MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/keka-putisstunaa-rgv-dee-company7b6474d9-73c7-4fcf-a14e-45c01abb3bce-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/keka-putisstunaa-rgv-dee-company7b6474d9-73c7-4fcf-a14e-45c01abb3bce-415x250-IndiaHerald.jpgదావూద్‌ ఇబ్రహీం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ‘డి - కంపెనీ’ మూవీకి సంబంధించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 3 నెలల నుంచే ప్రొమోషన్స్ ప్రారంభించారు. ‘డి - కంపెనీ’ ఆఫీసియల్ తెలుగు టీజర్ అంటూ 3 నెలల కిందట విడుదల చేసిన వీడియోకి 6 లక్షలకు పైగా వ్యూస్ రాగా.. హిందీ టీజర్ కి 8 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ముంబయిలోని ఓ చిన్న గ్యాంగ్‌ లీడర్‌.. పెద్ద గ్యాంగ్‌స్టర్‌గా ఎలా ఎదిగాడు? భయంకరమైన ‘డి - కంపెనీ’ ఎలా స్థాపించారు? దాని వెనుక ఉన్న అసలు చరిత్ర ఏంటి? అతను స్థాపించిన డి-కంపెనీ నీడలో బతికిన ఇతర గ్యాంగ్‌స్టర్rgv;view;ram gopal varma;editor mohan;jeevitha rajaseskhar;naina;naina ganguly;ram pothineni;rani;history;hindi;currency;criminalకేక పుట్టిస్తున్న ఆర్జీవీ ‘డి - కంపెనీ’ ..!కేక పుట్టిస్తున్న ఆర్జీవీ ‘డి - కంపెనీ’ ..!rgv;view;ram gopal varma;editor mohan;jeevitha rajaseskhar;naina;naina ganguly;ram pothineni;rani;history;hindi;currency;criminalSat, 08 May 2021 11:00:00 GMTజీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ‘డి - కంపెనీ’ మూవీకి సంబంధించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 3 నెలల నుంచే ప్రొమోషన్స్ ప్రారంభించారు. ‘డి - కంపెనీ’ ఆఫీసియల్ తెలుగు టీజర్ అంటూ 3 నెలల కిందట విడుదల చేసిన వీడియోకి 6 లక్షలకు పైగా వ్యూస్ రాగా.. హిందీ టీజర్ కి 8 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ముంబయిలోని ఓ చిన్న గ్యాంగ్‌ లీడర్‌.. పెద్ద గ్యాంగ్‌స్టర్‌గా ఎలా ఎదిగాడు? భయంకరమైన ‘డి - కంపెనీ’ ఎలా స్థాపించారు? దాని వెనుక ఉన్న అసలు చరిత్ర ఏంటి? అతను స్థాపించిన డి-కంపెనీ నీడలో బతికిన ఇతర గ్యాంగ్‌స్టర్ల జీవితాలు ఎలా కొనసాగాయి? 1980 - 1982 మధ్య కాలంలో జరిగిన సంఘటనలు దావూద్‌ ఇబ్రహీం సోదరులు మర్డర్‌కు ఎలా దారితీసాయి? వంటి సన్నివేశాలతో టీజ్ చేసిన ఆర్జీవీ ఆ తర్వాత అప్సర రాణి నాట్యం చేసిన ఒక పాట విడుదల చేశారు.

కత్తులు మాత్రమే కాదు కళ్ళు కూడా ప్రాణాలను తీసేయగలవు అని ఒక ఐటమ్ సాంగ్ విడుదల చేసిన తర్వాత థీమ్ మ్యూజిక్ అని ఇంకొక సాంగ్ వీడియో చేశారు. ఈ ప్రమోషనల్ వీడియోస్ అన్నీ కూడా సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ క్రమంలోనే ‘డి - కంపెనీ’ మొదటి 4 నిమిషాలు అంటూ మరొక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో హింసే వారి కరెన్సీ వంటి స్టేట్మెంట్ తో మిట్టమధ్యాహ్నం నడిరోడ్డు మీద ఒక వ్యక్తి మరొక వ్యక్తి ని గన్ తో కాల్చే సన్నివేశం భీతి కలిగించేలా ఉంది. అలాగే ఈ వీడియోలో తుపాకీ గుండ్లుతో సృష్టించే మారణహోమం వంటి సన్నివేశాలు కూడా కనిపించాయి.

"ఇప్పుడు ముంబాయి చాలా ప్రశాంతంగా ఉంది. కానీ అప్పుడు 40 సంవత్సరాల క్రితం ‘డి - కంపెనీ’ కంట్రోల్ లో ఉన్నప్పుడు ఇలా ఉండకపోయేది.  ‘డి - కంపెనీ’, దావూద్ ఇబ్రహీం ని నేను చాలా స్టడీ చేశాను. నేను క్రిమినల్ ని కాదు కానీ చిన్నప్పటి నుంచీ క్రిమినల్స్ ని స్టడీ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఈరోజు దావూద్‌ పేరు ప్రపంచం మొత్తం ఫేమస్ అయ్యింది" అంటూ ఈ వీడియో మధ్య భాగంలో వాయిస్ ఓవర్ ప్రారంభించిన ఆర్జీవి దావూద్ ఇబ్రహీం నేపథ్యం చెబుతూ సినిమాపై అంచనాలను పెంచేశారు. ఇకపోతే ఈ మూవీలో అష్వత్‌ కాంత్, ఇర్రా మోహన్, నైనా గంగూలి, రుద్రకాంత్‌ ప్రధాన పాత్రలు పోషించారు. మే 15న స్పార్క్‌ ఓటీటీలో ‘డి - కంపెనీ’ విడుద‌ల కానుంది.

" style="height: 332px;">




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కంగనా రనౌత్ కి కరోనా.. !

యద్దనపూడి సులోచనారాణి ప్రభావం నుండి బయటపడలేకపోతున్న త్రివిక్రమ్ !

చరిత్ర: గతంలో సీఎంలను ఎదిరించిన మంత్రులెవరు? ఏమయ్యారు?

వ్యాక్సినేషన్ పై మోదీ చేతులెత్తేసినట్టేనా..?

క్యాన్సర్‌ చికిత్సలో సంచలనం.. ముంబై సంస్థ అద్భుత విజయం

బిగ్ బాస్ సీజన్ 5కి కొత్త కన్ఫ్యూజన్లు!

ఆ దేశంలో ఆగస్టు కల్లా కరోనా ఖతం ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>