MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjun-009386d6-cd13-4ba7-a448-24d8bbc08e40-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjun-009386d6-cd13-4ba7-a448-24d8bbc08e40-415x250-IndiaHerald.jpgఅల్లు అర్జున్ కు ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. దీనికితోడు అతడికి సోషల్ మీడియాలో కూడ చాల ఫాలోయింగ్ ఉంది. ‘అల వైకుంఠ పురములో’ మూవీ రికార్డులు ఇప్పటి వరకు బ్రేక్ కాలేదు. ప్రస్తుతం బన్నీ నటిస్తున్న ‘పుష్ప’ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.దేశంలోని ఐదు భాషలలో పాన్ ఇండియా మూవీగా విడుదల కాబోతున్న ఈమూవీతో బన్నీ ఐకాన్ స్టార్ గా మారబోతున్నాడు. గత సంవత్సరం కరోనా ఫస్ట్ వేవ్ వల్ల ఏర్పడిన పరిస్థితులలో ఈమూవీ షూటింగ్ ప్రారంభించడం చాల ఆలస్యం అయింది. అయితే అటు బన్నీ ఇటు సుకుమార్ పరుగులు alluarjun;;kumaar;allu arjun;sukumar;dussehra;india;godavari river;district;cinema;bahubali;august;vijayadashami;mosquitos;arjun 1;paruguఅల్లు అర్జున్ నిర్ణయంతో తీవ్ర అసంతృప్తిలో అభిమానులు !అల్లు అర్జున్ నిర్ణయంతో తీవ్ర అసంతృప్తిలో అభిమానులు !alluarjun;;kumaar;allu arjun;sukumar;dussehra;india;godavari river;district;cinema;bahubali;august;vijayadashami;mosquitos;arjun 1;paruguSat, 08 May 2021 10:00:00 GMTఅల్లు అర్జున్ కు ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. దీనికితోడు అతడికి సోషల్ మీడియాలో కూడ చాల ఫాలోయింగ్ ఉంది. ‘అల వైకుంఠ పురములో’ మూవీ రికార్డులు ఇప్పటి వరకు బ్రేక్ కాలేదు. ప్రస్తుతం బన్నీ నటిస్తున్న ‘పుష్ప’ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.


దేశంలోని ఐదు భాషలలో పాన్ ఇండియా మూవీగా విడుదల కాబోతున్న ఈమూవీతో బన్నీ ఐకాన్ స్టార్ గా మారబోతున్నాడు. గత సంవత్సరం కరోనా ఫస్ట్ వేవ్ వల్ల ఏర్పడిన పరిస్థితులలో ఈమూవీ షూటింగ్ ప్రారంభించడం చాల ఆలస్యం అయింది. అయితే అటు బన్నీ ఇటు సుకుమార్ పరుగులు తీస్తూ ఈమూవీని ఏదోవిధంగా పూర్తి చేసి ఆగష్టులో విడుదల చేయాలని చాల గట్టి ప్రయత్నాలే చేసారు.


తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం ప్రాంతంలో అక్కడ భయంకరంగా ఉండే దోమ కాటును కూడ తట్టుకుని బన్నీ ఈమూవీ షూటింగ్ లో అలసిపోకుండా తాను పరుగులు పెడుతూ యూనిట్ ను పరుగులు తీయించాడు. అయితే కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు అడ్డు తగలడంతో ఈమూవీ షూటింగ్ ఆగిపోయింది. దీనికితోడు బన్నీకి కరోనా సోకడంతో అతడు తిరిగి పూర్తిగా తేరుకుని ఈ మూవీ షూటింగ్ వైపు రావడానికి కనీసం మరొక రెండు నెలలు పడుతుంది అని అంటున్నారు.


ఇలాంటి పరిస్థితులలో దర్శకుడు సుకుమార్ కు ఈసినిమాకు సంబంధించి ఒక ఆలోచన వచ్చింది అన్నప్రచారం జరుగుతోంది. ఈ మూవీని రెండు పార్ట్ లుగా విభజించి ఒక పార్ట్ ను రాబోతున్న దసరా కు మరొక పార్ట్ ను వచ్చే ఏడాది సమ్మర్ కు విడుదల చేస్తే బాగుంటుంది అని సుకుమార్ కు వచ్చిన ఆలోచనలకు బన్నీ సపోర్ట్ కూడ ఉంది అని అంటున్నారు. అయితే ఇప్పుడు లీక్ అయిన ఈ వార్తల పట్ల బన్నీ అభిమానులు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ‘బాహుబలి’ రెండు పార్ట్ లుగా విడుదల అయినప్పటికీ ఆ సినిమాలోని కట్టప్ప సస్పెన్స్ తో ‘బాహుబలి’ సెకండ్ పార్ట్ కు క్రేజ్ ఏర్పడిందని అలాంటి సస్పెన్స్ లేకపోతే ‘పుష్ప’ తేలిపోతుందని బన్నీ అభిమానుల టెన్షన్..






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తమిళనాడులో లాక్డౌన్ అందుకేనా..?

వ్యాక్సినేషన్ పై మోదీ చేతులెత్తేసినట్టేనా..?

క్యాన్సర్‌ చికిత్సలో సంచలనం.. ముంబై సంస్థ అద్భుత విజయం

బిగ్ బాస్ సీజన్ 5కి కొత్త కన్ఫ్యూజన్లు!

ఆ దేశంలో ఆగస్టు కల్లా కరోనా ఖతం ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఈటలను అన్నీ వైపులా బిగించేస్తున్న కేసీయార్

ఏంది జ‌గ‌న్ ఇది..భ‌య‌మా.. గౌర‌వ‌మా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>