HealthMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/andhrapradesh402cd036-6a71-4201-a9de-a57f266c5688-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/andhrapradesh402cd036-6a71-4201-a9de-a57f266c5688-415x250-IndiaHerald.jpgప్రస్తుతం కరోనా కేసులు వేగంగా పెరుగుతుండటంతో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. దాంతో సమయానికి ఆక్సిజన్ అందక ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అయితే తాజాగా ఏపీ పోలీసులు విజయవాడ జనరల్ ఆస్పత్రికి సరైన సమయంలో ఆక్సిజన్ సరఫరా అయ్యేలా చేసి 693 మంది కరోనా పేషంట్ ల ప్రాణాలను కాపాడారు. వివరాల్లోకి వెళితే..జీజీహెచ్ ఆస్పత్రికి ఒడిస్సా లోని జిందాల్ స్టీల్ ప్లాంట్ నుండి 18 టన్నుల ఆక్సిజన్ రావాల్సి ఉంది. కాగా ఆక్సిజన్ ట్రాంకర్ లు భయలుదేరిన తరువాత గురువారం అద్దరాత్రి దాటాక ట్రాకింగ్ వ్యవస్థ తో సంబంధాలు తెగిపోయాయandhrapradesh;gautham new;gautham;godavari river;krishna river;vijayawada;andhra pradesh;east;east godavari;huzur nagar;police;driver;traffic police;oxygen;house693 మందికి ఊపిరి పోసిన ఏపీ పోలీస్.. !693 మందికి ఊపిరి పోసిన ఏపీ పోలీస్.. !andhrapradesh;gautham new;gautham;godavari river;krishna river;vijayawada;andhra pradesh;east;east godavari;huzur nagar;police;driver;traffic police;oxygen;houseSat, 08 May 2021 10:13:06 GMTప్రస్తుతం కరోనా కేసులు వేగంగా పెరుగుతుండటంతో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. దాంతో సమయానికి ఆక్సిజన్ అందక ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అయితే తాజాగా ఏపీ పోలీసులు విజయవాడ జనరల్ ఆస్పత్రికి సరైన సమయంలో ఆక్సిజన్ సరఫరా అయ్యేలా చేసి 693 మంది కరోనా పేషంట్ ల ప్రాణాలను కాపాడారు. వివరాల్లోకి వెళితే..జీజీహెచ్ ఆస్పత్రికి ఒడిస్సా లోని జిందాల్ స్టీల్ ప్లాంట్ నుండి 18 టన్నుల ఆక్సిజన్ రావాల్సి ఉంది. కాగా ఆక్సిజన్ ట్రాంకర్ లు భయలుదేరిన తరువాత గురువారం అద్దరాత్రి దాటాక ట్రాకింగ్ వ్యవస్థ తో సంబంధాలు తెగిపోయాయి. సమయానికి ట్యాంకర్ రాకపోతే రోగుల ప్రాణాలకు ముప్పని వైద్యులు ఆందోళన చెందారు. దాంతో వెంటనే విజయవాడ నగర్ పోలీస్ కమీషనర్ బి. శ్రీనివాలుసులుకు సమాచారం అందించారు. స్పందించిన కమిషనర్ విజయవాడ నుండి ఒడిస్సా వరకు అన్ని జిల్లాల ఎస్పీలను అలర్ట్ చేశారు. 

ట్యాంకర్ ఎక్కడ ఉందో కనుక్కోవాలని ఆదేశించారు. దాంతో పోలీసులు తూర్పుగోదావరి జిల్లాలోని పత్తిపాడు వద్ద ఒక దాబాలో ట్యాంకర్ ఆగి ఉన్నట్టు గుర్తించారు. ట్యాంకర్ ఎందుకు ఆపాల్సివచ్చిందని డ్రైవర్ ను ప్రశ్నించారు. తాను భయలుదేరిన ప్రదేశం నుండి విజయవాడ 878 కిలోమీటర్లు ఉంటుందని అలసిపోవడంతో రెస్ట్ తీసుకుంటున్నానని చెప్పారు. దాంతో పోలీసులు ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా ట్యాంకర్ ను తీసుకువెళ్లాలని చెప్పారు. డ్రైవర్ తో పాటు హోమ్ గార్డ్ ను కూడా ట్యాంకర్ లో పంపించారు. అంతే కాకుండా ట్యాంకర్ ఆలస్యం అవ్వకుండా తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ప్రత్యేక బందోబస్తు నడుమ ట్యాంకర్ ను తలించారు. సకాలంలో ట్యాంకర్ ను తరలించిన పోలీసులకు డీజీపీ గౌతమ్ సవాంగ్ సెల్యూట్ కొట్టారు. ఏపీ పోలీసులు గ్రీన్ చానల్ ఏర్పాటు చేసి ట్యాంకర్ ను తరలించి ఎంతోమంది ప్రాణాలను కాపాడారని మెచ్చుకున్నారు. అంతే కాకుండా ప్రస్తుతం ఈ విషయం వైరల్ అవ్వడంతో సోషల్ మీడియాలోనూ పోలీసులు చేసిన పనికి ప్రశంసలు అందుతున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చరిత్ర: గతంలో సీఎంలను ఎదిరించిన మంత్రులెవరు? ఏమయ్యారు?

వ్యాక్సినేషన్ పై మోదీ చేతులెత్తేసినట్టేనా..?

క్యాన్సర్‌ చికిత్సలో సంచలనం.. ముంబై సంస్థ అద్భుత విజయం

బిగ్ బాస్ సీజన్ 5కి కొత్త కన్ఫ్యూజన్లు!

ఆ దేశంలో ఆగస్టు కల్లా కరోనా ఖతం ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఈటలను అన్నీ వైపులా బిగించేస్తున్న కేసీయార్

ఏంది జ‌గ‌న్ ఇది..భ‌య‌మా.. గౌర‌వ‌మా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>