HealthDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/body-vishapadarthalu-neradu-popayya-nima-avakado95d66a18-3e37-4fa8-8708-0c2757203828-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/body-vishapadarthalu-neradu-popayya-nima-avakado95d66a18-3e37-4fa8-8708-0c2757203828-415x250-IndiaHerald.jpgసాధారణంగా మనం ఏం తిన్నా కూడా అందులో కావలసిన పోషకాలను మాత్రమే, మన శరీరం తీసుకుంటుంది. మిగతా పదార్థాలను మలవిసర్జన రూపంలో బయటకు పంపిస్తుంది. అయితే కొంత మందిలో చెడు పదార్థాలు బయటకు వెళ్ళకుండా ఎన్నో సమస్యలకు గురి అవుతుంటారు. అయితే అలాంటి వారు ఏం తినాలి? వేటిని తినడం వల్ల శరీరంలోని విషపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి? అనే విషయాలను ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.. అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే, పండ్లు ,కూరగాయల్లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి అని. అయితే ప్రత్యేకించి కొన్ని పండ్లను తినడం వల్ల శరీరంలోని వBODY VISHAPADARTHALU,NERADU,POPAYYA,NIMA,AVAKADO;tara;vitamin c;vitamin;shaktiశరీరంలోని విష పదార్థాలను తొలగిపోవాలంటే ?శరీరంలోని విష పదార్థాలను తొలగిపోవాలంటే ?BODY VISHAPADARTHALU,NERADU,POPAYYA,NIMA,AVAKADO;tara;vitamin c;vitamin;shaktiSat, 08 May 2021 18:00:00 GMT
సాధారణంగా మనం ఏం తిన్నా కూడా అందులో కావలసిన పోషకాలను మాత్రమే, మన శరీరం తీసుకుంటుంది.  మిగతా పదార్థాలను మలవిసర్జన రూపంలో బయటకు పంపిస్తుంది. అయితే కొంత మందిలో చెడు పదార్థాలు బయటకు వెళ్ళకుండా ఎన్నో సమస్యలకు గురి అవుతుంటారు. అయితే అలాంటి వారు ఏం తినాలి? వేటిని తినడం వల్ల శరీరంలోని విషపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి?  అనే విషయాలను ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..



అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే, పండ్లు ,కూరగాయల్లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి అని. అయితే ప్రత్యేకించి కొన్ని పండ్లను తినడం వల్ల శరీరంలోని వ్యర్థాలను తొలగించే శక్తి వాటికి ఉంటుంది.

నిమ్మకాయలు:
నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది.  ఇక ప్రతిరోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో ఈ నిమ్మరసం కలుపుకొని తాగడం వల్ల శరీరంలోని విషపదార్థాలు బయటకు పోతాయి.

నేరేడు పండ్లు : నేరేడు పండ్లను తినడం వల్ల, వీటిలో ఉండే యాంటీబయోటిక్ గుణాలు , శరీరంలోని వ్యర్థ పదార్థాలు పేరుకోకుండా ఉండేలా చూస్తాయి. తద్వారా శరీరంలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోకుండా ఉంటాయి. అలాగే ఇన్ఫెక్షన్లు కూడా దరిచేరవు.


బొప్పాయి పండు:
శరీరంలోని వివిధ అవయవాలలో పేరుకుపోయిన వ్యర్ధాలను బయటకు నెట్టేసి ,జీర్ణక్రియ , వ్యాధి నిరోధక శక్తిని మనలో పెంపొందిస్తాయి.

కీర:
కీర ముక్కలను నిల్వ ఉంచిన నీటిని తాగినా, శరీరంలోని విషపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.


అనాస పండు :
అనాస పండులో ఉండే  బ్రోమోలైన్ అనే ఎంజైము పెద్దపేగులోని వ్యర్థాలను బయటకు నెట్టి వేస్తుంది. తద్వారా శరీరం తేలిక అవుతుంది.

స్ట్రాబెర్రీలు :
వీటిని తినడం వల్ల కూడా శరీరంలోని వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. ఇక బరువు తగ్గడం కూడా తేలికే..


గోరువెచ్చని నీరు :
ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీటిని తాగినా మంచి ఉపశమనం లభిస్తుంది. ఫలితంగా మల విసర్జన సాఫీగా జరుగుతుంది.


ఇక చూశారు కదా! ఎవరైతే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారో వారు తప్పకుండా, ఇలాంటి పండ్లను చేర్చుకోవాలి. అప్పుడే శరీరంలోని వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్ళిపోయి ,శరీరం తేలికగా ఉంటుంది ఫలితంగా బరువు కూడా తగ్గుతారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో 24 గంటల్లో 20వేలకు పైగా కేసులు..!!

కరోనాకి 5జీ టెస్టింగ్ కి సంబంధం ఉందా..?

టాలీవుడ్ బెస్ట్ కాంబినేషన్ : నాగార్జున, సౌందర్యల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఏంటో తెలుసా?

హీరోగా ఎదుగుతున్నాడు అనే మన హీరో లు సుమన్ ని జైలుకి పంపారా.. క్లారిటీ..!!

వారం నుండి 180 జిల్లాల్లో నో కరోనా..!!

తమిళనాడు కొత్త సీఎం మనోడే!

క్రాక్ ఎఫెక్ట్ ఖిలాడి మీద పడింది.. భారీ డీల్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>