EducationThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/covid-vaccine576477f2-7054-4c6b-8129-872054f7e0cc-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/covid-vaccine576477f2-7054-4c6b-8129-872054f7e0cc-415x250-IndiaHerald.jpgకేంద్ర ప్ర‌భుత్వం మే1 నుంచి 18ఏళ్లు నిండిన వారికి కొవిడ్ టీకా ఇస్తామ‌ని చెప్పంది. అయితే రాష్ట్ర ప్ర‌భుత్వం మాత్రం ప్ర‌స్తుతం వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా ఆశించిన స్థాయిలో లేద‌ని, ముందు 45ఏళ్లు పైబ‌డిన వారికి పూర్త‌య్యే వ‌ర‌కు వ్యాక్సిన్ ఇవ్వ‌టం జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టం చేసింది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సిన్‌ను అందిస్తుంది. తాజాగా కొవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేష‌న్ విధానాన్ని అమ‌ల్లోకి తెచ్చింది. పోర్ట‌ల్‌లో స్లాట్ బుక్ చేసుకుంటేనే వ్యాక్సిన్ వేయ‌టం జ‌రుగుతుంద‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.covid vaccine;central government;june;research and analysis wingవ్యాక్సిన్ కోసం పాట్లు.. వారికైతే రెండునెల‌లు ఆగాల్సిందే!వ్యాక్సిన్ కోసం పాట్లు.. వారికైతే రెండునెల‌లు ఆగాల్సిందే!covid vaccine;central government;june;research and analysis wingSat, 08 May 2021 08:02:47 GMTదేశాన్ని క‌రోనా వ‌ణికిస్తోంది.. సెకండ్ వేవ్ ప్ర‌భావం తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌టంతో ప్ర‌జ‌లు హ‌డ‌లిపోతున్నారు. కొవిడ్ బారిన ప‌డి ఆస్ప‌త్రుల బాట ప‌డుతున్నారు. కొవిడ్ సోకిన వారిలో మ‌ర‌ణాలుసైతం అధికంగానే ఉండ‌టం ఆందోళ‌న క‌లిగించే విష‌యం. వైర‌స్ క‌ట్ట‌డికి రాష్ట్ర ప్ర‌భుత్వాలు లాక్‌డౌన్‌లు, క‌ర్ఫ్యూలు విధిస్తున్నాయి. అయినా పెద్ద‌గా మార్పురావ‌డం లేదు. కొవిడ్ క‌ట్ట‌డికి వ్యాక్సిన్ ఆయుధంగా మార‌డంతో వ్యాక్సిన్ వేయించుకొనేందుకు ప్ర‌జ‌లు ప‌రుగులు పెడుతున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం 45ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ ఇస్తుంది. అయితే వ్యాక్సిన్ స‌రిప‌డా స‌ర‌ఫ‌రా కాక‌పోవ‌టంతో వాక్సిన్ వేయించుకొనేందుకు కేంద్రాల‌కు వెళ్లిన ప్ర‌జ‌లకు నిరాశ ఎదుర‌వుతుంది.

కేంద్ర ప్ర‌భుత్వం మే1 నుంచి 18ఏళ్లు నిండిన వారికి కొవిడ్ టీకా ఇస్తామ‌ని చెప్పంది. అయితే రాష్ట్ర ప్ర‌భుత్వం మాత్రం ప్ర‌స్తుతం వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా ఆశించిన స్థాయిలో  లేద‌ని, ముందు 45ఏళ్లు పైబ‌డిన వారికి పూర్త‌య్యే వ‌ర‌కు వ్యాక్సిన్ ఇవ్వ‌టం జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టం చేసింది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సిన్‌ను అందిస్తుంది. తాజాగా కొవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేష‌న్ విధానాన్ని అమ‌ల్లోకి తెచ్చింది. పోర్ట‌ల్‌లో స్లాట్ బుక్ చేసుకుంటేనే వ్యాక్సిన్ వేయ‌టం జ‌రుగుతుంద‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. దీంతో గ్రామీణ ప్రాంతాల ప్ర‌జలు అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇప్ప‌టికే మొద‌టి డోస్ తీసుకొని రెండ‌వ డోస్‌కోసం ల‌క్ష‌లాది మంది ఎదురుచూస్తున్నారు. ప్ర‌స్తుతం కోవిన్ పోర్ట‌ల్‌లో కేవ‌లం మొద‌టి డోస్‌వారికి మాత్ర‌మే స్లాట్ బుక్ చేసుకొనేందుకు అవ‌కాశం ఉంది. దీంతో రెండ‌వ డోస్ తీసుకోవాల్సిన వారు దిక్కుతోచ‌ని స్థితిలో ప‌డిపోయారు. ఈక్ర‌మంలో రాష్ట్ర ప్ర‌భుత్వం నేటి నుంచి కేవ‌లం రెండ‌వ డోస్ వారికే వ్యాక్సిన్ వేస్తామ‌ని స్ప‌ష్టం చేసింది.

మే 31 నాటికి రెండ‌వ డోస్ తీసుకోవాల్సిన వారు 19,92,257 మంది ఉన్నారు. వీరికి కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాల‌ను అందించారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం టీకా నిల్వ‌లు 3,74,900 డోసులు మాత్ర‌మే ఉన్నాయి. అప్ప‌టిదాకా రెండో డోసువారికే టీకాలు ఇస్తామ‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. ఈనెల 15నాటికి మ‌రో 3,11,000 టీకా డోసులు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తుంది. ఈ ప‌రిస్థితుల్లో మే నెలాఖ‌రు వ‌ర‌కు రెండో డోస్ వారికే టీకాలు స‌రిపోని ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో మొద‌టి డోస్ వేసుకోవాల్సిన వారు ఈ నెల చివ‌రి వ‌ర‌కు ఆగాల్సిందే. ఇప్ప‌టికే కొవిడ్ వ్యాక్సిన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రాల్లో ప్ర‌జ‌లు క్యూలు క‌డుతున్నారు. ఈ క్ర‌మంలో తొలిడోస్ వ్యాక్సిన్ నిలిపివేయ‌డం ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హాన్ని తెప్పిస్తుంది. ఇదిలాఉంటే 18ఏళ్ల నుంచి 44ఏళ్ల వారికి టీకా ప‌రిస్థితి ఏమిట‌న్న ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతుంది. ఈ లెక్కన చూస్తే జూన్ నెల‌కూడా వీరికి టీకా అందే ప‌రిస్థితి లేదు. దీంతో ప్ర‌జ‌లు ఇదేం వ్యాక్సిన్ రా బాబు అంటూ త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

డ్రోన్లతో మందులు.. ప్రతిపక్షాల విమర్శలు..

బిగ్ బాస్ సీజన్ 5కి కొత్త కన్ఫ్యూజన్లు!

ఆ దేశంలో ఆగస్టు కల్లా కరోనా ఖతం ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఈటలను అన్నీ వైపులా బిగించేస్తున్న కేసీయార్

ఏంది జ‌గ‌న్ ఇది..భ‌య‌మా.. గౌర‌వ‌మా..?

పాక్ ప్రధాని ఇమ్రాన్ నోట.. భారత్ భేష్.. !

ఆచార్య ఆత్రేయ: మనసుకు హత్తుకునే కవి ఆత్రేయ..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>