Moviesyekalavyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/salaarf65850f0-0915-4be8-9063-bc2315b8b514-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/salaarf65850f0-0915-4be8-9063-bc2315b8b514-415x250-IndiaHerald.jpgప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. కేజీఎఫ్‌తో స్టార్ డైరెక్టర్‌గా మారిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా సలార్. ప్రభాస్ ఫ్యాన్స్‌లో అత్యధిక శాతం మంది ఈ సినిమా కోసమే ఎదురు చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. దీనికి తగ్గట్లే కరోనా సెకండ్ వేవ్ ముందు వరకు ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి అనేక రకాల గాసిప్స్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రభాస్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్..salaar;prabhas;prasanth;prashanth neel;india;cinema;thriller;hero;heroine;kgf;prasanth neel;nijam;prashant kishor‘సలార్’ కోసం ఫస్ట్ టైం ఆ గెటప్‌లో ప్రభాస్!‘సలార్’ కోసం ఫస్ట్ టైం ఆ గెటప్‌లో ప్రభాస్!salaar;prabhas;prasanth;prashanth neel;india;cinema;thriller;hero;heroine;kgf;prasanth neel;nijam;prashant kishorSun, 09 May 2021 23:07:29 GMT
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. కేజీఎఫ్‌తో స్టార్ డైరెక్టర్‌గా మారిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా సలార్. ప్రభాస్ ఫ్యాన్స్‌లో అత్యధిక శాతం మంది ఈ సినిమా కోసమే ఎదురు చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. దీనికి తగ్గట్లే కరోనా సెకండ్ వేవ్ ముందు వరకు ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి అనేక రకాల గాసిప్స్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రభాస్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేయబోతున్నాడని, అవి రెండు రోల్స్ కూడా అదిరిపోయే రేంజ్‌లో ఉంటాయని, ఇలా ఎన్నో రూమర్స్ వచ్చాయి. కాగా.. తాజాగా ఆ డ్యూయల్ రోల్స్‌కు సంబంధించి మరో వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో ఈ మధ్య లేటెస్ట్‌గా వినిపిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ విషయం చాలా వరకు కన్ఫమ్ అయినా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయితే ఇప్పుడు ఈ రెండు రోల్స్‌లో ఓ రోల్ ఓల్డ్ గెటప్ అట. అవును.. ఒకటి యంగ్ గెటప్ కాగా.. రెండో గెటప్ ఓల్ట్ అని టాక్ నడుస్తోంది. ఇదే నిజమైతే ప్రభాస్ తన కెరీర్లోనే ఫస్ట్ టైం ఓల్డ్ గెటప్‌లో కనిపించబోతున్నాడన్నామాట. ఇది ఓ సాహసమనే చెప్పాలి. ప్రభాస్ లాంటి క్రేజ్ ఉన్న హీరో ఇలా ఓల్డ్ గెటప్‌లో కనిపించడం నిజంగా సాహసమనే చెప్పాలి. అయితే ఇది వట్టి పుకారేనా..? లేక నిజంగా ప్రభాస్ ఓల్డ్ గెటప్‌లో కనిపించబోతున్నాడా..? అని తెలియాలంటే మరకొంత కాలం ఆగాల్సిందే.

ఇదిలా ఉంటే సలార్ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హంబలే ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాను ఈ ఏడాదే పూర్తి చేసేయాలని అటు ప్రశాంత్ నీల్‌తో పాటు ప్రభాస్ కూడా అనుకున్నాడట. దీని కోసం బల్క్ డేట్స్ కూడా కేటాయించాడట. ప్రశాంత్ నీల్ కూడా అంతే వేగంతో సినిమా తెరకెక్కించే పనిలో పడ్డాడట. కానీ కరోనా దెబ్బకు ఇప్పుడు షూటింగ్ ఆగిపోయింది. మళ్లీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియాల్సి ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మహేష్‌బాబు అత్తమ్మ మిస్ ఇండియా అయ్యేదట.. కానీ జస్ట్ మిస్!

'మే 9'.. వైజయంతీ మూవీస్ కి చాలా స్పెషల్.. ఎందుకో మీరే చూడండి..??

తనదైన స్టైల్ లో మదర్స్ డే విషెస్ తెలిపిన ఆర్జీవీ..

తాను పడ్డ కష్టం ఏ తల్లి పడకూడదు అని గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శ్రీజారెడ్డి..!!

విజయ్ దేవరకొండ ఆస్తి అన్ని కోట్లా..?

ఈ పాన్ ఇండియా సినిమాలు ఇప్పట్లో వచ్చేలా లేవు!!

ఎన్టీఆర్ ప్రతి విజయం వెనుక చెరగని సంతకం!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>