PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona73bdd3c6-61ad-4668-be37-79bf870e4753-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona73bdd3c6-61ad-4668-be37-79bf870e4753-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. ఈ మహమ్మారి కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోజురోజుకు ఈ వైరస్ బారినపడేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. యావత్​ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా గురించి రోజుకో విషయం బయటకు వస్తోంది. తాజాగా.. కొవిడ్​ గురించి నిపుణులు చెబుతున్నది మరింత ఆందోళన కలిగిస్తోంది. Corona;coronavirusకరోనాతో పొంచివున్న పెను ప్రమాదం..!కరోనాతో పొంచివున్న పెను ప్రమాదం..!Corona;coronavirusSat, 08 May 2021 12:00:00 GMTకరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. ఈ మహమ్మారి కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోజురోజుకు ఈ వైరస్ బారినపడేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా గురించి రోజుకో విషయం బయటకు వస్తోంది. తాజాగా.. కొవిడ్ గురించి నిపుణులు చెబుతున్నది మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇన్ని రోజులు.. కరోనా అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి అని అనుకున్నారు. కానీ దాని వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం కూడా ఉందని, ఇందుకు సంబంధించి ఆధారాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. కొన్ని సందర్భాల్లో.. అవయవాలను తీసేసే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.

అయితే కరోనా వైరస్ కేవలం ఊపిరితిత్తుల వ్యాధి మాత్రమే కాదని, కరోనా కారణంగా రక్తం గడ్డ కడుతోందని, అవయవాలను కాపాడేందుకు ఒక్కోసారి గడ్డలను తొలగించాల్సి వస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకూ జరిగిన అధ్యయనాల ప్రకారం.. ఆసుపత్రుల్లో చేరుతున్న కరోనా బాధితుల్లో 14-28% మంది కాళ్లలోని నాళాల్లో రక్తం గడ్డకడుతోంది. ఇక 2-5% మందికి హృదయ ధమనుల్లో రక్తం గడ్డల్లా పేరుకుపోతోంది. రక్తం గడ్డకట్టడం వల్ల రక్త ప్రసరణలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. 2-5% మంది కరోనా బాధితుల్లో గుండెపోటు, పక్షవాతం, అవయవ నష్టం సంభవిస్తోంది.

ఇక తమ ఆస్పత్రిలో వారానికి కనీసం 5-6 కేసుల్లో రక్తం తీవ్రస్థాయిలో గడ్డకట్టే పరిస్థితి కనిపిస్తోందని,  కొద్దిరోజులుగా అలాంటి బాధితుల సంఖ్య పెరుగుతోందని ఢిల్లీలోని సర్‌ గంగారామ్‌ ఆసుపత్రి సర్జన్‌ డా.అంబరిష్‌ సాత్విక్‌ చెప్పారు. టైప్‌-2 మధుమేహంతో ఇబ్బందులు పడుతున్న కరోనా బాధితుల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటున్నట్టు ఢిల్లీలోని ఆకాశ్‌ హెల్త్‌ కేర్‌ హృద్రోగ నిపుణుడు అమరీశ్‌ కుమార్‌ చెప్పారు. కరోనా ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ఊపిరితిత్తులకు ఎంత ఇబ్బంది కలుగుతోందో, రక్తనాళాలకు కూడా అంతే హాని జరుగుతోంది అని సాత్విక్‌ చెప్పారు. కరోనాకు, రక్తం గడ్డకట్టడానికి మధ్య దగ్గరి సంబంధం ఉన్నట్టు ప్రముఖ వైద్య జర్నల్‌ 'ద లాన్సెట్‌' ఇప్పటికే పలు అధ్యయనాలను విశ్లేషించింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాల‌య్య‌- విజ‌యశాంతి కాంబో 17 సినిమాలు చేస్తే ఒక్క‌టే ఫ్లాప్!

కడప జిల్లాలో ఘోర ప్రమాదం..!!

యద్దనపూడి సులోచనారాణి ప్రభావం నుండి బయటపడలేకపోతున్న త్రివిక్రమ్ !

చరిత్ర: గతంలో సీఎంలను ఎదిరించిన మంత్రులెవరు? ఏమయ్యారు?

వ్యాక్సినేషన్ పై మోదీ చేతులెత్తేసినట్టేనా..?

క్యాన్సర్‌ చికిత్సలో సంచలనం.. ముంబై సంస్థ అద్భుత విజయం

బిగ్ బాస్ సీజన్ 5కి కొత్త కన్ఫ్యూజన్లు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>