PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/yanamala-rama-krishna0a3e878c-e531-491f-9164-cd29ec0c3a97-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/yanamala-rama-krishna0a3e878c-e531-491f-9164-cd29ec0c3a97-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తెలుగుదేశం పార్టీ నేతలు ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజకీయంగా ఈ అంశం కాస్త ఇబ్బందికరంగా మారింది. ఇక కొత్త రకం కరోనా విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేసిన విషయం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఇప్పుడు కరోనా కట్టడి మానేసి టీడీపీ నేతల మీద కక్ష సాధిస్తున్నారు అంటూ మండిపడుతున్నారు. వాక్సిన్ విషయంలో కూడా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుyanamala ramakrishndu,tdp,ap;ramakrishna;telugu desam party;nara lokesh;andhra pradesh;telugu;chief minister;tdp;oxygen;reddy;partyసెకండ్ వేవ్ ముప్పు ఉందని తెలిసినా లైట్ తీసుకున్నారా...?సెకండ్ వేవ్ ముప్పు ఉందని తెలిసినా లైట్ తీసుకున్నారా...?yanamala ramakrishndu,tdp,ap;ramakrishna;telugu desam party;nara lokesh;andhra pradesh;telugu;chief minister;tdp;oxygen;reddy;partySun, 09 May 2021 12:07:56 GMTఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తెలుగుదేశం పార్టీ నేతలు ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజకీయంగా ఈ అంశం కాస్త ఇబ్బందికరంగా మారింది. ఇక కొత్త రకం కరోనా విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేసిన విషయం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఇప్పుడు కరోనా కట్టడి మానేసి టీడీపీ నేతల మీద కక్ష సాధిస్తున్నారు అంటూ మండిపడుతున్నారు. వాక్సిన్ విషయంలో కూడా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.

తాజాగా టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేసారు. కరోనా కట్టడిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే ముఖ్యమంత్రి చోద్యం చూస్తున్నారు అని విమర్శించారు. సెకండ్ వేవ్ ముప్పు పొంచి ఉందని తెలిసినా ప్రభుత్వ నిర్లక్ష్యం వహించింది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రపంచమంతా కరోనాపై పోరాడుతుంటే జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థులపై పోరులో బిజీగా ఉన్నారు అని విమర్శలు చేసారు. ముఖ్యమంత్రి పాలనా సమయం మొత్తం రాజకీయ కక్షసాధింపు చర్యలకే కేటాయిస్తున్నారు అని ఆరోపించారు.

ఎన్440కే వైరస్ గురించి చంద్రబాబు ముందుగానే అప్రమత్తం చేయడం తప్పా? అని నిలదీశారు. కరోనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు, లోకేశ్ పై అక్రమ కేసుల బనాయింపు అని మండిపడ్డారు. ఆక్సిజన్ , బెడ్లు, వెంటిలేటర్ల కొరతతో కరోనా రోగులు అల్లాడిపోతున్నారు అని విమర్శించారు. సకాలంలో వైద్యం అందక వేలాదిమంది చనిపోతున్నా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోంది అని విమర్శించారు. వ్యాక్సిన్ కొనుగోలుకు రూ. 45 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారు అని విమర్శించారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలేవు అని అన్నారు. రోగుల ఆర్తనాదాలు ఈ ప్రభుత్వానికి వినపడంలేదా? సంక్షోభాలను ఎదుర్కొనే సత్తా జగన్మోహన్ రెడ్డికి లేదు అని మండిపడ్డారు. ప్రత్యర్థులపై వేధింపులను కట్టిపెట్టి ప్రజారోగ్యంపై దృష్టిపెట్టాలి అని సూచించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వణుకుపుట్టించే వార్త చెప్పిన CDC..తీవ్ర హెచ్చరిక..!!

చిరు మోహన్ బాబు మల్టీస్టారర్ అలా ఆగింది... ?

ఎడిటోరియల్: ఇక బెంగాల్ వేదికగా మమత - మోదీ సమరం - రణభేరి మ్రోగింది

ఈ టైం లో ఇవేం పనులు సార్...?

అమ్మ ఇచ్చిన వెయ్యి రూపాయిలతో కోట్లకు అధిపతి అయిన కోటి రెడ్డి !

వేరియెంట్ వార్... పాలిటిక్స్ హుషార్.... ?

ఈ స్పెషల్ రికార్డులు ఒక్క సాయి పల్లవికే సొంతం.. ఎవరూ అందుకోలేరు..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>