EditorialParisa Rama Krishna Raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/upa-convener-post-to-mamata1bfbb580-1b4b-4864-b74b-afc72763c1e8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/upa-convener-post-to-mamata1bfbb580-1b4b-4864-b74b-afc72763c1e8-415x250-IndiaHerald.jpg “నే చెప్పిందే వేదం నా మాటే శాసనం” అనే ఆమె స్వభావం తెలిసిన వారెవరు – అందరిని, అన్నీ పార్టీలను ఒప్పించేంతటి సమన్వయం, సంయమనం ఆమె వద్ద ఉన్నాయని అనుకోరు. "క్షణక్షణముల్ జవరాండ్ర చిత్తముల్" అన్నట్లుండే ఈ జవరాలి చంచలమైన రాజకీయ నిర్ణయాలు, ఆలోచనా రహిత విమర్శలతో అతి దూకుడుగా వ్యవహరించే ఆమెను దేశవ్యాప్తంగా బిజేపి లాంటి బలమైన నాయకత్వానికి ప్రత్యామ్నాయం కావాలనుకుంటున్న కూటమికి ఆమె ఎంతమాత్రం సరిపడదని బల్లగుద్ది చెపుతున్నారు. upa convener post to mamata;auto;view;modi;soniagandhi;mamata benerjee;benarjee;bhavana;kishore;nandu;poorna;prasanth;soumya;sowmya;delhi;bharatiya janata party;telangana rashtra samithi trs;india;naveen patnaik;odisha;west bengal - kolkata;narendra modi;mayawati;congress;chief minister;history;uttar pradesh;aqua;tdp;central government;ycp;mamta mohandas;prashant kishor;dookudu;party;tangirala sowmya;narendraఎడిటోరియల్: మమత యుపిఏ నాయకత్వానికి తగిన వ్యక్తి కాదుఎడిటోరియల్: మమత యుపిఏ నాయకత్వానికి తగిన వ్యక్తి కాదుupa convener post to mamata;auto;view;modi;soniagandhi;mamata benerjee;benarjee;bhavana;kishore;nandu;poorna;prasanth;soumya;sowmya;delhi;bharatiya janata party;telangana rashtra samithi trs;india;naveen patnaik;odisha;west bengal - kolkata;narendra modi;mayawati;congress;chief minister;history;uttar pradesh;aqua;tdp;central government;ycp;mamta mohandas;prashant kishor;dookudu;party;tangirala sowmya;narendraSat, 08 May 2021 14:30:00 GMT2022 మే నెల వరకు దేశంలొ ఏ రాష్ట్రంలొ గాని కేంద్ర పాలిత ప్రాంతాల్లోగాని ఎన్నికలు జరపాల్సిన గడువు తేదీలు లేవు. అంటే ఎక్కడా ఎన్నికలుండవు కాబట్టి అంతవరకైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలకు విరామం ఇచ్చి, స్వంత లాభం కొంత మానుకొని దేశ వ్యాప్తంగా విలయం సృష్టిస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రించటానికి, తుదముట్టించటానికి అన్నీ దేశ వ్యాప్త రాజకీయ పార్టీలు నాయకులు ఐఖ్యంగా పనిచేస్తే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. ప్రజా సంక్షేమార్ధం ఈ అవసరం చాలా ముఖ్యం.



ఈ తరుణంలో రండి మనమంతా కలిసి “ప్రాంతీయ పార్టీల కూటమి” నిర్మిద్ధాం అంటూ విజయ గర్వంతో ఓలలాడుతున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఇప్పటికే పిలుపు నిచ్చారు. ఈ సంధర్భంగా గొప్ప విజయం సాధించిన ఆమెకు సాంప్రదాయంగా అభినందనలు తెలిపిన నాయకులు ఈ విషయంలో మాత్రం నిశ్శబ్ధంగా ఉన్నారు.



భారత్ కు స్వాతంత్రం వచ్చాక భారత జాతీయ కాంగ్రెస్ ను ఎదుర్కోవటానికి పలుమార్లు భిన్న విభిన్న పేర్లతో ఐఖ్య సంఘటనలు ఏర్పడ్డాయి. కొన్ని ఘోర వైఫల్యం సాధించినా, మరి కొన్ని మఖలో పుట్టి పుబ్బలో అంతరించినట్లు చరిత్ర చెపుతుంది. నాటి మహమహులు జయ ప్రకాష్ నారాయన్, మొరార్జి దేశాయ్, వాజపెయి అద్వాని లాంటి మహమహులు నాయకత్వం వహించి నిర్మించిన ఐఖ్య కూటములు తమ పాలన కాలం పూర్తి కాకుండానే కొండెక్కాయి. అయితె ఒక్కసారి మాత్రం వాజపాయి ఐదేళ్ళ పాలనలో విజయం సాధించిన చరిత్ర ఉంది. ముఖ్యంగా ఆయన మితవాది, సౌమ్యుడు, సర్దుకుపోయే తత్వంతో పాటు కావలసినంత రాజనీతిజ్ఞత, విజ్ఞత ఉన్నవారు కాబట్టి అది సాధ్యమైంది.



