MoviesSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero7086c9f1-f4fc-4b00-98ea-dacaff1c07a2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero7086c9f1-f4fc-4b00-98ea-dacaff1c07a2-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స‌హా మొత్తం భారతీయ చలన చిత్ర పరిశ్రమ ఇపుడు అతి పెద్ద ఇబ్బందిని ఎదుర్కొంటోంది. సినిమా రంగం ఉనికికే ముప్పు కలిగేలా పరిణామాలు జరుగుతున్నాయి. సినిమా వారికే సినిమా కష్టాలు వచ్చేశాయి. దాంతో ఎటూ తోచని దుస్థితిలో రంగుల ప్రపంచం ఉంది. hero;tollywood;industries;cinema;film industryహీరోలు దిగిరావాల్సిందేనా... ?హీరోలు దిగిరావాల్సిందేనా... ?hero;tollywood;industries;cinema;film industrySun, 09 May 2021 20:00:00 GMTటాలీవుడ్ స‌హా మొత్తం భారతీయ చలన చిత్ర పరిశ్రమ ఇపుడు అతి పెద్ద ఇబ్బందిని ఎదుర్కొంటోంది. సినిమా రంగం ఉనికికే ముప్పు కలిగేలా పరిణామాలు జరుగుతున్నాయి. సినిమా వారికే సినిమా కష్టాలు వచ్చేశాయి. దాంతో ఎటూ తోచని దుస్థితిలో రంగుల ప్రపంచం ఉంది.

ఇదిలా ఉంటే టాలీవుడ్ పరిస్థితి మరీ భిన్నంగా ఉంది. మొత్తం డబ్బు అంతా ఇపుడు సినిమాల మీదనే పెట్టారు. ఆ సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి. షూటింగ్ పూర్తి చేసుకుని బొమ్మ రిలీజ్ అయితేనే కాసులు కళకళలాడేది. దీంతో ఒక రకమైన స్లంప్ వాతావరణం ఇండస్ట్రీలో కనిపిస్తోంది.  సినిమా తీయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఒక రోజు షూటింగ్ ఆలస్యం అయితే దాని ఖర్చు వెళ్ళి బడ్జెట్ లో కలసి రెట్టింపు అవుతుంది. అలాంటిది ఒక ఏడాదిగా సినిమా షూటింగులు ఏవీ సక్రమంగా జరగడంలేదు. సినిమాలు ఇప్పటిదాక పెద్దవి రిలీజ్ అయిన సందర్భమూ లేదు. దాంతో సినిమాకు ముందు అనుకున్న బడ్జెట్ రెట్టింపు అవుతోంది.

ఇపుడు కచ్చితంగా హీరోలు రంగంలోకి దిగి ఆదుకోవాలని కోరుతున్నారు. సినిమా బడ్జెట్ లో ఎక్కువ మొత్తం హీరోల  డైరెక్టర్ల రెమ్యునరేషన్ కిందనే పోతోంది. అలాగే ఇతర విభాగాలకు కూడా గతంతో పోలిస్తే ఖర్చు ఎక్కువ అవుతోంది. ఈ పరిణామాల  నేపధ్యంలో సినిమా బతికి బట్ట కట్టాలంటే ముందు హీరోల నుంచి మొదలుపెట్టి అందరూ బడ్జెట్ కటింగ్ కి సిధ్ధపడాల్సిందే అంటున్నారు. ఈ విషయంలో హీరోలు ఒక మెట్టు దిగి చొరవ చూపిస్తే మిగిలిన వారంతా కలసి వస్తారు అంటున్నారు. అలాగే సినిమా షూటింగుల విషయంలో కూడా మొత్తం అంతా సహకరిస్తే షెడ్యూల్ డేట్స్ కొంతైనా తగ్గి నష్టం తగ్గుతుందని అంటున్నారు. ఏది ఏమైనా సినీ రంగం గతంతో ఎన్నడూ పోల్చని విధంగా నష్టాల ఊబిలో కూరుకుపోయి ఉంది. ఇపుడు పరిశ్రమను కాపాడుకోవడానికి తలా ఒక చేయి వేయాల్సిందే అన్న మాట మాత్రం వినిపిస్తోంది.








Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

50 వేల మంది సిద్దంగా ఉందండి : సి‌ఎం కే‌సి‌ఆర్ !!

'మే 9'.. వైజయంతీ మూవీస్ కి చాలా స్పెషల్.. ఎందుకో మీరే చూడండి..??

తనదైన స్టైల్ లో మదర్స్ డే విషెస్ తెలిపిన ఆర్జీవీ..

తాను పడ్డ కష్టం ఏ తల్లి పడకూడదు అని గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శ్రీజారెడ్డి..!!

విజయ్ దేవరకొండ ఆస్తి అన్ని కోట్లా..?

ఈ పాన్ ఇండియా సినిమాలు ఇప్పట్లో వచ్చేలా లేవు!!

ఎన్టీఆర్ ప్రతి విజయం వెనుక చెరగని సంతకం!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>