PoliticsSpydereditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/etala-kcr0684387e-0819-41bc-a3c0-6bbc4637ce24-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/etala-kcr0684387e-0819-41bc-a3c0-6bbc4637ce24-415x250-IndiaHerald.jpgఈట‌ల రాజేంద‌ర్‌కు ప్ర‌త్యామ్నాయంగా హుజారాబాద్‌లో ఓ లీడ‌ర్‌ను త‌యారు చేసుకునే ప‌నిలో ప‌డింది టీఆర్ ఎస్ అధిష్ఠానం. దాదాపు 18ఏళ్లుగా ఈ నియోజ‌క‌వ‌ర్గంపై ఈట‌ల‌కు ప‌ట్టుంది. 2003 నుంచి ఆయ‌న ఇక్క‌డి రాజ‌కీయాల్లో మ‌మేక‌మ‌వుతూ వ‌స్తున్నారు. జ‌న‌నేత‌గా ఎదిగారు. ఎలాంటి అక్ర‌మాలు.. ఆరోప‌ణ‌లు కూడా ఆయ‌నపై ఇక్క‌డ లేవు. తాజాగా వెలుగులోకి వ‌చ్చిన అసైన్డ్ లాండ్ వ్య‌వ‌హారం త‌ప్పా... ఇప్ప‌టి వ‌ర‌కు ఈట‌ల‌ను వేలెత్తి చూపే పరిస్థితి ఎప్పుడూ రాలేదు. దీంతో మ‌చ్చ‌లేని నేత‌గా ఎదిగిన ఆయ‌న‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ టీఆర్vinod kumar;kcr;tiru;vinodkumar;mp;రాజీనామా;district;mla;party;mantra;huzurabadఈట‌ల‌పై పోటీకి వినోద్‌కుమార్‌..? కేసీఆర్ స్కెచ్ గీసేస్తున్నాడా..?ఈట‌ల‌పై పోటీకి వినోద్‌కుమార్‌..? కేసీఆర్ స్కెచ్ గీసేస్తున్నాడా..?vinod kumar;kcr;tiru;vinodkumar;mp;రాజీనామా;district;mla;party;mantra;huzurabadSun, 09 May 2021 11:28:00 GMTఈట‌ల రాజేంద‌ర్‌కు ప్ర‌త్యామ్నాయంగా హుజారాబాద్‌లో ఓ లీడ‌ర్‌ను త‌యారు చేసుకునే ప‌నిలో ప‌డింది టీఆర్ ఎస్ అధిష్ఠానం. దాదాపు 18ఏళ్లుగా ఈ నియోజ‌క‌వ‌ర్గంపై ఈట‌ల‌కు ప‌ట్టుంది. 2003 నుంచి ఆయ‌న ఇక్క‌డి రాజ‌కీయాల్లో మ‌మేక‌మ‌వుతూ వ‌స్తున్నారు. జ‌న‌నేత‌గా ఎదిగారు. ఎలాంటి అక్ర‌మాలు.. ఆరోప‌ణ‌లు కూడా ఆయ‌నపై ఇక్క‌డ లేవు. తాజాగా వెలుగులోకి వ‌చ్చిన అసైన్డ్ లాండ్ వ్య‌వ‌హారం త‌ప్పా... ఇప్ప‌టి వ‌ర‌కు ఈట‌ల‌ను వేలెత్తి చూపే పరిస్థితి ఎప్పుడూ రాలేదు. దీంతో మ‌చ్చ‌లేని నేత‌గా ఎదిగిన ఆయ‌న‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ టీఆర్ ఎస్ పార్టీపై తిరుగుబాటు చేస్తున్నార‌న్న అంశం కేసీఆర్‌కు తెలియ‌డంతోనే తాజా వ్య‌వ‌హారమంతా జ‌రుగుతోంద‌న్న‌ది రాజ‌కీయ నేత‌ల‌ విశ్లేష‌ణ‌.


ఈ విష‌యం అలా ఉంచితే ఇప్పుడు హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో త్వ‌ర‌లోనే ఉప ఎన్నిక రావ‌డం అన్న‌ది సుస్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈట‌ల ఎప్పుడైనా పార్టీకి, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఉన్న ప‌ళంగా వ‌స్తున్న ఎన్నిక‌ల‌ను ఎదుర్కొవ‌డం టీఆర్ ఎస్ పార్టీకి అంత ఈజీ కాద‌నే చెప్పాలి. టీఆర్ ఎస్ పార్టీ సింబ‌ల్ ఓటింగ్‌తో పాటు ఈట‌లను ఎదుర్కొవాలంటే ఆయ‌న స్థాయి నేత అయితేనే సాధ్య‌మ‌వుతుంది. గెలుపు కాక‌పోయినా.. క‌నీసం పోటాపోటీ ఇచ్చార‌న్న పేరు ద‌క్కుతుంది. ఆ త‌ర్వాత వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల నాటికి ఈట‌ల ప్ర‌భావం త‌గ్గి పార్టీ గెలిచే అవ‌కాశం ఉంటుంద‌ని పార్టీ నేత‌లు, జిల్లా మంత్రులు అధిష్టానం ముఖ్యుల‌కు సూచిస్తున్నారంట‌.


ఈ ప‌రిణామ‌ల‌న్నింటిని ఆలోచిస్తున్న ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ ప్రాంతంతో సంబంధం క‌లిగి ఉండి, బ‌ల‌మైన నేత‌గా ఉన్న మాజీ ఎంపీ బోయిన‌ప‌ల్లి వినోద్‌కుమార్ పేరును తెర‌పైకి తీసుకువ‌స్తున్న‌ట్లుగా తెలుస్తోంది.  రాజీనామా చేస్తే అనివార్యమయ్యే ఉప ఎన్నికల్లో ఆయనపై వినోద్‌ కుమార్‌ను పోటీలో నిలిపేందుకు ఎక్కుపెట్టేందుకు టీఆర్‌ఎస్‌ సిద్ధమవుతున్నట్లు తెలిసింది. హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ద్వితీయశ్రేణి నేతలతో ప్రయోగాలు చేసే కంటే ఈటలను ఢీకొనేందుకు దీటైన అభ్యర్థినే రంగంలోకి దింపి శాశ్వతంగా ఆయనను రాజకీయాల నుంచి ఇంటికి పంపించాలనేది టీఆర్‌ఎస్‌ భావనగా చెబుతు న్నారు. కాంగ్రెస్‌, బీజేపీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్న వలస అభ్యర్థుల కంటే రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ బలమైన అభ్యర్థిగా ఉంటారని పార్టీ అధిష్ఠానం భావిస్తున్నదని సమాచారం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎడిటోరియల్: ఇక బెంగాల్ వేదికగా మమత - మోదీ సమరం - రణభేరి మ్రోగింది

ఈ టైం లో ఇవేం పనులు సార్...?

అమ్మ ఇచ్చిన వెయ్యి రూపాయిలతో కోట్లకు అధిపతి అయిన కోటి రెడ్డి !

వేరియెంట్ వార్... పాలిటిక్స్ హుషార్.... ?

ఈ స్పెషల్ రికార్డులు ఒక్క సాయి పల్లవికే సొంతం.. ఎవరూ అందుకోలేరు..!!

కరోనా విజృంభణలో ఆ మూడు రాష్ట్రాలే టాప్..!!

మ‌ద‌ర్స్ డే : ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>