PoliticsVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-vs-eetalac8ce4af1-1f2b-4f28-a0fb-b3d8499edb25-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-vs-eetalac8ce4af1-1f2b-4f28-a0fb-b3d8499edb25-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాజకీయాల్లో ఇప్పటి వరకు జరిగినవన్నీ ఒకెత్తు, ఇప్పుడు జరుగుతున్న ఘటనలు మరో ఎత్తని చెప్పాలి. మాములుగా రాజకీయాలలో ఒక పార్టీ నాయకులు మరో పార్టీ నాయకులను విమర్శించడం వివాదాలను సృష్టించి ఇబ్బంది పెట్టడం ఇప్పటి వరకు జరిగినవే. అయితే దీనికి భిన్నంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుండడంతో గత పది రోజుల నుండి రాజకీయం వేడెక్కుతోంది.KCR VS EETALA;kcr;srinivas;eatala rajendar;telangana;government;cabinet;minister;thief;success;nijam;etela rajender;donga;party;mantraఈటల విషయంలో కేసీఆర్ వెనక్కు తగ్గాడా ?ఈటల విషయంలో కేసీఆర్ వెనక్కు తగ్గాడా ?KCR VS EETALA;kcr;srinivas;eatala rajendar;telangana;government;cabinet;minister;thief;success;nijam;etela rajender;donga;party;mantraSat, 08 May 2021 15:00:00 GMTతెలంగాణ రాజకీయాల్లో ఇప్పటి వరకు జరిగినవన్నీ ఒకెత్తు, ఇప్పుడు జరుగుతున్న ఘటనలు మరో ఎత్తని చెప్పాలి. మాములుగా రాజకీయాలలో ఒక పార్టీ నాయకులు మరో పార్టీ నాయకులను విమర్శించడం వివాదాలను సృష్టించి ఇబ్బంది పెట్టడం ఇప్పటి వరకు జరిగినవే. అయితే దీనికి భిన్నంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుండడంతో గత పది రోజుల నుండి రాజకీయం వేడెక్కుతోంది. తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ అసైన్డ్ భూముల కబ్జా వివాదం మరింత దూరం వెళ్లేలా ఉంది. ఇప్పటికే ఈ విషయంపై ప్రజలకు ఒక అవగాహన వచ్చి ఉంటుంది. ఈటలకు సంబంధించిన అన్ని విషయాలను తెరపైకి తెస్తూ ఈటలను భయపెట్టేందుకు కేసీఆర్ చేస్తున్న పనులకు ఈటల రాజేందర్ భయపడకపోగా, చాలా ప్రశాంతంగా ప్రజలకు తన సమస్యను తెలియయచేయడంలో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.

కానీ ఎందుకో కేసీఆర్ ఇక ఈ వ్యవహారంలో ఇంతకు మించి ముందుకు వెళ్ళడేమో అన్న భావనలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి తెలంగాణ జర్నలిస్ట్ శ్రీనివాస్ కొన్ని విషయాలను చర్చించారు. శ్రీనివాస్ కథనం ప్రకారం, ప్రస్తుతం ఈటల రాజేందర్ కబ్జా చేశారు అని చెబుతున్న ప్రాంతంలో మొత్తం 1500 ఎకరాలు ఉన్నాయి. ఇవి అన్నీ కూడా ఎవరికి నచ్చినట్లుగా వారు అమ్ముకున్నారు. ఈ ప్రాంతానికి సంబంధించి చాలా క్రయ విక్రయాల లావాదేవీలు మరియు రిజిస్ట్రేషన్ లు జరిగాయి. దీనికి తోడు అక్కడ ఎమ్ ఆర్ ఓ లు కూడా డబ్బుకు ఆశపడి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ లు ఇచ్చేశారు. ఇక్కడున్న భూముల్లో 200 నిర్మాణాలు జరిగి ఉన్నాయి. అయితే ఇప్పుడు కనుక కేసీఆర్ పెద్ద కమిటీ ఒక్కటి వేసి ఈటల మీద వ్యతిరేక రిపోర్ట్ రెడీ చేయమని చెప్పాడనుకుంటే, వాస్తవంగా ఇది సాధ్యమేనా ? ఆ కమిటీ నిజంగా వాస్తవాలను బయటపెట్టగలదా ? ఒకవేళ రాజేందర్ భూముల విషయాలను కదిల్చితే..అక్కడే ఉన్న ఎంతోమంది భూముల బాగోతం బయటపడదా ? దీని తరువాత జరిగే పర్యవసానాలకు  కేసీఆర్ సిద్దమేనా ? ఇలా ఎన్నో సందేహాలు ఉన్నాయి.

లేదు ఒక వేళ ఈ విషయంపై కేసీఆర్ సీరియస్ గా ఉన్నాడు అనుకుంటే, ఈ కమిటీ కనుక ఈ భూములన్నీ అక్రమం అని రిపోర్ట్ ఇస్తే, రాష్ట్రంలోని వేల ఎకరాలలో ఉన్న దేవాదాయ భూములన్నిటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా ? కాబట్టి ఈటల రాజేందర్ ని దెబ్బ కొట్టాలనుకుంటే కేసీఆర్ వేరే ప్రత్యామ్నాయాలను వెతుక్కోవడమే మంచిది. నాలుగురోజులు పోతే ఈ భూముల గురించి కేసీఆర్ తో పాటు అందరూ మరిచిపోతారు. అంతే కాకుండా ఈటలను దొంగ అని నిరూపిస్తే కనుక...ఆ ముసుగులో ఉన్న మిగతావారిని సైతం ప్రశ్నించే హక్కు ఇచ్చినట్లే అవుతుంది. కేసీఆర్ కేబినెట్ లో ఉన్న మంత్రుల్లో చాలా మంది అలాంటి వారు ఉన్నారు. కేసీఆర్ తనకున్న అధికార బలంతో మీడియాని, ప్రతిపక్షాలను అణగదొక్కేస్తున్నాడు. మరి రానున్న రోజుల్లో ఏమి జరగనుందో చూడాలి.  



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జ‌గన్ మెడ‌లో వైసీపీ కండువా... లోప‌ల బ‌నియ‌న్ కాషాయ‌మే ?

లోకేష్ టోన్ మారిందా.. జ‌గ‌న్ విష‌యంలో యూట‌ర్న్‌..!

ఎడిటోరియల్: మమత యుపిఏ నాయకత్వానికి తగిన వ్యక్తి కాదు

మ‌రో మంత్రిపై భూదందా ఆరోప‌ణ‌లు.. జ‌ప్తులో ఉన్న భూమి స్వాహా?

బిల్ గేట్స్ విడాకుల వ్యవహారంలో మూడో వ్యక్తి?

కడప పేలుడు : మృతులు ఈ ప్రాంతానికి చెందిన వారే..!

ఇదంతా వాళ్ల వల్లే..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>