MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-best-combinations229845c5-8112-4ad6-80c3-ebf650d59f44-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-best-combinations229845c5-8112-4ad6-80c3-ebf650d59f44-415x250-IndiaHerald.jpgనాగార్జున, టబు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా చూడముచ్చటగా ఉంటుంది. వీరిద్దరి కాంబినేషన్ వెండితెరపై మ్యాజిక్ సృష్టిస్తుందని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.1995లో అనగా 26 ఏళ్ల క్రితం వీళ్ళిద్దరూ కలిసి తొలిసారిగా నటించారు. శివనాగేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన "సిసింద్రీ" మూవీలోని ఆటాడుకుందాం రా పాటలో నాగార్జున, టబు కలిసి చిందేశారు. ఆకర్షణీయమైన ముఖ సౌందర్యం తో నాజూకైన సొగసుతో బీభత్సంగా అందాలు ఆరబోస్తూ నాగార్జునతో సెగలు పుట్టించే రొమాన్స్ చేసి అప్పటి ప్రేక్షకులను టబు బాగా అలరించారు. సరిగ్గా ఒక సంవత్సరం తరtollywood-best-combinations;nagarjuna akkineni;soundarya;haricharan;krishna;sirivennela;vamsi;audi;tollywood;cinema;industry;blockbuster hit;comedy;romantic;krishna vamsi;research and analysis wing;sisindri;sirivennela sitaramasastriకెమిస్ట్రీకి కేరాఫ్ అడ్రస్ నాగ్-టబు..!కెమిస్ట్రీకి కేరాఫ్ అడ్రస్ నాగ్-టబు..!tollywood-best-combinations;nagarjuna akkineni;soundarya;haricharan;krishna;sirivennela;vamsi;audi;tollywood;cinema;industry;blockbuster hit;comedy;romantic;krishna vamsi;research and analysis wing;sisindri;sirivennela sitaramasastriSat, 08 May 2021 15:00:00 GMTనాగార్జున, టబు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా చూడముచ్చటగా ఉంటుంది. వీరిద్దరి కాంబినేషన్ వెండితెరపై మ్యాజిక్ సృష్టిస్తుందని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.1995లో అనగా 26 ఏళ్ల క్రితం వీళ్ళిద్దరూ కలిసి తొలిసారిగా నటించారు. శివనాగేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన "సిసింద్రీ" మూవీలోని ఆటాడుకుందాం రా పాటలో నాగార్జున, టబు కలిసి చిందేశారు. ఆకర్షణీయమైన ముఖ సౌందర్యం తో నాజూకైన సొగసుతో బీభత్సంగా అందాలు ఆరబోస్తూ నాగార్జునతో సెగలు పుట్టించే రొమాన్స్ చేసి అప్పటి ప్రేక్షకులను టబు బాగా అలరించారు.



సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత అనగా 1996లో వీళ్లిద్దరి కాంబోలో "నిన్నే పెళ్ళాడతా" సినిమా విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 39 కేంద్రాల్లో 100 రోజులకు పైగా నడిచింది. నాలుగు సెంటర్లలో 175 రోజులు పాటు ఆడింది. పాతిక సంవత్సరాల క్రితమే ఈ సినిమా 12 కోట్ల 30 లక్షల రూపాయలు వసూలు చేసి టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో అత్యద్భుతంగా నటించినందుకు గాను టబు కి 1997లో ఉత్తమ నటీమణిగా ఫిలింఫేర్ అవార్డు కూడా లభించింది.



నిన్నే పెళ్ళాడతా సినిమా ఆ స్థాయిలో హిట్ కావడానికి ముఖ్యకారణం టబు అని చెప్పుకోవచ్చు. టబు పాత్రకి ఎస్.పి.శైలజ డబ్బింగ్ చెప్పారు. ఆమె చక్కనైన నటన, శైలజా తీయటి గాత్రం సినిమాకి ఆయువుపట్టుగా నిలిచాయి. సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన ఎటో వెళ్ళిపోయింది మనసు, గ్రీకు వీరుడు, కన్నుల్లో నీ రూపమే పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్ అయ్యాయి. ఈ పాటల్లో నాగార్జున, టబు మధ్య చోటు చేసుకున్న కెమిస్ట్రీ మనసులను నేరుగా తాకుతుందంటే అతిశయోక్తి కాదు.



1998లో రొమాంటిక్ కామెడీ డ్రామా గా వచ్చిన "ఆవిడ మా ఆవిడే" చిత్రం ఎవరూ ఊహించని రీతిలో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి చిత్ర దర్శకనిర్మాతలతో పాటు అందులో హీరోగా నటించిన నాగార్జున ని సైతం ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాలో హరిచరణ్, చిత్ర కలిసి పాడిన "ఓం నమామి అందమా" పాట సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ మెలోడియస్ సాంగ్ లో నాగార్జున, టబు కెమిస్ట్రీ ప్రేక్షకుల హృదయాలను పులకరింప చేసింది. సినిమా మొత్తంలో నాగార్జున, టబు రొమాంటిక్ సన్నివేశాలు హైలెట్ గా నిలిచాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జ‌గన్ మెడ‌లో వైసీపీ కండువా... లోప‌ల బ‌నియ‌న్ కాషాయ‌మే ?

లోకేష్ టోన్ మారిందా.. జ‌గ‌న్ విష‌యంలో యూట‌ర్న్‌..!

ఎడిటోరియల్: మమత యుపిఏ నాయకత్వానికి తగిన వ్యక్తి కాదు

మ‌రో మంత్రిపై భూదందా ఆరోప‌ణ‌లు.. జ‌ప్తులో ఉన్న భూమి స్వాహా?

బిల్ గేట్స్ విడాకుల వ్యవహారంలో మూడో వ్యక్తి?

కడప పేలుడు : మృతులు ఈ ప్రాంతానికి చెందిన వారే..!

ఇదంతా వాళ్ల వల్లే..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>