Moviesyekalavyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-devarakonda-is-not-going-to-celebrate-with-ice-creames-this-year663cb881-55d2-4ccb-a47b-eb493830f94e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-devarakonda-is-not-going-to-celebrate-with-ice-creames-this-year663cb881-55d2-4ccb-a47b-eb493830f94e-415x250-IndiaHerald.jpgవిజయ్ దేవరకొండ ఎప్పుడూ తన బర్త్‌డేకు ఐస్ క్రీమ్స్ పంచుతూ ఉంటాడు. గత రెండేళ్లుగా అభిమానులకు ఇలా ఐస్ క్రీమ్స్ పంచుతూ హ్యాపీనెస్‌ను పంచుతున్నాడు. మొదటి సంవత్సరం కేవలం ఒక్క హైదరాబాద్‌లోనే ఐస్‌క్రీమ్స్ పంచిన విజయ్.. ఆ తర్వాతి ఏడాది దాదాపు 7 నగరాల్లో ఇలా ఐస్ క్రీమ్స్ ట్రక్స్ నడిపాడు. తన బర్త్ డే రోజున అన్ని చోట్లా ప్రజలకు ఐస్‌క్రీం పంచుతూ తెగ సంబరపడ్డాడు. ఇక ఆ సంప్రదాయాన్ని విజయ్ అలానే కొనసాగించాడు. కానీ గతేడాది కూడా ఈ సమయంలో ..vijay-devarakonda-birthday;vijay;vaishno devi;dargah sharif;joseph vijay;devarakondaఈ ఏడాది కూడా విజయ్ బర్త్‌డే ఐస్‌ క్రీమ్ లేనట్లేనా..?ఈ ఏడాది కూడా విజయ్ బర్త్‌డే ఐస్‌ క్రీమ్ లేనట్లేనా..?vijay-devarakonda-birthday;vijay;vaishno devi;dargah sharif;joseph vijay;devarakondaSat, 08 May 2021 22:33:00 GMTవిజయ్ దేవరకొండ ఎప్పుడూ తన బర్త్‌డేకు ఐస్ క్రీమ్స్ పంచుతూ ఉంటాడు. గత రెండేళ్లుగా అభిమానులకు ఇలా ఐస్ క్రీమ్స్ పంచుతూ హ్యాపీనెస్‌ను పంచుతున్నాడు. మొదటి సంవత్సరం కేవలం ఒక్క హైదరాబాద్‌లోనే ఐస్‌క్రీమ్స్ పంచిన విజయ్.. ఆ తర్వాతి ఏడాది దాదాపు 7 నగరాల్లో ఇలా ఐస్ క్రీమ్స్ ట్రక్స్ నడిపాడు. తన బర్త్ డే రోజున అన్ని చోట్లా ప్రజలకు ఐస్‌క్రీం పంచుతూ తెగ సంబరపడ్డాడు. ఇక ఆ సంప్రదాయాన్ని విజయ్ అలానే కొనసాగించాడు. కానీ గతేడాది కూడా ఈ సమయంలో కరోనా ఉండడంతో ఐస్‌క్రీమ్ ట్రక్ నడపలేదు. ఈ క్రమంలోనే రేపు.. అంటే మే 9న విజయ్ బర్త్ డే. కానీ ఈ సారి ఐస్ క్రీమ్ ట్రక్స్ ఉండే అవకావం లేనట్లే ఉంది. ప్రస్తుత కరోనా నేపథ్యంలో విజయ్ ఈ సారి ఐస్ క్రీమ్ నడపట్లేదని తెలుస్తోంది.

సాధారణంగా విజయ్ ఐస్ క్రీం ట్రక్ వచ్చిందంటే.. ఫ్యాన్స్ అంతా ఎగబడతారు. ఐస్ క్రీమ్ కోసం గుంపుగా ఏర్పడతారు. కానీ ప్రస్తుత కరోనా నేపథ్యంలో షూటింగ్‌లే నిలిచిపోవడం, సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమైపోవడంతో విజయ్ కూడా ఇంట్లోనే ఉంటున్నాడు. దీంతో అతడు ఈ సారి ఫ్యాన్స్‌కు ఐస్ క్రీమ్స్ పంచే కార్యక్రమం నిర్వహించే అవకాశం లేనట్లే కనిపిస్తోంది. మరి దీనిపై విజయ్ నుంచి ఎలాంటి అఫీషియల్ న్యూస్ రాకపోయినా ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.

ఇదిలా ఉంటే.. ఇలా ఐస్ క్రీమ్ ట్రక్‌ను ప్రారంభించడానికి గల కారణాన్ని కొన్నేళ్ల క్రితమే విజయ్ వెల్లడించాడు. ‘2017లో తొలిసారి ఐస్ క్రీమ్ ట్రక్ స్టార్ట్ చేశా. అయితే అప్పుడు షూటింగ్ జరుగుతుండడం, ఎండలు బాగా ఉండడంతో బర్త్‌డే రోజు ఏదో స్పెషల్‌గా చేయాలని అనుకున్నా. చిన్నప్పుడు స్కూల్స్‌లో ఉన్నప్పుడు చాక్లెట్లు పంచి సంబరపడినట్లే ఏదో ఒకటి పంచాలని అనిపించింది. అప్పుడే సమ్మర్ కదా.. ఐస్ క్రీమ్ పంచుదామనుకున్నా. ఓ ఐస్ క్రీమ్ ట్రక్ తెప్పించి ఆ చుట్టుపక్కల ఉన్న వారందరికీ నేనే స్వయంగా పంచాను. నా ట్రక్ అలా వెళుతుంటే వెనకున్న వారి అందరి చేతుల్లో ఐస్ క్రీం ఉండడం భలే మజా నిచ్చింది. దాంతో ఆ ట్రెడిషన్ అలాగే కొనసాగిస్తున్నానం’టూ విజయ్ చెప్పుకొచ్చాడు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్లాప్ దర్శకుడితో ప్లాపుల్లో ఉన్న హీరో..? టెన్షన్లో ఫ్యాన్స్..!

టన్నుల కొద్దీ గ్లామర్ ఉన్నా నో యూజేనా... ?

'జూనియర్ ఎన్టీఆర్ - సమంత' జోడిగా నటించిన సినిమాలు ఇవే.. ఇందులో ఎన్ని హిట్ అయ్యాయంటే.??

చంద్రబాబుపై సీఐడీ సంచలన వ్యాఖ్యలు.. కోర్టులో కౌంటర్

కరోనాకి 5జీ టెస్టింగ్ కి సంబంధం ఉందా..?

టాలీవుడ్ బెస్ట్ కాంబినేషన్ : నాగార్జున, సౌందర్యల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఏంటో తెలుసా?

హీరోగా ఎదుగుతున్నాడు అనే మన హీరో లు సుమన్ ని జైలుకి పంపారా.. క్లారిటీ..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>