MoviesVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-marriage-updates702d98ce-a9ee-434d-85b7-89b19e805a1e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-marriage-updates702d98ce-a9ee-434d-85b7-89b19e805a1e-415x250-IndiaHerald.jpgసందీప్ కిషన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఢిల్లీ భామ రకుల్ ప్రీత్ సింగ్, టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పేరుకి పంజాబీ అమ్మాయే అయినా మన తెలుగు భాష అంటే ఈమెకు మక్కువ ఎక్కువ. RAKUL PREETH PERSONAL UPDATES;venkatesh;rana;bhama;kajal aggarwal;lakshmi;lakshmi manchu;raashi khanna;raasi;rakul preet singh;sai dharam tej;sandeep;sundeep kishan;delhi;tollywood;cinema;marriage;pistachio;press;lakshmi devi;daggubati venkateswara rao;letter;heroine;venkatadri express;punjabi;rashi khannaపెళ్లి తర్వాత ఈ అమ్మడు నటనకు గుడ్ బై చెప్పనుందా ?పెళ్లి తర్వాత ఈ అమ్మడు నటనకు గుడ్ బై చెప్పనుందా ?RAKUL PREETH PERSONAL UPDATES;venkatesh;rana;bhama;kajal aggarwal;lakshmi;lakshmi manchu;raashi khanna;raasi;rakul preet singh;sai dharam tej;sandeep;sundeep kishan;delhi;tollywood;cinema;marriage;pistachio;press;lakshmi devi;daggubati venkateswara rao;letter;heroine;venkatadri express;punjabi;rashi khannaSun, 09 May 2021 13:00:00 GMTసందీప్ కిషన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఢిల్లీ భామ రకుల్ ప్రీత్ సింగ్, టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పేరుకి పంజాబీ అమ్మాయే అయినా మన తెలుగు భాష అంటే ఈమెకు మక్కువ ఎక్కువ. టాలీవుడ్ లో ఫ్రెండ్ సర్కిల్స్ ను బాగానే మెయింటైన్ చేస్తుంది ఈ భామ. సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా, రానా, రెజీనా కసాండ్రా, మంచు లక్ష్మి లతో చాలా సన్నిహితంగా ఉంటారు రకుల్. సాధారణంగా తమ అభిమాన తారల పెళ్లిళ్ల విషయంలో ఎక్కువ క్యూరియాసిటీ చూపిస్తుంటారు ఫ్యాన్స్. ఇక టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ లేడీ బ్యాచిలర్ లిస్ట్ లో ఈ హీరోయిన్ కూడా ఒకరు. సో రకుల్ పెళ్లి ఎప్పుడన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.
 
అయితే తాజాగా తన క్లోజ్ ఫ్రెండ్ మంచు లక్ష్మితో కలసి జెమినీ లో ప్రసారం అవుతున్న నెంబర్ వన్ యారి షో లో ప్రత్యక్షమయ్యారు రకుల్ . ఈ షోకి దగ్గుబాటి రానా హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ షోలో తనకు సంబంధించిన పలు  ఆసక్తికర అంశాలను పంచుకున్నారు రకుల్ ప్రీత్ సింగ్. అలా సంభాషణ మధ్యలో రకుల్ పెళ్లి టాపిక్ రాగా ఈ ఏడాది పూర్తి అయ్యేలోపు రకుల్ పెళ్లి చూస్తారంటూ ప్రకటించింది మంచు లక్ష్మి.   వైపు రకుల్ కాదంటున్నా వినకుండా, లక్ష్మి కనీసం ఈ పంజాబీ బేబీ కి పెళ్లి సంబంధాలు చూస్తారని, లేకపోతే బాయ్ ఫ్రెండ్ అయినా వస్తాడని పేర్కొంది . ఇక ఆ అదృష్టవంతుడు ఎవరో గాని నా దగ్గరకు వస్తే రకుల్ గురించి పూర్తి విషయాలు చెప్పి పంపిస్తా అంటూ సరదాగా రకుల్ ని ఆటపట్టించింది మంచు లక్ష్మి.
 
ఈ సందర్భంగా గతంలో తనపై వచ్చిన ఓ రూమర్ కి క్లారిటీ ఇచ్చింది రకుల్. ఇంతకముందు రకుల్ - రానా డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు చాలానే పుట్టుకొచ్చాయి. అయితే అందులో నిజం లేదు మేమిద్దరం చాలా మంచి స్నేహితులం అంటూ, ఒక స్నేహితుడిగా రానా అంటే నాకు చాలా గౌరవం, అభిమానం  ఉంది అంటూ  క్లారిటీ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. ఇదంతా ఇలా ఉంటే...రకుల్ ప్రీత్ ఒకవేళ ఈ సంవత్సరం పెళ్లి చేసుకుంటే, ఆ తరువాత సినిమాలలో నటిస్తుందా ? లేదా పూర్తిగా వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తుందా తెలియాల్సి ఉంది. ఇప్పటికే సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా ఉండి పెళ్లి చేసుకున్న తారలు నటిగా కొనసాగుతున్నారు. అందులో కాజల్ అగర్వాల్ పేరు ముందుగా చెప్పుకోవచ్చు. మరి ముందు ముందు ఏమి జరగనుందో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే అంటున్నాయి తెలుగు సినీ వర్గాలు.  


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో కర్ఫ్యూ నుండి వీటికి మినహాయింపు ..!

ఆ అందాల భామ పేరు వెనక అసలు కథ ఇదే..!

జగన్ పై మహిళా నేత కీలక వ్యాఖ్యలు...!

చిరు మోహన్ బాబు మల్టీస్టారర్ అలా ఆగింది... ?

ఎడిటోరియల్: ఇక బెంగాల్ వేదికగా మమత - మోదీ సమరం - రణభేరి మ్రోగింది

ఈ టైం లో ఇవేం పనులు సార్...?

అమ్మ ఇచ్చిన వెయ్యి రూపాయిలతో కోట్లకు అధిపతి అయిన కోటి రెడ్డి !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>