MoviesAnilkumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acctress-sai-pallavice77b048-945e-4a92-b4a5-8c2bf98dc328-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acctress-sai-pallavice77b048-945e-4a92-b4a5-8c2bf98dc328-415x250-IndiaHerald.jpgగ్లామర్‌ పాత్రలకంటే గ్రామర్‌ పాత్రలకే ఓటు వేస్తుందామె.. ఆ పాజిటివ్‌ దృక్పథంతోనే మేకప్‌ లేకుండా ఎంపిక చేసుకున్న పాత్రల్లో ఒదిగిపోతుంది..సినీ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీ గా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది సాయి పల్లవి..ఇక ఈ రోజు (అనగా మే9) ఈ అందాల భామ పుట్టినరోజు సందర్భంగా..సాయి పల్లవి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం.. టాలీవుడ్లో క్లాసికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ సరసన ఫిదా' చిత్రంలో భానుమతిగా, న్యాచురల్ స్టార్ నాని సరసన 'మిడిల్ క్లాస్‌ అబ్బాయి'లో పల్లవిగా (చిAcctress Sai Pallavi;beauty;nani;naga chaitanya;abinaya;bhama;bhanu;naga;sekhar;shyam;varun;varun sandesh;varun tej;kamma;cinema;telugu;naga aswin;tamil;dance;interview;director;chaitanya 1;sai pallavi;fidaa;chitramబర్త్ డే స్పెషల్ : 'సాయి పల్లవి' లైఫ్ లో మరిచిపోలేని హ్యాపీ మూమెంట్ అదేనట..!!బర్త్ డే స్పెషల్ : 'సాయి పల్లవి' లైఫ్ లో మరిచిపోలేని హ్యాపీ మూమెంట్ అదేనట..!!Acctress Sai Pallavi;beauty;nani;naga chaitanya;abinaya;bhama;bhanu;naga;sekhar;shyam;varun;varun sandesh;varun tej;kamma;cinema;telugu;naga aswin;tamil;dance;interview;director;chaitanya 1;sai pallavi;fidaa;chitramSun, 09 May 2021 17:00:00 GMTగ్లామర్‌ పాత్రలకంటే గ్రామర్‌ పాత్రలకే ఓటు వేస్తుందామె.. ఆ పాజిటివ్‌ దృక్పథంతోనే మేకప్‌ లేకుండా ఎంపిక చేసుకున్న పాత్రల్లో ఒదిగిపోతుంది..సినీ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీ గా   ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది సాయి పల్లవి..ఇక ఈ రోజు (అనగా మే9) ఈ అందాల భామ పుట్టినరోజు సందర్భంగా..సాయి పల్లవి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం.. టాలీవుడ్లో క్లాసికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ సరసన ఫిదా' చిత్రంలో భానుమతిగా, న్యాచురల్ స్టార్ నాని సరసన 'మిడిల్ క్లాస్‌ అబ్బాయి'లో పల్లవిగా (చిన్ని), 'పడిపడి లేచె మనసు'లో వైశాలిగా కనిపించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసుకుంది.

 నాగ చైతన్య సరసన నటించిన 'లవ్‌స్టోరీ', రానాతో కలిసి నటించిన 'విరాటపర్వం' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ అమ్మడు తెలుగులో నటించింది కొన్ని సినిమాలే అయినా ఓ వైపు డబ్బింగ్‌ చిత్రాలతో, మరోవైపు అదిరిపోయే గీతాలతో ఇక్కడి వారిని ఎప్పుడూ అలరిస్తూనే ఉంటుంది సాయి పల్లవి. తమిళ చిత్రం 'మారి 2'లో ధనుష్‌తో కలిసి స్టెప్పులేసి 'రౌడీ బేబీ'గా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. విడుదలకు ముందే తన అభినయం, నృత్యంతో సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. ఆ కోవలోకి వచ్చేవే.. 'లవ్‌స్టోరీ'లోని సారంగ దరియా, 'విరాటపర్వం'లోని కోలో పాటలు. సాయి పల్లవి డ్యాన్సు అంటే యూట్యూబ్‌ రికార్డులు అనాల్సిందే!

అభినయం, నృత్యం మాత్రమే కాదు తన పాత్రలకు తనే డబ్బింగ్‌ చెప్పుకోవడం విశేషం... ఇదిలా ఉంటె సాయి పల్లవి లైఫ్ లో మరిచిపోలేని ఓ సంఘటన ఉందట.. ఈ విషయాన్ని తాజగా ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి తెలియజేస్తూ.." నేను అల్లు అర్జున్‌ డ్యాన్సులకి పెద్ద అభిమానిని. అలాంటిది ఆయనే ఓ సందర్భంలో 'ఫిదా'లోని వచ్చిండే పాట ఎన్నో సార్లు చూశానని, నా డ్యాన్సుని ప్రశంసించడం చెప్పలేనంత సంతోషానిచ్చింది..ఆ హ్యాపీ మూమెంట్ ని నా లైఫ్ లో మర్చిపోలేనని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది సాయి పల్లవి..ఇక ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నాని సరసన 'శ్యామ్ సింగరాయ్' సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ..!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎమ్మెస్ రాజు అస్సలు తగ్గట్లేదుగా... డర్టీ హరి తర్వాత కొత్త ప్రయోగం?

తాను పడ్డ కష్టం ఏ తల్లి పడకూడదు అని గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శ్రీజారెడ్డి..!!

విజయ్ దేవరకొండ ఆస్తి అన్ని కోట్లా..?

ఈ పాన్ ఇండియా సినిమాలు ఇప్పట్లో వచ్చేలా లేవు!!

ఎన్టీఆర్ ప్రతి విజయం వెనుక చెరగని సంతకం!

ఏపి తెలంగాణలో లాక్డౌన్ అత్యవసరం: నిపుణులు

చంద్రబాబు ఎమ్మెల్యే కావడం వెనుక ఆయన తల్లి పాత్ర ఎంతుందో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>