SmaranaSpydereditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/durgabhai-deshmukhd220814c-36be-406f-b6da-1c4ce1268578-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/durgabhai-deshmukhd220814c-36be-406f-b6da-1c4ce1268578-415x250-IndiaHerald.jpgదుర్గాబాయి దేశ్‌ముఖ్ (జూలై 15, 1909 - మే 9, 1981) భారత స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి, న్యాయవాది, సామాజిక కార్యకర్త . చెన్నై, హైదరాబాదులలో ఉన్న ఆంధ్ర మహిళా సభలను ఈవిడే స్థాపించారు. ఆమె భారతదేశం యొక్క రాజ్యాంగ సభ, భారతదేశం యొక్క ప్రణాళికా సంఘ సభ్యురాలు. ఆమెను భారతదేశంలో సామాజిక సర్వీస్ మదర్ గా పిలిచేవారు. ఆమె నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్ కు మొదటి చైర్‌మన్ గా వ్యవహరించింది.దుర్గాబాయి దేశ్‌ముఖ్ మద్రాసు ప్రెసిడెన్సి (ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్) లోని రాజమండ్రిలో, 1909 జూలై 15 న durgabhai deshmukh;education;india;andhra pradesh;mohandas karamchand gandhi;congress;telugu;hindi;lawyer;chennai;father;lieహెరాల్డ్ స్మ‌రామీ : సోష‌ల్‌ సర్వీస్ మదర్‌గా పేరుగాంచిన దుర్గాబాయి దేశ్‌ముఖ్హెరాల్డ్ స్మ‌రామీ : సోష‌ల్‌ సర్వీస్ మదర్‌గా పేరుగాంచిన దుర్గాబాయి దేశ్‌ముఖ్durgabhai deshmukh;education;india;andhra pradesh;mohandas karamchand gandhi;congress;telugu;hindi;lawyer;chennai;father;lieSun, 09 May 2021 07:04:00 GMTదుర్గాబాయి దేశ్‌ముఖ్ (జూలై 15, 1909 - మే 9, 1981) భారత స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి, న్యాయవాది, సామాజిక కార్యకర్త . చెన్నై, హైదరాబాదులలో ఉన్న ఆంధ్ర మహిళా సభలను ఈవిడే స్థాపించారు. ఆమె భారతదేశం యొక్క రాజ్యాంగ సభ, భారతదేశం యొక్క ప్రణాళికా సంఘ సభ్యురాలు. ఆమెను భారతదేశంలో సామాజిక సర్వీస్ మదర్ గా పిలిచేవారు. ఆమె నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్ కు మొదటి చైర్‌మన్ గా వ్యవహరించింది.దుర్గాబాయి దేశ్‌ముఖ్ మద్రాసు ప్రెసిడెన్సి (ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్) లోని రాజమండ్రిలో, 1909 జూలై 15 న మద్య తరగతి దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో రామారావు, కృష్ణవేణమ్మ దంపతులకు జన్మించారు. 8 ఏండ్ల వయసులో ఆమె మేనమామ సుబ్బారావుతో వివాహమయింది.


తరువాత ఆమె ఆ వివాహాన్ని వ్యతిరేకింది. ఆమె నిర్ణయాన్ని తండ్రి, సోదరుడు అంగీకరించారు. బాల్యం నుండి ప్రతిభాపాటవాలను కనబరుస్తూ పది సంవత్సరాల వయస్సులోనే హిందీలో పాండిత్యాన్ని సంపాదించి, హిందీ పాఠశాలను నెలకొల్పి అన్ని వయసులవారికీ విద్యాబోధన అందించింది. బెనారస్‌ విశ్వవిద్యాలయం నుండి మెట్రి క్యులేషన్‌, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ (పొలిటికల్‌ సైన్స్‌), 1942లో ఎల్‌. ఎల్‌.బి పూర్తిచేసింది. న్యాయశాస్త్రం చదివిన తరువాత మద్రాసులో హైకోర్టు వద్ద సాధన ప్రారంభించింది.దుర్గాబాయి చిన్ననాటి నుండే స్వాతంత్ర్య పోరాటంలో పాలుపంచుకుంది.


 తన 12 యేండ్ల వయసులో ఆంగ్ల విద్యపై పోరాటం ప్రారంభించింది. ఆమె రాజమండ్రిలో బాలికలకు హిందీలో విద్యను అందించడానికి బాలికా హిందీ పాఠశాలను ప్రారంభించింది.  తెలుగుగడ్డ పై మహాత్మా గాంధీ రాకను పురస్కరించుకుని 12 ఏళ్ళ వయసులోనే ఈమె విరాళాలను సేకరించి ఆయనకు అందజేసింది. మహాత్ముని సూచన మేరకు మారు ఆలోచించకుండా తన చేతులకు ఉన్న బంగారు గాజులను కూడా విరాళంగా అందించింది. 1923లో కాకినాడలోని కాంగ్రెస్ సభలకు వాలంటీరుగా పనిచేస్తూ నెహ్రూ వద్ద టిక్కెట్ లేని కారణము చేత ఆయనను అనుమతించక, తన కర్తవ్య నిర్వహణకు గాను ఆయన నుండి ప్రశంసలను పొందింది. ఆ పై మహాత్ముని ఆంధ్ర పర్యటనలలో ఆయన హిందీ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించింది. ఉప్పు సత్యాగ్రహములో పాల్గొని అరెస్టు కాబడింది. స్వాతంత్ర్య సమరకాలంలో ఉద్యమాల్లో పాల్గొని విరామ సమయాల్లో విద్యాభ్యాసం చేసి ఎంఎ, బిఎల్‌, బిఎ ఆనర్స్‌ చేసి న్యాయకోవిదురాలిగా, ప్రఖ్యాత క్రిమినల్‌ లాయర్‌గా పేరుగాంచింది.దుర్గాబాయి 1981 మే 9వ తేదీన హైదరాబాదులో మరణించారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈట‌ల‌కు పెరుగుతున్న మ‌ద్ద‌తు... తాజాగా ఆ మ‌హిళా నాయ‌కురాలి భేటీ

హ్యాపీ సండే 9-MAY: ఈ వారం ప్రభాస్ విశేషాలివే... !

సాయిపల్లవికి స్టార్ డమ్ అంటే ఆ ఎయిర్‌పోర్టులో తెలిసిందట..

ఛోటా నేత‌లే.. కానీ జెయింట్ కిల్ల‌ర్స్‌..?

టన్నుల కొద్దీ గ్లామర్ ఉన్నా నో యూజేనా... ?

'జూనియర్ ఎన్టీఆర్ - సమంత' జోడిగా నటించిన సినిమాలు ఇవే.. ఇందులో ఎన్ని హిట్ అయ్యాయంటే.??

చంద్రబాబుపై సీఐడీ సంచలన వ్యాఖ్యలు.. కోర్టులో కౌంటర్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>