Moviesyekalavyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/namrathaa63e9456-4889-46fd-83a5-983fe20fc22c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/namrathaa63e9456-4889-46fd-83a5-983fe20fc22c-415x250-IndiaHerald.jpgప్రతి ఒక్కరూ లైఫ్‌లో ఏదో సాధించాలని, ఎంతో ఎత్తుకు ఎదగాలని అనుకుంటారు. కానీ అందరూ అనుకున్నవి సాధించలేదు. కొందరు మాత్రమే చెమటోడ్చి పోరాడి, ఆ పోరాటంలో ఎన్నింటినో త్యాగం చేసి అనుకున్న లక్ష్యాలను చేరుకుంటుంటారు. అయితే ఇంకొందరు మాత్రం పరిస్థితులకు తలొగ్గి తమ లక్ష్యాన్ని పక్కన పెట్టి జీవితంలో ముందకు వెళ్లిపోతుంటారు. ఇంత చెబుతున్నాను ఎవరి గురించా అనుకుంటున్నారా..? ఇంకెవరు మన సూపర్ స్టార్ మహేశ్ బాబు గురించే.. అయితే మహేశ్ కాదు.. ఆయన అత్తమ్మ, అంటే మహేశ్ భార్య..namratha;mahesh;namrata shirodkar;jeevitha rajaseskhar;india;rajani kanth;marriage;wife;prize;giftమహేష్‌బాబు అత్తమ్మ మిస్ ఇండియా అయ్యేదట.. కానీ జస్ట్ మిస్!మహేష్‌బాబు అత్తమ్మ మిస్ ఇండియా అయ్యేదట.. కానీ జస్ట్ మిస్!namratha;mahesh;namrata shirodkar;jeevitha rajaseskhar;india;rajani kanth;marriage;wife;prize;giftSun, 09 May 2021 23:42:58 GMTప్రతి ఒక్కరూ లైఫ్‌లో ఏదో సాధించాలని, ఎంతో ఎత్తుకు ఎదగాలని అనుకుంటారు. కానీ అందరూ అనుకున్నవి సాధించలేదు. కొందరు మాత్రమే చెమటోడ్చి పోరాడి, ఆ పోరాటంలో ఎన్నింటినో త్యాగం చేసి అనుకున్న లక్ష్యాలను చేరుకుంటుంటారు. అయితే ఇంకొందరు మాత్రం పరిస్థితులకు తలొగ్గి తమ లక్ష్యాన్ని పక్కన పెట్టి జీవితంలో ముందకు వెళ్లిపోతుంటారు. ఇంత చెబుతున్నాను ఎవరి గురించా అనుకుంటున్నారా..? ఇంకెవరు మన సూపర్ స్టార్ మహేశ్ బాబు గురించే.. అయితే మహేశ్ కాదు.. ఆయన అత్తమ్మ, అంటే మహేశ్ భార్య నమ్రత వాళ్ల అమ్మ గురించి.

నమ్రత అమ్మ మిస్ ఇండియా కావాలని ఎన్నో కలలు కనేవారట. ఆ దిశగా ఎన్నో ప్రయత్నాలు చేశారట. కానీ అనుకోని పరిస్థితుల కారణంగా ఆ కలను కలగానే వదిలేశారట. అయితే ఆమె కలను అలా మధ్యలోనే మర్చిపోవడానికి కారణం ఆమె వివాహం. అవును.. వివాహం కోసమే ఆమె తన మిస్ ఇండియా కలను త్యాగం చేశారట. ఈ విషయాన్ని నమ్రత తాజాగా చెప్పుకొచ్చారు. ‘అమ్మ మిస్ ఇండియా కావాలని ఎన్నో కలలు కన్నారు. కానీ పరిస్థితులు అనుకూలించలేదు. తల్లిదండ్రుల కోరిక మేరకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. దీంతో అమ్మ కల కలాగానే మిగిలిపోయింది. అయితే ఆమె కలను తాను మాత్రం నెరవేర్చానని నమ్రత గర్వంగా చెప్పుకొచ్చింది.

‘అమ్మ తన కలని నెరవేర్చుకోవడంలో విఫలమవడంతో నన్ను మిస్ ఇండియా స్థానంలో చూడాలనుకుంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసి మిస్ ఇండియా కిరీటిం దక్కించుకోగలిగాను. ఇదే నా తల్లిదండ్రులకు నేనిచ్చిన బహుమతి. పేరెంట్స్ కోసం నేను ఏదో సాధించానన్న తృప్తి నాకెప్పటికీ ఉంటుంది. జీవితంలో అనుకున్నది సాధించగలిగిన ఆనందం వేరే ఏదీ ఇవ్వలేదు’ అంటూ నమ్రత చెప్పుకొచ్చారు. అంతేకాకుండా జీవితంలో ఎప్పుడూ ఒకటి కోల్పోతే వేరే ఆప్షన్ ఉంటుందని, దానిని వెతుక్కోవాలని, అప్పుడే లైఫ్‌లో గందరగోళం లేకుండా బ్యాలెన్సింగ్‌గా ఉంటుందని నమ్రత పేర్కొన్నారు. 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

'మే 9'.. వైజయంతీ మూవీస్ కి చాలా స్పెషల్.. ఎందుకో మీరే చూడండి..??

తనదైన స్టైల్ లో మదర్స్ డే విషెస్ తెలిపిన ఆర్జీవీ..

తాను పడ్డ కష్టం ఏ తల్లి పడకూడదు అని గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శ్రీజారెడ్డి..!!

విజయ్ దేవరకొండ ఆస్తి అన్ని కోట్లా..?

ఈ పాన్ ఇండియా సినిమాలు ఇప్పట్లో వచ్చేలా లేవు!!

ఎన్టీఆర్ ప్రతి విజయం వెనుక చెరగని సంతకం!

ఏపి తెలంగాణలో లాక్డౌన్ అత్యవసరం: నిపుణులు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>