MoviesKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/sai-pallavif8d23cec-0647-4cae-a2b1-30035851ac4f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/sai-pallavif8d23cec-0647-4cae-a2b1-30035851ac4f-415x250-IndiaHerald.jpgఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్స్ వస్తూ, పోతూ ఉంటారు.. కానీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసే హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉంటూరు. అలాంటి వారిలో సాయి పల్లవి ఒకరు. నేటితరం సినిమాలలో హీరోయిన్లు కేవలం గ్లామర్ మాత్రమే పరిమితం అవుతున్న ఈరోజుల్లో హీరోలను సైతం డామినేట్ చేసే నటన ప్రతిభతో ఆడియన్స్ లో స్పెషల్ క్రేజ్ సంపాధించుకుంది సాయిపల్లవి. నేడు ఆమె పుట్టిన రోజు. నేటితో ఆమె 29వ ఏటా అడుగుపెడుతుంది. దీంతో ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా భారీ ఎత్తున విషెస్ తెలుపుతున్నారు.sai pallavi;nani;rana;naga chaitanya;abinaya;bhanu;bhanumathi old;naga;sekhar;shyam;kamma;cinema;naga aswin;media;love;audience;industry;blockbuster hit;hero;letter;heroine;chaitanya 1;sai pallavi;love story;fidaaబర్త్ డే స్పెషల్ : ఆ క్వాలిటీస్ వల్లే సాయి పల్లవి ప్రత్యేకం ..!బర్త్ డే స్పెషల్ : ఆ క్వాలిటీస్ వల్లే సాయి పల్లవి ప్రత్యేకం ..!sai pallavi;nani;rana;naga chaitanya;abinaya;bhanu;bhanumathi old;naga;sekhar;shyam;kamma;cinema;naga aswin;media;love;audience;industry;blockbuster hit;hero;letter;heroine;chaitanya 1;sai pallavi;love story;fidaaSun, 09 May 2021 12:37:26 GMT ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్స్ వస్తూ, పోతూ ఉంటారు.. కానీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసే హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉంటూరు. అలాంటి వారిలో సాయి పల్లవి ఒకరు. నేటితరం సినిమాలలో హీరోయిన్లు కేవలం గ్లామర్ మాత్రమే పరిమితం అవుతున్న ఈరోజుల్లో హీరోలను సైతం డామినేట్ చేసే నటన ప్రతిభతో ఆడియన్స్ లో స్పెషల్ క్రేజ్ సంపాధించుకుంది సాయిపల్లవి. నేడు ఆమె పుట్టిన రోజు. నేటితో ఆమె 29వ ఏటా అడుగుపెడుతుంది. దీంతో ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా భారీ ఎత్తున విషెస్ తెలుపుతున్నారు.

సాయిపల్లవి  కేవలం అందంతోనే కాకుండా, గ్లామర్ పాత్రల వైపు మొగ్గు చుపకుండా.. తన సహజమైన నటనతోనూ, అభినయంతోను సినిమాలోని తన పాత్రకు వందకు వంద శాతం న్యాయం చేస్తుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన " ఫిదా " సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపుకు తిప్పుకుంది. ఈ సినిమాలో భానుమతి గా సాయి పల్లవి చేసిన అల్లరిని తెలుగు సినీ ప్రియులు అంతా తేలికగా మర్చిపోలేరు. ఆ సినిమా అంత బ్లాక్ బస్టర్ అవడంలో సాయి పల్లవి నటన 'కీ రోల్' పోషించింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

 అంతా భారీ విజయం వచ్చిన తరువాత ఎన్నో అవకాశాలు వెల్లువెత్తినప్పటికి తొందరపడి సినిమాలు చేయకుండా ఆచితూచి సినిమాలు చేస్తూ వచ్చింది. ఇక సాయి పల్లవి కేవలం నటన పరంగానే కాక తన వ్యక్తిత్వం పరంగా కూడా ప్రత్యేకతను చాటుకుంది. కథ నచ్చకపోతే ఎంతటి స్టార్ హీరో సినిమానైనా రిజెక్ట్ చెయ్యడం కేవలం సాయిపల్లవికి మాత్రమే చెల్లింది. కేవలం కథను మాత్రమే నమ్మి సినిమాలలో నటించడం.. ఆమె నటించే పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చెయ్యడం వంటి క్వాలిటీస్.. ప్రేక్షకుల్లో సాయి పల్లవికి స్పెషల్ క్రేజ్ ను కట్టబెట్టాయి. స్టార్ హీరోలకు సైతం సాధ్యం కానీ రికార్డులను కేవలం తన పాటలతోనే  నెలకొల్పింది అంటే ఆడియన్స్ లో ఆమె క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

 ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మూడు భారీ సినిమాలలో నటిస్తుంది. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో వస్తున్న రానా " విరాట పర్వం ", పిరియడిక్ సినిమాగా తెరకెక్కుతున్న నాని " శ్యామ్ సింగ రాయ్ ", కూల్ లవ్ స్టోరీ గా వస్తున్న నాగ చైతన్య " లవ్ స్టోరీ " వంటి మూవీస్ లో నటిస్తుంది. ఈ సినిమాలన్నీ కూడా దేనికవే ప్రత్యేకమైనవి. కాబట్టి ఈ సినిమాలతో సాయి పల్లవి మరో మెట్టు ఎదగడం ఖాయంగా కనిపిస్తుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో కర్ఫ్యూ నుండి వీటికి మినహాయింపు ..!

ఆ అందాల భామ పేరు వెనక అసలు కథ ఇదే..!

జగన్ పై మహిళా నేత కీలక వ్యాఖ్యలు...!

చిరు మోహన్ బాబు మల్టీస్టారర్ అలా ఆగింది... ?

ఎడిటోరియల్: ఇక బెంగాల్ వేదికగా మమత - మోదీ సమరం - రణభేరి మ్రోగింది

ఈ టైం లో ఇవేం పనులు సార్...?

అమ్మ ఇచ్చిన వెయ్యి రూపాయిలతో కోట్లకు అధిపతి అయిన కోటి రెడ్డి !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>