా తిట్టే వీడియో, ఖలేజా సినిమాలో బ్రహ్మిని మహేశ్ తిట్టే వీడియో.. అబ్బో ఇలా ఎన్నో వీడియోలు ఎడిట్ చేసి పోస్టులు పెడుతున్నారు. వీటిలో కొన్ని మీకోసం మిస్ కాకుండా చూడండి.

కాగా.. సల్మాన్ ఖాన్ రాధ సినిమా మే 13న థియేటర్లలోకి రాబోతోంది. అదే రోజు జీ ప్లెక్స్ ద్వారా ఓటీటీలో కూడా విడుదల కానుంది. ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తోంది. రణదీప్ హుడా, జాకీ ష్రాఫ్ ముఖ్యపాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమాకి ప్రభుదేవా దర్శకత్వం వహించారు.

" style="height: 370px;">

" style="height: 370px;">


" style="height: 370px;">


" style="height: 370px;">








Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నెటిజన్‌పై విరుచుకుపడ్డ తమన్.. నువ్వో వేస్ట్ ఫెలో అంటూ..

'మే 9'.. వైజయంతీ మూవీస్ కి చాలా స్పెషల్.. ఎందుకో మీరే చూడండి..??

తనదైన స్టైల్ లో మదర్స్ డే విషెస్ తెలిపిన ఆర్జీవీ..

తాను పడ్డ కష్టం ఏ తల్లి పడకూడదు అని గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శ్రీజారెడ్డి..!!

విజయ్ దేవరకొండ ఆస్తి అన్ని కోట్లా..?

ఈ పాన్ ఇండియా సినిమాలు ఇప్పట్లో వచ్చేలా లేవు!!

ఎన్టీఆర్ ప్రతి విజయం వెనుక చెరగని సంతకం!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>