MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rasi-khannae7dfbfaf-f3aa-4c80-b371-a114ca618700-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rasi-khannae7dfbfaf-f3aa-4c80-b371-a114ca618700-415x250-IndiaHerald.jpgబబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. తన అందం, అబినయంతో అందరి మనసులు దోచుకుంది. అయితే 2014లో ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అంతకు ముందు హిందీ సినిమా మద్రాస్ కేఫ్ సినిమాలో సపోర్టింగ్‌ రోల్‌లో కనిపించింది. తెలుగులో తన తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తరువాత నుంచి వరుస సినిమాలు చేస్తూ..rasi khanna;beauty;gopichand;shahid kapoor;raj;cinema;telugu;tamil;hindi;chennai;hero;darbar;shahid;rashi khanna;oohalu gusagusalade;prati roju pandageఅదరగొడుతున్న బబ్లీ బ్యూటీ.. ఒకేసారి అన్ని సినిమాలా..?అదరగొడుతున్న బబ్లీ బ్యూటీ.. ఒకేసారి అన్ని సినిమాలా..?rasi khanna;beauty;gopichand;shahid kapoor;raj;cinema;telugu;tamil;hindi;chennai;hero;darbar;shahid;rashi khanna;oohalu gusagusalade;prati roju pandageSun, 09 May 2021 17:52:00 GMT బ్యూటీ రాశీ ఖన్నా తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. తన అందం, అబినయంతో అందరి మనసులు దోచుకుంది. అయితే 2014లో ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అంతకు ముందు హిందీ సినిమా మద్రాస్ కేఫ్ సినిమాలో సపోర్టింగ్‌ రోల్‌లో కనిపించింది. తెలుగులో తన తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తరువాత నుంచి వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్లింది. అయితే అమ్మడు తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ మంచి క్రేజ్ సంపాదించింది.

 2017లో విలన్ సినిమాతో మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా అభిమానులను ఏర్పరుచుకుంది. ఆ తర్వాత ఇమైక్క నొడిగల్ అనే సినిమాతో 2018లో తమిళ సినీ అరంగేట్రం చేసింది. అయితే తెలుగులో అమ్మడు ప్రతి రోజు పండగే సినిమా తరువాత మరో సినిమా చేయలేదు. తాజాగా గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న ‘పక్కా కమర్షియల్’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో అమ్మడి చేతిలో బోలెడన్ని సినిమాలు ఉన్నాయి. హిందీ, తమిళం, మలయాళం అంటూ అన్ని భాషల్ని కవర్ చేస్తోంది.

 దాదాపు 8 సినిమాల వరకు రాశీ తన ఖాతాలో వేసుకుంది. తమిళంలో అరణ్మనై-3, తుగ్లక్ దర్బార్, సర్దార్, మేధావి, సైతాన్ క బచ్చా సినిమాల్లో చేస్తోంది. అలాగే మళయాళంలో భ్రమమ్ సినిమాను చేస్తోంది. వీటితొ పాటు తెలుగులో పక్కా కమర్షియల్, థాంక్యు సినిమాల్లో నటిస్తోంది. ఈ సినిమాలన్నీ కూడా షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ 8 సినిమాలు వచ్చే ఏడాది విడుదలకు సిద్దమవుతున్నాయి. కాబట్టి ఈ అమ్మడి డేట్స్ కావాలంటే మేకర్స్ ఈ ఏడాది వెయిట్ చేయాల్సిందే. ఇదిలా ఉంటే నాగచైతన్యతో కలిసి చేస్తున్న థాంక్యు సినిమా చిత్రీకరణను రాశీ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలతో పాటు ఇటీవల హిందీలో రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ఓ వెబ్‌సిరీస్‌లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో హిందీ స్టార్ హీరో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మహేష్‌బాబు అత్తమ్మ మిస్ ఇండియా అయ్యేదట.. కానీ జస్ట్ మిస్!

'మే 9'.. వైజయంతీ మూవీస్ కి చాలా స్పెషల్.. ఎందుకో మీరే చూడండి..??

తనదైన స్టైల్ లో మదర్స్ డే విషెస్ తెలిపిన ఆర్జీవీ..

తాను పడ్డ కష్టం ఏ తల్లి పడకూడదు అని గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శ్రీజారెడ్డి..!!

విజయ్ దేవరకొండ ఆస్తి అన్ని కోట్లా..?

ఈ పాన్ ఇండియా సినిమాలు ఇప్పట్లో వచ్చేలా లేవు!!

ఎన్టీఆర్ ప్రతి విజయం వెనుక చెరగని సంతకం!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>