PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ima-central-goverment45187d13-4487-4442-bd60-960ba13ae07d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ima-central-goverment45187d13-4487-4442-bd60-960ba13ae07d-415x250-IndiaHerald.jpgకరోనా సెకండ్ వేవ్ విషయంలో ఇప్పుడు ఆందోళనకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేసులు రోజు రోజుకి లక్షల్లో నమోదు కావడం మరణాలు కూడా భారీగా ఉన్న నేపధ్యంలో కేంద్రంపై విమర్శలు ఎక్కువగానే వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా సెకండ్ వేవ్ పై కేంద్రం వైఖరి ఆశ్చర్యం కలిగిస్తోంది అని ఐఎంఏ ఆందోళన వ్యక్తం చేసింది. దేశం మొత్తం లాక్ డౌన్ విధించాలని ఐఎంఏ అభిప్రాయపడింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. రాత్రి కర్ఫ్యూల వల్ల ప్రయోజనంలేదని స్పష్టం చేసింima,central goverment;poorna;varsha;letter;central government;indianమమ్మల్ని పట్టించుకోరా...? కేంద్రంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఫైర్మమ్మల్ని పట్టించుకోరా...? కేంద్రంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఫైర్ima,central goverment;poorna;varsha;letter;central government;indianSun, 09 May 2021 11:00:00 GMTకరోనా సెకండ్ వేవ్ విషయంలో ఇప్పుడు ఆందోళనకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేసులు రోజు రోజుకి లక్షల్లో నమోదు కావడం మరణాలు కూడా భారీగా ఉన్న నేపధ్యంలో కేంద్రంపై విమర్శలు ఎక్కువగానే వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా సెకండ్ వేవ్ పై కేంద్రం వైఖరి ఆశ్చర్యం కలిగిస్తోంది అని ఐఎంఏ ఆందోళన వ్యక్తం చేసింది. దేశం మొత్తం లాక్ డౌన్ విధించాలని ఐఎంఏ అభిప్రాయపడింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది.

రాత్రి కర్ఫ్యూల వల్ల ప్రయోజనంలేదని స్పష్టం చేసింది. తమ సూచనలు పట్టించుకోలేదని ఆరోపణలు చేసింది. వ్యాక్సినేషన్ కు ప్రణాళిక లోపించిందని విమర్శలు చేసింది. దేశంలో కరోనా పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తాము కేంద్రానికి అందించిన సలహాలు, సూచనలు ఏమాత్రం పట్టించుకోలేదన్న విషయం అర్థమైందని ఈ సందర్భంగా లేఖలో మండిపడింది. రాత్రి పూట కర్ఫ్యూల వల్ల ఏమిటి ప్రయోజనం? అని ఈ సందర్భంగా నిలదీసింది.

అదే విధంగా వ్యాక్సినేషన్ అస్తవ్యస్తంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది.  18 ఏళ్లకు పైబడినవారికి ఎక్కడైనా వ్యాక్సిన్ అందుతోందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. కేంద్రం అనుసరిస్తున్న వ్యాక్సిన్ ప్రక్రియ లోపభూయిష్టమని మండిపడింది. సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే వ్యాక్సినేషన్ ముందుకు సాగడంలేదని ఆక్షేపించింది. కొవిడ్ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఇకనైనా మేల్కోవాలని విజ్ఞప్తి చేస్తూ  దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడం ఒక్కటే మార్గమని తన లేఖలో పేర్కొంది. అదే విధంగా దేశం మొత్తం సంపూర్ణ లాక్ డౌన్ విధించడం వల్ల కరోనా వ్యాప్తి గొలుసు విచ్ఛిన్నం అవుతుందని తెలిపింది. అలాగే... కరోనా రోగులకు నిర్విరామంగా సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి కొంతమేర ఉపశమనం లభిస్తుందని  కూడా తన లేఖలో సూచనలు చేసింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎడిటోరియల్: ఇక బెంగాల్ వేదికగా మమత - మోదీ సమరం - రణభేరి మ్రోగింది

ఈట‌ల‌పై పోటీకి వినోద్‌కుమార్‌..? కేసీఆర్ స్కెచ్ గీసేస్తున్నాడా..?

ఈ టైం లో ఇవేం పనులు సార్...?

అమ్మ ఇచ్చిన వెయ్యి రూపాయిలతో కోట్లకు అధిపతి అయిన కోటి రెడ్డి !

వేరియెంట్ వార్... పాలిటిక్స్ హుషార్.... ?

ఈ స్పెషల్ రికార్డులు ఒక్క సాయి పల్లవికే సొంతం.. ఎవరూ అందుకోలేరు..!!

కరోనా విజృంభణలో ఆ మూడు రాష్ట్రాలే టాప్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>