పలుమార్లు మహ ఘట్బందన్ లాంటి పేర్లతో జట్టు కట్టిన ఈ తామరతంపర పార్టీలు కెంద్ర స్థాయి పార్టీలైన కాంగ్రెస్, బిజేపిల ముందు నీరుకారి పోక తప్పలేదు. జాతీయ పార్టీలకు కొంత జాతీయ వాదం ఉండి దేశ వ్యాప్త ప్రయోజనాలు ప్రముఖంగా ఉంటాయి. ప్రస్తుతం విజయ గర్వంతో మాట్లాడే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కోరుకుంటున్నట్లు జరిగే పరిస్థితులు దేశంలో లేవని, వాస్తవాలు ఎలా ఉంటాయో ప్రతి రాజకీయ పార్టీకి వాటి నాయకత్వాలకు తెలుసు. 



ప్రాంతీయ పార్టీలన్ని కలిసి, “ ప్రాంతీయ పార్టీల జాతీయ కూటమి” ని నిర్మించటానికి ప్రధానంగా కావలసింది వాటి నాయకత్వాల సంపూర్ణ స్వార్ధ పరిత్యాగం.  అది ఏ ఒక్కరికి కూడా సాధ్యపడే విషయం కాదు. రాజకీయ నాయకుడు మరియు స్వార్ధం సయామి కవలలు. అంటే ఒకరిని ఒకరు విడిచి బ్రతకలేరన్న మాట.



అసలు వీటి పుట్టుకకు పునాదిగా ఉండేది ప్రాంతీయ రాజకీయ స్వార్ధ ప్రయోజనాలు మాత్రమె. స్వాభావికంగా వీటి మధ్య జాతి వైరం ఉంటుంది. ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య నీటి వనరుల పంపకం నుండి సరిహద్ధు సమస్యలతో పాటు వ్యాపార, రాజకీయ ప్రయోజనాల సాధన కోసం చేసే దాయాదుల కొట్లాటల వరకూ అనేక రకాలైన ఆటంకాలు అడ్డంకులు, అవరోధాల అడ్డుగోడలు  ఉంటాయి.



ప్రస్తుత కెంద్ర ప్రభుత్వం లోని జాతీయ ప్రభుత్వాన్ని కూలదోయాలన్న తపన తప్ప ఒకే మాట ఒకే బాటగా కలిసి నడవ వలసిన అవసరం ఒక్కటి కూడా వీరికి కనపడదు. ఐఖ్యతకు అవసరమైన పలు  కారణాలున్నా “నాయకత్వ కోసం పోరు” అనే సహజ గుణం వీటి పుట్టి ముంచటం అనుభవైకవేధ్యమే. ప్రత్యేకించి తమకొచ్చే ప్రయోజనా లేమీ ఉండవు. తమ తమ రాష్ట్రాల్లో నిలదొక్కుకుంటే అదే చాలు అనుకునే నాయకులే ఎక్కువ.



అందులోనూ ఒడిశా ముఖ్యమంత్రి బిజూ జనతా దళ్ (బీజేడీ)  నవీన్ పట్నాయక్ వంటి కొందరు ఉన్నారో లేదో కాని ఒకవేళ ఉంటే వారు తప్ప మిగిలినోళ్ళు  తమ కింద నలుపెరుగని గురివిందలే. వారి రాజకీయ జీవితాలు గాలిలో దీపాలే ఎందుకంటే వారిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎప్పుడు విరుచుకు పడతాయో ఆ భగవంతునికే తెలియదు. మరో మూడేళ్ల పాటు బిజేపి పదవీ కాలం నిగిలి ఉంది అందుకే ప్రదానిగా నరేంద్ర మోడీ అధికారానికి ఎదురులేని నేపథ్యంలో బిజేపితో పెట్టుకొని ఆ కొరివితో తల గొక్కునేందుకు ఎవరూ సిద్దంగా ఉండరు అది లొకం రీతి.  



