EditorialThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/coronavirusf65c5c28-69ab-445c-b238-05d99973f7a2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/coronavirusf65c5c28-69ab-445c-b238-05d99973f7a2-415x250-IndiaHerald.jpgవైర‌స్ ఉధృతిపై ప్ర‌ధాని మోదీ ఎప్ప‌టిక‌ప్పుడు రాష్ట్రాల సీఎంల‌తో ఫోన్‌లో తెలుసుకుంటున్నాడు. కానీ లాక్‌డౌన్ విధించేందుకు మాత్రం కేంద్రం స‌సేమీరా అంటుంది. రాష్ట్రాల‌కు ఆ ఆలోచ‌న ఉంటే అమ‌లు చేసుకోవ‌చ్చ‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించ‌గా, మ‌రికొన్ని రాష్ట్రాలు క‌ర్ఫ్యూ విధిస్తున్నాయి. క‌రోనా చైన్‌కు చెక్ పెట్టాలంటే లాక్‌డౌన్ ఒక్క‌టే మార్గ‌మ‌న్న అభిప్రాయాలు స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి. తాజాగా క‌రోనా కేసులు అదుపుచేయాలంటే దేశ‌వ్యాప్త లాక్‌డౌన్ పెట్టాలని ఇండియ‌న్ మెడిcoronavirus;narendra modi;cm;cheque;central governmentక‌రోనా వైర‌స్ చైన్‌కు బ్రేక్‌ వేసేదెలా..? అదొక్క‌టే మార్గ‌మ‌ట‌!క‌రోనా వైర‌స్ చైన్‌కు బ్రేక్‌ వేసేదెలా..? అదొక్క‌టే మార్గ‌మ‌ట‌!coronavirus;narendra modi;cm;cheque;central governmentSun, 09 May 2021 08:29:35 GMTక‌రోనా వైర‌స్ దేశాన్ని కుదిపేస్తుంది. వైర‌స్ వ్యాప్తి రోజురోజుకు తీవ్ర‌త‌మ‌వుతుండ‌టంతో పాజిటివ్ కేసుల సంఖ్య ల‌క్షల్లో, మ‌ర‌ణాల సంఖ్య వేల‌ల్లో న‌మోద‌వుతున్నాయి. వైర‌స్ వ్యాప్తిని క‌ట్ట‌డి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. కేంద్రం ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా 18ఏళ్లు పైబ‌డిన వారికి కొవిడ్ టీకాను అందిస్తుంది. రాష్ట్రాల్లో క‌ర్ఫ్యూలు, లాక్‌డౌన్‌లు కొన‌సాగుతున్నాయి. అయినా క‌రోనా వైర‌స్ చైన్‌కు బ్రేక్ ప‌డ‌టం లేదు. గ‌తేడాది కేంద్రం లాక్‌డౌన్ విధించ‌డం ద్వారా వైర‌స్ వ్యాప్తిని అడ్డుకున్న‌ట్ల‌యింది. ఈ ఏడాది సెకండ్ వేవ్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నా లాక్‌డౌన్ విధించేందుకు కేంద్రం మొగ్గుచూప‌డం లేదు. దీంతో ప్ర‌తిప‌క్షాలు, ప‌లు సంస్థ‌లు లాక్‌డౌన్ విధించాలంటూ కేంద్రానికి సూచ‌న‌లు చేస్తున్నాయి.

