PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/lokesh-jagan88003a56-0c67-4ac6-9759-e01ec27f5975-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/lokesh-jagan88003a56-0c67-4ac6-9759-e01ec27f5975-415x250-IndiaHerald.jpg స‌వాళ్లు.. ప్ర‌తిస‌వాళ్లు కూడా కొన‌సాగుతున్నాయి. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ.... అధికార ప‌క్షం వైసీపీని అన్ని కోణాల్లోనూ టార్గెట్ చేస్తోంది. అయితే.. ఇప్పుడు అనూహ్యంగా టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి.. నారా లోకేష్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ విష‌యంలో యూట‌ర్న్ తీసుకుని.. ``థ్యాంక్యూ జ‌గ‌న్ సార్`` అని వ్యాఖ్యానించారు. దీంతో ఒక్కసారిగా ఈ విష‌యం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారితీసింది. ఇటీవ‌ల ఇంట‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామంటూ.. జ‌గ‌న్ స‌ర్కారు మొండిగా ముందుకు సాగింది.jagan lokesh;lokesh;nithya new;nara lokesh;fire;letter;tdp;ycp;lokesh kanagaraj;dookuduలోకేష్ టోన్ మారిందా.. జ‌గ‌న్ విష‌యంలో యూట‌ర్న్‌..!లోకేష్ టోన్ మారిందా.. జ‌గ‌న్ విష‌యంలో యూట‌ర్న్‌..!jagan lokesh;lokesh;nithya new;nara lokesh;fire;letter;tdp;ycp;lokesh kanagaraj;dookuduSat, 08 May 2021 14:33:00 GMTనిత్యం.. ఉప్పు-నిప్పుగా ఉండే.. వైసీపీ-టీడీపీ నేత‌ల విష‌యం అంద‌రికీ తెలిసిందే. ముఖ్యంగా సీఎం జ‌గ‌న్ వ్య‌వ‌హార శైలిపై నిప్పులు చెరుగుతూ.. ఆయ‌న పాల‌న‌, సంక్షేమ‌ప‌థ‌కాల్లోని త‌ప్పుల‌ను ఎత్తి చూపుతూ..  టీడీపీ నేత‌లు దూకుడుగా ఉంటార‌న్న విష‌యం తెలిసిందే. ప్ర‌ధానంగా అటు చంద్ర‌బాబు, ఇటు నారా లోకేష్ ఇద్ద‌రూ కూడా సీఎం జ‌గ‌న్ అనుస‌రిస్తున్న ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌ను తూర్పార‌బ‌డుతూ.. ప్ర‌జ‌ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. వైసీపీ నేత‌లు కూడా బాబు, లోకేష్ విమ‌ర్శ‌ల‌కు ఘాటుగానే కౌంట‌ర్లు ఇస్తూ వ‌స్తున్నారు.

ఈ క్ర‌మంలోనే రాజ‌కీయంగా ఇరు పార్టీల మ‌ధ్య తీవ్ర వివాదాలు, విభేదాలు.. స‌వాళ్లు.. ప్ర‌తిస‌వాళ్లు కూడా కొన‌సాగుతున్నాయి. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ.... అధికార ప‌క్షం వైసీపీని అన్ని కోణాల్లోనూ టార్గెట్ చేస్తోంది. అయితే.. ఇప్పుడు అనూహ్యంగా టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి.. నారా లోకేష్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ విష‌యంలో యూట‌ర్న్ తీసుకుని.. ``థ్యాంక్యూ జ‌గ‌న్ సార్`` అని వ్యాఖ్యానించారు. దీంతో ఒక్కసారిగా ఈ విష‌యం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారితీసింది. ఇటీవ‌ల ఇంట‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామంటూ.. జ‌గ‌న్ స‌ర్కారు మొండిగా ముందుకు సాగింది.

అయితే.. క‌రోనా తీవ్రత ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో విద్యార్థుల ప్రాణాల‌ను దృష్టిలో పెట్టుకుని వాటిని వాయిదా వేయాల‌ని లోకేష్ స‌హా అంద‌రూ డిమాండ్ చేశారు. అయితే.. ముందు మొండిగా వ్య‌వ‌హ‌రించినా.. ఎట్ట‌కేల‌కు స‌ర్కారు దిగి వ‌చ్చి.. ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేసింది. లేక‌పోయిఉంటే.. ఈ రోజు(బుధ‌వారం) నుంచి ప‌రీక్ష‌లు జ‌రగాల్సి ఉండేది. ఈ క్ర‌మంలోనే త‌మ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని జ‌గ‌న్ తీసుకున్న ప‌రీక్ష‌ల వాయిదా నిర్ణ‌యాన్ని లోకేష్ తాజాగా స్వాగ‌తించారు.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న థ్యాంక్యూ సీఎం సార్‌.. అని వ్యాఖ్యానించారు. ఇక‌, అదే స‌మ‌యంలో వ‌చ్చే జూన్లో నిర్వ‌హిస్తామ‌ని చెబుతున్న‌ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను కూడా వాయి దా వేయాలని.. మ‌రింత క‌ఠినంగా రాష్ట్రంలో క‌రోనా నిబంధ‌న‌ల‌ను అమ‌లు చేయాల‌ని ఆయ‌న సూచించారు.  మొత్తానికి లోకేష్ నోటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు విన‌ని జ‌గ‌న్ సార్ థ్యాంక్యు అనే కామెంట్ రావ‌డంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొన‌డం గ‌మ‌నార్హం. ఇక‌, టీడీపీలో అయితే.. లోకేష్ వ్య‌వ‌హార శైలిపై ఆందోళ‌న వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ ప‌రిణామంపై వైసీపీ నాయ‌కులు ఎలా స్పందిస్తారో..  ఏం జ‌రుగుతుందో చూడాలి.

 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎడిటోరియల్: మమత యుపిఏ నాయకత్వానికి తగిన వ్యక్తి కాదు

మ‌రో మంత్రిపై భూదందా ఆరోప‌ణ‌లు.. జ‌ప్తులో ఉన్న భూమి స్వాహా?

బిల్ గేట్స్ విడాకుల వ్యవహారంలో మూడో వ్యక్తి?

కడప పేలుడు : మృతులు ఈ ప్రాంతానికి చెందిన వారే..!

ఇదంతా వాళ్ల వల్లే..!!

తీవ్ర విషాదం : ముక్కలైన శరీరాలు.. చిదిలమైన బతుకులు !

శరీర భాగాలు తునాతునకలు..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>