PoliticsMaddipati Lakshmi Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/corona-sankshobham-vyavastala-madhya-vivadamb2870d39-1054-4ab4-9d59-93cb6837992e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/corona-sankshobham-vyavastala-madhya-vivadamb2870d39-1054-4ab4-9d59-93cb6837992e-415x250-IndiaHerald.jpgదేశ‌వ్యాప్తంగా త‌న పంజా విసురుతూ, జ‌నజీవ‌నాన్ని అత‌లాకుత‌లం చేస్తున్న‌ క‌రోనా మ‌హ‌మ్మారి రాజ్యాంగబ‌ద్ద వ్య‌వ‌స్థ‌ల మ‌ధ్య కూడా విభేదాల‌ను సృష్టిస్తోంది. కరోనా తీవ్రంగా వ్యాపించడానికి ఎన్నికల కమిషనే కారణమని, అందుకు కమిషన్‌పై హత్యానేరం మోపాలని మద్రాస్‌ హైకోర్టు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఎన్నిక‌ల సంఘం త‌న అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. ఈ అంశంపై ఎన్నికల సంఘంలో ప్రకంపనలు ఇంకా ఆగ‌లేదు.ECofIndia;hari;hari music;tiru;రాజీనామా;high court;media;court;lawyer;election;election commission;chief commissioner of elections;panjaaక‌రోనా సంక్షోభం.. వ్య‌వ‌స్థ‌ల మ‌ధ్య వివాదం..?క‌రోనా సంక్షోభం.. వ్య‌వ‌స్థ‌ల మ‌ధ్య వివాదం..?ECofIndia;hari;hari music;tiru;రాజీనామా;high court;media;court;lawyer;election;election commission;chief commissioner of elections;panjaaSun, 09 May 2021 01:09:00 GMTపంజా విసురుతూ, జ‌నజీవ‌నాన్ని అత‌లాకుత‌లం చేస్తున్న‌ క‌రోనా మ‌హ‌మ్మారి రాజ్యాంగబ‌ద్ద వ్య‌వ‌స్థ‌ల మ‌ధ్య కూడా విభేదాల‌ను సృష్టిస్తోంది. కరోనా తీవ్రంగా వ్యాపించడానికి ఎన్నికల కమిషనే కారణమని, అందుకు కమిషన్‌పై హత్యానేరం మోపాలని మద్రాస్‌ హైకోర్టు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఎన్నిక‌ల సంఘం త‌న అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. ఈ అంశంపై ఎన్నికల సంఘంలో ప్రకంపనలు ఇంకా ఆగ‌లేదు. కోర్టు వ్యాఖ్యలపై మనస్తాపం చెందిన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌.. హైకోర్టు చేసిన‌ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాల‌ని కోరారు. లేకుంటే.. వ్యక్తిగతంగా బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేసేందుకూ తాను సిద్ధ‌మేన‌ని ఆయ‌న ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశార‌ట‌. కోర్టు వ్యాఖ్యలకు నిరస‌న‌గా అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు కూడా ఆయన సిద్ధపడినట్టు సమాచారం.ప్రజాస్వామ్య పరిరక్షణ విషయంలో కమిషన్‌పై వచ్చిన అనుమానాలను తొలగించాల్సిన స‌త్వ‌ర‌ అవసరం ఉందని, లేకుంటే కమిషన్‌పై ఆరోపణలు మరింత తీవ్రమవుతాయని రాజీవ్‌ కుమార్‌ తన అఫిడవిట్‌లో అభిప్రాయం వ్య‌క్తం చేశార‌ట‌. అయితే రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల మ‌ధ్య ఇలాంటి విభేదాలు మ‌రింత‌ ముద‌ర‌డం ఎంత‌మాత్రం వాంఛ‌నీయం కాద‌ని భావిస్తూ.. హైకోర్టులోగానీ, సుప్రీంకోర్టులోగానీ ఈ అఫిడవిట్‌ను దాఖలు చేసేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ అంగీకరించలేదని తెలుస్తోంది.

నిజానికి క‌రోనా వైర‌స్ వ్యాప్తి తీవ్ర‌మ‌వుతున్న స‌మ‌యంలో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం కార‌ణంగానే ప్ర‌జ‌ల ప్రాణాలకు ముప్పు ఏర్ప‌డింద‌ని, ఎన్నిక‌ల క‌మిష‌న్ మ‌రింత అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించి ఎన్నిక‌ల‌ను వాయిదా వేసి ఉండాల్సింద‌న్న ఉద్దేశంతో కోర్టు ఈ విధంగా స్పందించింది. అయితే ఈ వివాదం మ‌రిన్ని మ‌లుపులు తిరుగుతోంది. తాను నమ్ముకున్న విలువలకు.. ఎన్నికల కమిషన్‌ ప్రస్తుత విధానాలతో సరిపడడం లేదని విమర్శిస్తూ సుప్రీంకోర్టులో కమిషన్‌ తరఫు న్యాయవాది మోహిత్‌ డి. రామ్‌ రాజీనామా చేశారు. 2013 నుంచి కమిషన్‌ న్యాయవాదుల ప్యానెల్‌లో పనిచేస్తున్న మోహిత్‌ రామ్‌.. సుప్రీంకోర్టులో కమిషన్‌ తరఫున వాదించే బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్టు తాజాగా వెల్లడించారు. ఎన్నికల కమిషన్‌లో వృత్తిపరంగా తానెన్నో అద్భుతమైన మైలురాళ్లు అధిగమించానన్నారు. కోర్టులో విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసే పరిశీలనలను మీడియా రిపోర్ట్‌ చేయకుండా చూడాలని కోరుతూ ఈసీ సుప్రీం తలుపుతట్టిన నేపథ్యంలో మోహిత్‌ రాజీనామా ప్ర‌త్యేక‌ ప్రాధాన్యం సంతరించుకొంది. మద్రాస్‌ హైకోర్టు వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

కాగా ఈ విషయంలో తాము మీడియాపై ఆంక్షలు విధించడం ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో సాధ్యం కాద‌ని, రాజ్యాంగసంస్థలు ఇలాంటి ఫిర్యాదులు చేసే బదులు మెరుగ్గా పనిచేసే ప్ర‌య‌త్నం చేయాల‌ని సుప్రీం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 19వ అధికరణ ప్రజలకు వాక్‌ స్వాతంత్య్రం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కల్పించడంతో పాటు మీడియాకు కూడా హక్కులను కల్పించిందని, మీడియాపై ఆంక్షలు విధించడం అంటే సుప్రీం తన విలువను తాను తగ్గించుకోవడమేనని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. మొత్తంమీద కోవిడ్ సంక్షోభం రాజ్యాంగ సంస్థ‌ల పైనా త‌న ప్ర‌భావం చూపుతోంది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మహేష్‌బాబు అత్తమ్మ మిస్ ఇండియా అయ్యేదట.. కానీ జస్ట్ మిస్!

'మే 9'.. వైజయంతీ మూవీస్ కి చాలా స్పెషల్.. ఎందుకో మీరే చూడండి..??

తనదైన స్టైల్ లో మదర్స్ డే విషెస్ తెలిపిన ఆర్జీవీ..

తాను పడ్డ కష్టం ఏ తల్లి పడకూడదు అని గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శ్రీజారెడ్డి..!!

విజయ్ దేవరకొండ ఆస్తి అన్ని కోట్లా..?

ఈ పాన్ ఇండియా సినిమాలు ఇప్పట్లో వచ్చేలా లేవు!!

ఎన్టీఆర్ ప్రతి విజయం వెనుక చెరగని సంతకం!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Maddipati Lakshmi Sailaja]]>