వైర‌స్ ఉధృతిపై ప్ర‌ధాని మోదీ ఎప్ప‌టిక‌ప్పుడు రాష్ట్రాల సీఎంల‌తో ఫోన్‌లో తెలుసుకుంటున్నాడు. కానీ లాక్‌డౌన్ విధించేందుకు మాత్రం కేంద్రం స‌సేమీరా అంటుంది. రాష్ట్రాల‌కు ఆ ఆలోచ‌న ఉంటే అమ‌లు చేసుకోవ‌చ్చ‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించ‌గా, మ‌రికొన్ని రాష్ట్రాలు క‌ర్ఫ్యూ విధిస్తున్నాయి. క‌రోనా చైన్‌కు చెక్ పెట్టాలంటే లాక్‌డౌన్ ఒక్క‌టే మార్గ‌మ‌న్న అభిప్రాయాలు స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి. తాజాగా క‌రోనా కేసులు అదుపుచేయాలంటే దేశ‌వ్యాప్త లాక్‌డౌన్ పెట్టాలని ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ (ఐఎంఏ) కేంద్రానికి స్ప‌ష్టం చేసింది. లాక్‌డౌన్ ద్వారానే వైర‌స్ చైన్‌కు బ్రేక్ వేయ‌డం సాధ్య‌మ‌వుతుంద‌ని సూచించింది. లాక్‌డౌన్ ద్వారా కొవిడ్ రోగుల‌కు నిరంత‌రాయంగా సేవ‌లు అందిస్తున్న మెడిక‌ల్ సిబ్బందికి కొంత మేర స్వ‌స్థ‌త చేకూరుతుంద‌ని ఐఎంఏ అభిప్రాయ ప‌డింది.

ఐఎంఏతో పాటు ప‌లు సంస్థ‌లు, వైద్య నిపుణులు లాక్‌డౌన్ విధించాల‌ని కేంద్రానికి సూచ‌న‌లు చేశాయి. లాక్‌డౌన్‌తోనే క‌రోనాకు చెక్ పెట్టొచ్చ‌ని తేల్చాయి. గ‌తేడాది లాక్‌డౌన్ వ‌ల్ల దేశంలో ఆర్థిక వ్య‌వ‌స్థ పూర్తిగా దెబ్బ‌తింది. ఈ ప‌రిస్థితుల్లో లాక్‌డౌన్ అంటే ప్ర‌జ‌లు, ప్ర‌భుత్వం తీవ్ర ఇబ్బందుల్లో ప‌డాల్సి వ‌స్తుంద‌ని కేంద్రం భావిస్తుంది. ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ‌తింటామ‌న్న ఆలోచ‌న‌లో కేంద్రం ఉంది. దీంతో లాక్‌డౌన్‌కు ప్ర‌త్యామ్నాయంగా టీకా పంపిణీపై కేంద్రం దృష్టి కేంద్రీక‌రించింది. రెండు డోస్‌లు తీసుకున్న వారిలో కొవిడ్ స‌మ‌స్య ఉండ‌ద‌ని బావిస్తున్న కేంద్రం ఆ మేర‌కు టీకా పంపిణీని ఉధృతం చేస్తుంది. త‌ద్వారా రాబోయే రోజుల్లో క‌రోనాను పూర్తిగా క‌ట్ట‌డి చేయ‌వ‌చ్చ‌నే భావ‌న‌లో కేంద్రం ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈట‌ల‌కు పెరుగుతున్న మ‌ద్ద‌తు... తాజాగా ఆ మ‌హిళా నాయ‌కురాలి భేటీ

హ్యాపీ సండే 9-MAY: ఈ వారం ప్రభాస్ విశేషాలివే... !

సాయిపల్లవికి స్టార్ డమ్ అంటే ఆ ఎయిర్‌పోర్టులో తెలిసిందట..

ఛోటా నేత‌లే.. కానీ జెయింట్ కిల్ల‌ర్స్‌..?

టన్నుల కొద్దీ గ్లామర్ ఉన్నా నో యూజేనా... ?

'జూనియర్ ఎన్టీఆర్ - సమంత' జోడిగా నటించిన సినిమాలు ఇవే.. ఇందులో ఎన్ని హిట్ అయ్యాయంటే.??

చంద్రబాబుపై సీఐడీ సంచలన వ్యాఖ్యలు.. కోర్టులో కౌంటర్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>