అష్టకష్టాలు పడి రాష్ట్రాన్ని రావణకాష్టం చేసిన అధికార టిఎంసి దాని వైరిపక్షం బిజేపిల కొట్లాటలో మూడవసారి చావుతప్పి కన్నులొట్ట పోగొట్టుకున్న బెంగాల్ ఆడపులిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ పార్టి ఎదురు లేని విజయం సాధించిన విజయ గర్వం ఒంటికే కాదు తల కెక్కిన ఉత్సాహ తిమ్మిరితో వ్యాఖ్యలు చేస్తున్నారు. అవి కార్యరూపం దాల్చటం అసంభవమని చరిత్ర చెపుతుంది. 



ప్రాంతీయ పార్టీల సమాహారం దానిలో కేంద్ర స్థాయి జాతీయ పార్టి పూలల్లో దారంలా ఉండక పోతే అవి కలసి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవు. విడి విడిగా వాటికి ప్రత్యేక ప్రాంతీయ ప్రాదేశిక అవసరాలు నాయకుల వ్యక్తిగత స్వార్ధాలు ఉంటాయి. దేశంలో ఇంత వరకూ కేంద్ర ప్రభుత్వ ఏర్పాటు కాంగ్రెస్ బిజేపియేతర జాతీయపార్టీల ప్రమేయం లేకుండా సాధ్యం కాలేదు. దేశ వ్యాప్త ఉనికి ఉన్న ఒక జాతీయపార్టీ చుట్టూ ప్రాంతీయ పార్టీలు పూలలా అల్లుకున్నప్పుడే మూడో ప్రత్యామ్నాయం థర్డ్ ఫ్రంట్ ఏర్పడుతుంది. దీనికి నాయకత్వం జాతీయ పార్టీదే అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టి నాయకత్వంలో యుపిఏ ఉంది. దానికి సోనియా గాంధి కన్వీనర్ గా నాయకత్వం వహిస్తున్నారు.



ఆయా రాష్ట్రాల మధ్య, నాయకుల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ జాతీయ పార్టీ సమన్వయ కర్తగా అంటే కన్వీనర్ గా ఉంటూ ‘కనీస ఉమ్మడి కార్యక్రమం’ ప్రాతిపదికగా కేంద్రంలో నాయకత్వం వహిస్తుంది. అందువల్ల రాజకీయంగా ప్రాంతీయ పార్టీల నాయకులు తమ రాష్ట్రాల్లో ప్రజలకు వివరిస్తూ రాష్ట్ర పాలనను జాతీయ పాలనతో సమన్వయం చేస్తారు.



అయితే తన బెంగాల్ రాష్ట్రంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలికానికి కూడా కనిపించకుండా పోవటంతో మమత వాటి ప్రస్థావన లేని “ప్రాంతీయ పార్టీల కేంద్ర స్థాయి కూటమి” నిర్మాణం కోసం ఆతృత పడుతుంది. మమత వ్యూహం వేరే ఉంది వాటిని కూడా కలుపుకుంటే తన రాష్ట్రంలో వాటికి సీట్లు ఇవ్వాల్సి వస్తుంది.



కీలకమైన విషయం ఏమంటే: తొలి నుంచి ఈ అల్పసంఖ్యాకులు, వెనుకబడిన కులాలు, ఆదివాసీ లు మరియు దళితులు వీరంతా కాంగ్రెస్ వామపక్షాల ఓటు బాంకులోని వారే. అవే కాలక్రమం లో రాజకీయ సంకరంతో మమత టిఎంసికి బదిలీ అయ్యాయి. అదే ఆమె మర్చిపొయ్యారు  అందుకే వారితో కలయిక ఆమెకు ఎలాంటి ప్రయోజనం కలిగించదని ప్రస్తుతం నమ్ముతున్నారు. అందుకే ప్రాంతీయ పార్టీలు మాత్రమే కూటమిగా ఏర్పడాలనేది ఆమె అభిమతం దానికి సమన్వయకర్తగా తానుండాలనేది ఆమె ఆకాంక్ష. ఇందులో దేశ విశాల ప్రయోజనాల కంటే మమత స్వార్ధ ప్రయోజనాలే ముఖ్యమనేది మనకు తేలికగానే అర్ధం అవుతుంది. కాని తల్లివేరు లాంటి జాతికి అనాది కాలం నుండి పరిచయమున్న పార్టీ సహకారం లేకుండానే దేశ రాజకీయ చక్రం తిప్పాలనుకోవటం మమతకు దురాశ మాత్రమే.  



