PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mothersday268a6e77-c2f1-4998-8716-f1dbc1202353-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mothersday268a6e77-c2f1-4998-8716-f1dbc1202353-415x250-IndiaHerald.jpgవైఎస్‌ జగన్.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి.. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. చనిపోయేనాటికి ముఖ్యమంత్రి.. పదవిలో ఉండగానే చనిపోయిన వ్యక్తి. తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇవాళ జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ.. తండ్రి హఠాన్మరణం నుంచి సీఎం అయ్యే వరకూ జగన్ రాజకీయ ప్రస్థానం ఆసాంతం ఓ ముళ్లబాట.. ఎన్నో అవమానాలు, అడ్డంకులు.. అన్నింటినీ తట్టుకుని నిలబడి ఓ రాజకీయ ధీరోధాత్తుడిగా ఇప్పుడు జగన్ కనిపిస్తున్నారు. ఈ విజయ ప్రస్థానం వెనుక అడుగడుగునా తల్లి విజయమ్మ తనదైన పాత్ర పోషించారు. జగన్‌కు మొదటి నmothersday;dr rajasekhar;tara;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;chief minister;heart;husband;father;reddy;prasthanamమదర్స్ డే: జగన్‌ ప్రస్థానంలో అడుగడుగునా విజయమ్మమదర్స్ డే: జగన్‌ ప్రస్థానంలో అడుగడుగునా విజయమ్మmothersday;dr rajasekhar;tara;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;chief minister;heart;husband;father;reddy;prasthanamSun, 09 May 2021 09:00:00 GMTవైఎస్‌ జగన్.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి.. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. చనిపోయేనాటికి ముఖ్యమంత్రి.. పదవిలో ఉండగానే చనిపోయిన వ్యక్తి. తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇవాళ జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ.. తండ్రి హఠాన్మరణం నుంచి సీఎం అయ్యే వరకూ జగన్ రాజకీయ ప్రస్థానం ఆసాంతం ఓ ముళ్లబాట.. ఎన్నో అవమానాలు, అడ్డంకులు.. అన్నింటినీ తట్టుకుని నిలబడి ఓ రాజకీయ ధీరోధాత్తుడిగా ఇప్పుడు జగన్ కనిపిస్తున్నారు.

ఈ విజయ ప్రస్థానం వెనుక అడుగడుగునా తల్లి విజయమ్మ తనదైన పాత్ర పోషించారు. జగన్‌కు మొదటి నుంచి అమ్మ విజయమ్మ దగ్గర బాగా చనువు.. తండ్రి రాజకీయాల్లో కీలకంగా ఉండే రోజుల్లో జగన్, షర్మిల బాధ్యతలన్నీ విజయమ్మే చూసుకునేవారు. దైవాన్ని బాగా నమ్మే విజయమ్మ.. ఎవరినీ అపకారం తలపెట్టకూడదని.. మనం నమ్మిన మార్గంలో ముందుకెళ్తే దైవం.. ఆయనే ఆశీర్వదిస్తాడని.. బలంగా నమ్మేది.. జగన్‌కు అదే చెప్పేది.. ఆమె ప్రోత్సాహం, ప్రోద్బలంతోనే జగన్ వ్యక్తిత్వం తయారైంది.

ఒక్కసారి నమ్మితే చాలు.. ఎంతటి కష్టం వచ్చినా వెనుదిరగని జగన్ వ్యక్తిత్వానికి పునాది విజయమ్మే. తండ్రి అకాల మ‌ర‌ణం త‌రువాత వైఎస్ఆర్ ప్రజ‌ల‌కు ఇచ్చిన మాటను బాధ్యత‌గా తన కొడుకు తీసుకునేలా చేయ‌డంలో విజయమ్మ పాత్ర కీలకం. ఆమె స్వయంగా జ‌గ‌న్ లేని సంద‌ర్భల్లో పార్టీని ముందుకు న‌డిపించారు. భర్త మరణంతో హ‌ఠాత్తుగా కొండంత అండ‌ను కోల్పోయినా గుండె నిబ్బరం స‌డ‌ల‌నీయని విజయమ్మ.. చేతికందిన కొడుకును విజయ ప్రస్థానంవైపు నడిపించారు.

ఎన్నో రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌ు.. ఎందరో ప్రత్యర్థులు.. ఎన్నో వ్యుహాలు.. ఈ ధాటికి జగన్ జైలు పాలయ్యాడు. అయినా విజయమ్మ న‌మ్మకంలో అణువంతైనా త‌గ్గలేదు. మ‌నో ధైర్యంతో అన్ని కష్టాలను అధిగమించి జగన్‌ను విజయవంతమైన నేతగా తీర్చిదిద్దారు. అందుకే అన్ని కష్టాలు అధిగమించి జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ఆమె భావోద్వేగం అందరి హృదయాలను కదిలించింది. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ రోజు ఈ స్థాయికి వ‌చ్చారంటే దానికి కార‌ణం త‌ప్పకుండా విజ‌య‌మ్మే అని చెబుతారు ఆ కుటుంబాన్ని దగ్గర నుంచి చూసినవాళ్లు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మ‌ద‌ర్స్ డే : ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే.. !

సాయి పల్లవి విజయ రహస్యమిదే ?

హ్యాపీ సండే 9-MAY: ఈ వారం ఎన్టీఆర్ విశేషాలివే.. !

మదర్స్ డే: రాజీవ్‌ గాంధీని నడిపించిన శక్తి ఇందిరాగాంధీ..!

హ్యాపీ సండే 9-MAY: ఈ వారం ప్రభాస్ విశేషాలివే... !

సాయిపల్లవికి స్టార్ డమ్ అంటే ఆ ఎయిర్‌పోర్టులో తెలిసిందట..

ఛోటా నేత‌లే.. కానీ జెయింట్ కిల్ల‌ర్స్‌..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>