PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sunkara-padmasree-chandrababu-tdp-congress-ape4307d94-519e-4be5-b24c-56cac7247de3-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sunkara-padmasree-chandrababu-tdp-congress-ape4307d94-519e-4be5-b24c-56cac7247de3-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ తో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని పూజలు నిర్వహించారు ఏపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ. మూడు మతాలకు చెందిన గురువులతో పార్ధనలు నిర్వహించారు. కరోనాతో చనిపోయిన వారికి ప్రధానం చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కరోనా రక్కసితో పోరాడి అశువులు బాసిన ప్రతి ఒక్కరి మరణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలి అని కోరారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి జగన్ నిర్లక్ష్యం వల్లే కరోనాకి ఇంతమంది బలైపోతున్నారు అని మండిపడ్డారు. కరోనా నియంత్రణకు చర్యలు తీసుకోకపోగాsunkara padma sri,jagan,ap;jagan;andhra pradesh;narendra modi;congress;sunkara ramabrahmam;prime minister;chief minister;aqua;cemetery;central government;oxygen;party;coronavirus;padma shriజగన్ పై మహిళా నేత కీలక వ్యాఖ్యలు...!జగన్ పై మహిళా నేత కీలక వ్యాఖ్యలు...!sunkara padma sri,jagan,ap;jagan;andhra pradesh;narendra modi;congress;sunkara ramabrahmam;prime minister;chief minister;aqua;cemetery;central government;oxygen;party;coronavirus;padma shriSun, 09 May 2021 12:13:08 GMTకరోనా వైరస్ తో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని పూజలు నిర్వహించారు ఏపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ. మూడు మతాలకు చెందిన గురువులతో పార్ధనలు నిర్వహించారు. కరోనాతో చనిపోయిన వారికి ప్రధానం చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కరోనా రక్కసితో పోరాడి అశువులు బాసిన ప్రతి ఒక్కరి మరణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలి అని కోరారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి జగన్ నిర్లక్ష్యం వల్లే కరోనాకి ఇంతమంది బలైపోతున్నారు అని మండిపడ్డారు.

కరోనా నియంత్రణకు చర్యలు తీసుకోకపోగా ప్రజలను పక్కదారి పట్టించి నేడు ఇంతమంది చావుకు కారణమవుతున్నారు అని విమర్శించారు. దీపాలు వెలిగించండి, చప్పట్లు కొట్టండి అని ప్రధాని చెప్పారు.. దీపాలు వెలిగిస్తే, చప్పట్లు కొడితే కరోనా పోతుందా ? అని నిలదీశారు. ముఖ్యమంత్రి జగన్ అయితే ఒక అడుగు ముందుకు వేసి ప్యారాసిటీమల్, బ్లీచింగ్ పౌడర్ చల్లితే కరోనా పోతుందని చెప్పారు అని అన్నారు. ప్రజల జీవితాలు వెలిగిపోతున్నాయని ప్రధాని మోదీ చెబుతున్నారు అని ఆరోపించారు.

వెలిగిపోవడం కాదు ప్రధాని  మోదీ, ముఖ్యమంత్రి జగన్ చేసిన పని వల్ల ప్రజల జీవితాలు కరోనా మంటల్లో కాలిపోతున్నాయి అని అన్నారు. బాధ్యత కలిగిన స్థాయిలో ఉంది మీరు చెప్పేది ఇదేనా? అని ఆమె ప్రశ్నించారు. ప్రతిరోజూ వేల సఖ్యలో పాజిటివ్ కేసులు నమోదౌతుంటే, పదుల సంఖ్యలో మృతి చెందుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేసారు. కరోనపై ఇష్టానుసారంగా ప్రకటనలు చేయడంతోనే నేడు ఈ దుస్థితి ఏర్పడింది అని, స్మశానంలో మృతదేహాలను దహనం చేయడానికి కూడా వీలు లేకుండా ఉందన్నారు. సెకండ్ వేవ్ వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు దానిని ఎలా ఎదుర్కోవాలి అని కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయలేదు అని వ్యాఖ్యలు చేసారు. హాస్పిటల్ లో బెడ్స్ లేక, ఆక్సిజన్ సిలిండర్లు లేక ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేసారు. 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వణుకుపుట్టించే వార్త చెప్పిన CDC..తీవ్ర హెచ్చరిక..!!

చిరు మోహన్ బాబు మల్టీస్టారర్ అలా ఆగింది... ?

ఎడిటోరియల్: ఇక బెంగాల్ వేదికగా మమత - మోదీ సమరం - రణభేరి మ్రోగింది

ఈ టైం లో ఇవేం పనులు సార్...?

అమ్మ ఇచ్చిన వెయ్యి రూపాయిలతో కోట్లకు అధిపతి అయిన కోటి రెడ్డి !

వేరియెంట్ వార్... పాలిటిక్స్ హుషార్.... ?

ఈ స్పెషల్ రికార్డులు ఒక్క సాయి పల్లవికే సొంతం.. ఎవరూ అందుకోలేరు..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>