బిజేపి సమీప భవిష్యత్తులో తన రాజకీయాలకు గండం కాగలదని ఊహించిన మమత ఇప్పుడు తానే ప్రాంతీయ పార్టీల దేశస్థాయి సమాఖ్యకు నాయకత్వం వహించటానికి బిజేపిని ధారుణంగా ఇరికించటానికి వ్యూహాలు రచిస్తుంది. ఇదంతా ఊహించిన ప్రాంతీయ పార్టీలు - ఎన్డీఏలో బీజేపీని, యూపీఏలో కాంగ్రెసును - తమను నడిపించే సమన్వయ కర్తలుగా గుర్తించాయి. దీనికి  ప్రాతిపదిక  అతి పురాతన కాలం నుండి అవి నిర్మించుకున్న దేశవ్యాప్త విస్తరణే .



ఇప్పుడు మమత అంటున్నట్లు “ప్రాంతీయ పార్టీల కూటమి మాత్రమే నిర్మిస్తే కొండవీటి చాంతాడంత సంఖ్యలో ఉన్న ఈ ప్రాంతీయ పార్టీల నాయకుల్లో ఎవరికి నాయకత్వం కట్టబెట్టాలనే అత్యంత క్లిష్టమైన సమస్య” ఎదురౌతుంది. దాంతోనే పలు పరిష్కారం దొరకని కొత్త సమస్యలు వస్తాయని చరిత్ర తెలిసిన భారతీయులకు బాగా తెలుసు.



అనంత అచంచలమైన దీక్షాదక్షత సమయస్పూర్తికల నాయకత్వం కావలసిన ఇచ్చోట, ఆదిపత్య ధోరణి అహరాహరం అహకారం ఆహంతో చిందులేసే చంచల స్వభావి సమన్వయం, సమ్యమనం అంటే ఏ మాత్రం తెలియని వీధిరౌడీ మనస్తత్వం ఉన్న రాజకీయనేత మమత నెగ్గుకు రాగలదా? కూటమి సభ్యులు ఆమెను దీర్ఘకాలం భరించగలరా?  అనేది సమాధానం లేని, కాలం మాత్రమే సమాధానం చెప్పగల ప్రశ్నే.



“నే చెప్పిందే వేదం నా మాటే శాసనం” అనే ఆమె స్వభావం తెలిసిన వారెవరు – అందరిని, అన్నీ పార్టీలను ఒప్పించేంతటి సమన్వయం, సంయమనం ఆమె వద్ద ఉన్నాయని అనుకోరు. "క్షణక్షణముల్ జవరాండ్ర చిత్తముల్" అన్నట్లుండే ఈ జవరాలి చంచలమైన రాజకీయ నిర్ణయాలు, ఆలోచనా రహిత విమర్శలతో అతి దూకుడుగా వ్యవహరించే ఆమెను దేశవ్యాప్తంగా బిజేపి లాంటి బలమైన నాయకత్వానికి ప్రత్యామ్నాయం కావాలనుకుంటున్న కూటమికి ఆమె ఎంతమాత్రం సరిపడదని బల్లగుద్ది చెపుతున్నారు.



ఇప్పటికే ద్రవిడ పార్టీలైన డీఎంకే, ఏఐడీఎంకేలు చెరో ప్రత్యర్ధి కూటముల్లోను - ఆర్జెడీ, ఎన్సీపీలు యుపిఏ కూటమిలోను కొనసాగుతున్నాయి. బీజేడీ, టీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ వంటి విడి పార్టీలు వాటి వీలు వెంట అవసరాన్ని అవకాశాన్ని బట్టి రాజకీయంగా ప్రవర్తిస్తుంటాయి. ఇవెవి మమతతో ముందుకు సాగేందుకు సానుకూలం ఉండే అవకాశం లేవు. 

 


ప్రస్తుతం మాయావతి (బీఎస్పీ), అఖిలేష్ (ఎస్పీ) లు ఉత్తరప్రదేశ్ లో తమ పునరధికార సాధనమీద దృష్టి పెట్టాలని ఆలోచిస్తున్నాయి. అవి జాతీయస్థాయి ఆలోచనలతో, ఆశలతో కొత్త శిరోవేదనలు తెచ్చుకునేందుకు సిద్దంగా లేరు. వీటిని మించి మమత ప్రవర్తన వ్యవహరించే తీరు సమకాలీన రాజకీయాల్లో జాతీయ రాజకీయ ఐక్యతకు ప్రదాన అడ్డంకి, అవరోధం అని విశ్లేషకులు చెబుతున్నారు. నిజానికిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ తానోడి పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని గట్టి పోటీని తట్టుకొని గెలిపించారు. వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అభిప్రాయం ప్రకారం  ఈ విజయానికి మమత సర్శక్తులు సమీకరించవలసి వచ్చింది. దానికి తోడు బీజేపీ సంస్థాగత బలహీనతలు టిఎంసీకి కలిసొచ్చాయి. 



