MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mothers-dayc35c6d78-1c3d-4f32-aebf-0af33b39c3c3-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mothers-dayc35c6d78-1c3d-4f32-aebf-0af33b39c3c3-415x250-IndiaHerald.jpgనటసింహం నందమూరి బాలకృష్ణ అంటే తెలియనివారుండరు. ఈ రోజుల్లో ఆయనను అందరూ ట్రోల్ చేస్తున్నారు కానీ, ఒకానొక సమయంలో ఆయన టాలీవుడ్ లో తన సత్తా చాటారు. ఇప్పుడు కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతూ ఆయన సినిమాలు చేస్తూ విడుదల చేస్తున్నారు. అయితే బాలకృష్ణకు తన తల్లి మీద ఉన్న ప్రేమ ఇప్పుడు అనేక మంది తల్లులకు కడుపుకోత మిగల్చకుండా చేస్తోంది. వరల్డ్ మదర్స్ డే సంధర్భంగా బాలకృష్ణ తన తల్లి జ్ఞాపకార్ధంగా చేస్తున్న ఈ సేవ గురించి తెలుసుకుందాం. బాలకృష్ణ తల్లి బసవతారకమ్మ గురించి దాదాపు అందరికీ తెలుసు. తెలుగు ప్రజల ఆరాధ్య దైవంmothers day;ntr;balakrishna;prema;tollywood;cinema;nandamuri balakrishna;love;cancer;aqua;service;nandamuri taraka rama rao;ee rojulloబాలయ్య తల్లి ప్రేమ..ఎందరో తల్లులకి అండ!బాలయ్య తల్లి ప్రేమ..ఎందరో తల్లులకి అండ!mothers day;ntr;balakrishna;prema;tollywood;cinema;nandamuri balakrishna;love;cancer;aqua;service;nandamuri taraka rama rao;ee rojulloSun, 09 May 2021 13:00:00 GMTనటసింహం నందమూరి బాలకృష్ణ అంటే తెలియనివారుండరు. ఈ రోజుల్లో ఆయనను అందరూ ట్రోల్ చేస్తున్నారు కానీ, ఒకానొక సమయంలో ఆయన టాలీవుడ్ లో తన సత్తా చాటారు. ఇప్పుడు కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతూ ఆయన సినిమాలు చేస్తూ విడుదల చేస్తున్నారు. అయితే బాలకృష్ణకు తన తల్లి మీద ఉన్న ప్రేమ ఇప్పుడు అనేక మంది తల్లులకు కడుపుకోత మిగల్చకుండా చేస్తోంది. వరల్డ్ మదర్స్ డే సంధర్భంగా బాలకృష్ణ తన తల్లి జ్ఞాపకార్ధంగా చేస్తున్న ఈ సేవ గురించి తెలుసుకుందాం. బాలకృష్ణ తల్లి బసవతారకమ్మ గురించి దాదాపు అందరికీ తెలుసు. తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా భావించే నందమూరి తారక రామారావు తన మేనమామ కుమార్తె అయిన బసవతారకమ్మను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ ఇద్దరికీ దాదాపు 11 మంది సంతానం కలిగారు. ఏడుగురు మగ పిల్లలు, నలుగురు ఆడ పిల్లలకు బసవతారకమ్మ జన్మనిచ్చింది. 



11 మంది పిల్లలకు జన్మనిచ్చిన కారణంగా ఆమె గర్భసంచి సంబంధిత క్యాన్సర్ బారిన పడ్డారు.. నిజానికి ఎన్టీఆర్ ఎప్పుడూ సినిమా షూటింగులతో బిజీగా ఉండేవారు. ఈ కారణంగానే పిల్లలందరికీ తండ్రితో కంటే తల్లి బసవతారకమ్మతోనే బాగా అనుబంధం ఏర్పడింది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అప్పుడే ఎంట్రీ ఇస్తున్న సమయంలో ఆమెకు క్యాన్సర్ అని తెలియడంతో ఎన్టీఅర్ సహా కుటుంబం అంతా డీలా పడిపోయింది. ఆ తర్వాత ఆమెను క్యాన్సర్ చికిత్స కోసం విదేశాలకు సైతం తీసుకెళ్లి చాలా రోజుల పాటు ఆమెను బతికించుకునే ప్రయత్నం చేశారు. కానీ క్యాన్సర్ మహమ్మారి ఆమెని పూర్తిగా దెబ్బ తీసింది. పూర్తిగా పిల్లలు, భర్తే ప్రపంచం అంటూ బతికిన బసవతారకం క్యాన్సర్ మహమ్మారికి బలైపోయింది. 



తల్లి అంటే ఎంతో ప్రేమ చూపించే బాలకృష్ణ తన తల్లి పడిన వేదన ఇంకెవరికీ రాకూడదు అని భావించి ప్రపంచస్థాయి క్యాన్సర్ వైద్యాన్ని అందించేందుకు గాను తన తల్లి పేరుతోనే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి స్థాపించి ఎంతో మందికి క్యాన్సర్ పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఆర్థిక స్థితులను బట్టి చికిత్స చేయడం. అంటే డబ్బున్న వారు ఇక్కడ డబ్బు కట్టి చికిత్స చేయించుకోవచ్చు ఏమీ లేని పేద వారు సైతం ఉచితంగా చికిత్స చేయించుకోవచ్చు. అలా ఎప్పటికప్పుడు హాస్పిటల్ దాతల నుంచి నిధులు సమకూర్చుకుని వచ్చిన వారికి కాదనకుండా క్యాన్సర్ వైద్యం అందిస్తూ ఎందరో తల్లులకు కడుపుకోత మిగల్చకుండా పాటుపడుతోంది. తన తల్లి అనుభవించిన బాధ మరే తల్లి అనుభవించకూడదు అనే ఉద్దేశంతో బాలకృష్ణ నేడు ఎందరో తల్లులకు అండగా నిలబడుతున్నారు. ఈ ఆసుపత్రిలో ఉన్న బసవతారకమ్మ విగ్రహానికి రోజు పూజలు సైతం జరుగుతాయి. ఒక తల్లికి ఇంతకు మించిన గౌరవం ఇంకేం ఇవ్వగలం చెప్పండి.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో కర్ఫ్యూ నుండి వీటికి మినహాయింపు ..!

ఆ అందాల భామ పేరు వెనక అసలు కథ ఇదే..!

జగన్ పై మహిళా నేత కీలక వ్యాఖ్యలు...!

చిరు మోహన్ బాబు మల్టీస్టారర్ అలా ఆగింది... ?

ఎడిటోరియల్: ఇక బెంగాల్ వేదికగా మమత - మోదీ సమరం - రణభేరి మ్రోగింది

ఈ టైం లో ఇవేం పనులు సార్...?

అమ్మ ఇచ్చిన వెయ్యి రూపాయిలతో కోట్లకు అధిపతి అయిన కోటి రెడ్డి !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>