PoliticsSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi-e00a7a83-2ab6-476d-86bc-c2ea5b23f049-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi-e00a7a83-2ab6-476d-86bc-c2ea5b23f049-415x250-IndiaHerald.jpgమోడీ కేంద్రంలో ప్రధానిగా వచ్చిన నాటి నుంచి చూస్తే ఆయన పాలన తీరు, ఆయన రాష్ట్రాల అధినేతలతో వ్యవహరించే తీరు ఏంటన్నది అర్ధమవుతుంది. ఆయన ఏడేళ్ళుగా ప్రధానిగా ఉన్నారు. ఆయన తత్వం ఏంటో ఈ పాటికే అందరికీ అర్ధం అయింది. ఎవరికైనా బోధపడలేదూ అంటూ దాని వెనక వేరే అర్ధాలూ పరమార్ధాలు వెతుక్కోవాల్సిందే. modi;modi;bharatiya janata party;jagan;central governmentమోడీ జగన్ ల మధ్య అంతుందా... ?మోడీ జగన్ ల మధ్య అంతుందా... ?modi;modi;bharatiya janata party;jagan;central governmentSat, 08 May 2021 10:00:00 GMTమోడీ కేంద్రంలో ప్రధానిగా వచ్చిన నాటి నుంచి చూస్తే ఆయన పాలన తీరు, ఆయన రాష్ట్రాల అధినేతలతో వ్యవహరించే తీరు ఏంటన్నది అర్ధమవుతుంది. ఆయన ఏడేళ్ళుగా ప్రధానిగా ఉన్నారు. ఆయన తత్వం ఏంటో ఈ పాటికే అందరికీ అర్ధం అయింది. ఎవరికైనా బోధపడలేదూ అంటూ దాని వెనక వేరే అర్ధాలూ పరమార్ధాలు వెతుక్కోవాల్సిందే.

ఇదిలా ఉంటే హఠాత్తుగా జగన్ మోడీ సైడ్ తీసుకున్నారు. అంతే కాదు మోడీకి అంతా మద్దతు ఇవ్వాలంటూ ఫక్త్ బీజేపీ మనిషిలా వకాల్తా పుచ్చుకున్నారు. కరోనా వేళ దేశం అతలాకుతలం అవుతూంటే అంతా ఒక్కటిగా నిలిచి ప్రధానికి బాసటగా ఉండాలని కూడా జగన్ సూచించారు. ఇవన్నీ పైకి మంచి మాటలే, హిత వచనాలుగానే చూడాలి. జగన్ ఇందులో చేసిన తప్పు ఏముంది అని ఎవరికైనా అనిపించవచ్చు.

కానీ జగన్ తనది కాని విషయం ఎందుకు భుజాలకు ఎత్తుకున్నారు అన్నదే ఇక్కడ ప్రశ్న. పైగా మోడీ ప్రాభవం దేశంలో నెమ్మదిగా తగ్గుతున్న వేళ అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూసిన తరువాత, దేశ రాజకీయం క్రమంలో యాంటీ మోడీ గా మారుతున్న వేళ జగన్ మోడీ కి సపోర్ట్ గా రావడమే అతి పెద్ద విశేషంగా చెప్పుకోవాలి.

అయితే ఇక్కడ జగన్ తొందర పడ్డారా అన్నదే చర్చ. తాను మోడీ సైడ్ అంటూ జగన్ ఎందుకు ఉబలాటపడ్డారూ అన్నది కూడా చాలా మందిలో కలిగే సందేహం. కానీ జగన్ మోడీల మధ్య ఎవరికీ తెలియని బంధం ఏదో ఉందన్నదే ఇప్పటిదాకా అందరి అనుమానం. జగన్ మద్దతుతో ఒక్కసారిగా అది బయటపడిందని అంటున్నారు. దీని వెనక మోడీ మార్క్ దర్శకత్వం కూడా ఏదైనా ఉందేమోనని కూడా మాట  వినిపిస్తోంది. తనకు వ్యతిరేకత రాష్ట్రాల నుంచి రాకుండా జగన్ ద్వారా మోడీయే ఈ రకంగా పలికింపచేశారు అన్నది ఒక రకమైన ప్రచారం సాగుతోంది. ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ మోడీని వెనకేసుకురావడం ద్వారా జగన్ రాజకీయంగా ఈ సమయంలో కొంత ఇబ్బంది పడుతున్నారనే అంటున్నారు. మరి వల్ల విస్తృతమైన ప్రయోజనాలు ఏమైనా ఉంటే అవి ఫ్యూచర్ లో తెలుస్తాయేమో.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తమిళనాడులో లాక్డౌన్ అందుకేనా..?

వ్యాక్సినేషన్ పై మోదీ చేతులెత్తేసినట్టేనా..?

క్యాన్సర్‌ చికిత్సలో సంచలనం.. ముంబై సంస్థ అద్భుత విజయం

బిగ్ బాస్ సీజన్ 5కి కొత్త కన్ఫ్యూజన్లు!

ఆ దేశంలో ఆగస్టు కల్లా కరోనా ఖతం ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఈటలను అన్నీ వైపులా బిగించేస్తున్న కేసీయార్

ఏంది జ‌గ‌న్ ఇది..భ‌య‌మా.. గౌర‌వ‌మా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>