బీజేపీ బెంగాల్ రాష్ట్ర పార్టీ నాయకుల్లో విభేదాలు,  

మమతకు పోటీగా సరైన ముఖ్యమంత్రి అభ్యర్థిని చూపలేక పోవడం, 

పశ్చిమ బెంగాల్ పై బయటివారి (ఢిల్లీ నుంచి) దాడి జరుగుతోందన్న భావన 

మమత కాలికి గాయం తద్వారా చక్రాల కుర్చిలో ప్రచారం సెంటిమెంటును రగిలింపజేసింది. 

ఎన్నికల కమిషన్ అతి జాగ్రత్తలతో 8 విడతల్లో ఎన్నికలు జరపడం.  


కరోన కట్టడిలో వైఫల్యం వలన బిజేపి ప్రభ తగ్గటం 

పెరిగిపోతున్న పెట్రోలియం ఉత్పత్తుల ధరలు,  

కేంద్ర బలగాల అత్యుత్సాహం, 

మైనారిటీల సంఘటిత ఓటు బ్యాంకు కాంగ్రెస్ కమ్యూనిష్టుల నుంచి బదిలీ కావటం

వామపక్షాలు, కాంగ్రెసు నామమాత్రంగానే పశ్చిమబెంగాల్ లో ప్రచారం చేయటం 

 


ఇక భవిష్యత్తులో మోడీ-షా ద్వయం తమ ప్రస్తుత బలహీనతలను బలాలుగా మార్చుకునే అవకాశం ఇక వదులుకోరు. ముఖ్యంగా రానున్న ఆరు నెలల్లో మమత బెనర్జి శాసనసభకు ఎన్నిక కావలసి ఉంది. అక్కడే బిజేపి సమర్ధవంతగా కట్టడి చేయటానికి ప్రయత్నించవచ్చు. అందువలన మమతకు బిజేపి రాష్ట్రంలో బలమైన ప్రత్యర్ధిగా మారవచ్చు.  అయినా మొన్నటి ఎన్నికల్లో బిజేపి విజయం సామాన్యమైనదేమీ కాదు ఐదేళ్ళలో 3 నుంచి 77 శాసన సభ స్థానాలు కైవసం చేసుకోవటం అంటే ఒక అద్భుతమే. కాంగ్రెస్ వామపక్షాలు పూర్తిగా క్లీన్-బౌల్డ్ అయిపోవటంతో రానున్న కాలం మమత - మోడి ద్వంద రాజకీయ సమరం జరగ నుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అభివర్ణించారు. 



అందుల్ల ఆమె సొంతగడ్డపై ఏమాత్రం అలసత్వం వహించి దృష్టి మళ్ళించినా పునాదుల్లోనే సమాధి కావచ్చు కనీసం క్లిష్టమైన సమస్యలు తలెత్తవచ్చు. 

ఆమెకు ప్రస్తుత పరిస్థితుల్లో బయటపడని అంతర్లీనంగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేఖత క్రమంగా బయటపడవచ్చు. ఆమె జగడాలమారితనంతో కేంద్రం నుండి రావలసిన రాష్ట్ర ప్రయోజనాలు సునాయాసంగా అందవు. రాష్ట్ర సమస్యలను తీర్చి రాజకీయంగా పటిష్ఠం చేసుకోలేకపోతే నేలవిడిచి సాము చేసినట్లే. 



అన్నింటిని మించి తమ రాజకీయ అవసరాలు, తమపై కేసుల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ముందు సాగిలపడే ప్రాంతీయ పార్టీ నేతలకు తమ వారసత్వాలను కాపాడుకోవటం ముఖ్యం. జాతీయ ప్రయోజనాలు కాదు. అందువల్ల మమత బెనర్జి పిలుపునందుకుని స్పందించే వారెవరూ కనుచూపు మేరలో కనిపించరు


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

లోకేష్ టోన్ మారిందా.. జ‌గ‌న్ విష‌యంలో యూట‌ర్న్‌..!

మ‌రో మంత్రిపై భూదందా ఆరోప‌ణ‌లు.. జ‌ప్తులో ఉన్న భూమి స్వాహా?

బిల్ గేట్స్ విడాకుల వ్యవహారంలో మూడో వ్యక్తి?

కడప పేలుడు : మృతులు ఈ ప్రాంతానికి చెందిన వారే..!

ఇదంతా వాళ్ల వల్లే..!!

తీవ్ర విషాదం : ముక్కలైన శరీరాలు.. చిదిలమైన బతుకులు !

శరీర భాగాలు తునాతునకలు..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Parisa Rama Krishna Rao]]>