PoliticsChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/stalini2cd20a57-c953-47fa-b9ea-3de13ce82227-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/stalini2cd20a57-c953-47fa-b9ea-3de13ce82227-415x250-IndiaHerald.jpgఅది ఏంటది, పక్క రాష్ట్ర సీఎం మనవాడు ఎలా అవుతాడు ? అని అనుకుంటున్నారా! కావడానికి పక్క రాష్ట్రానికి ప్రస్తుతం సీఎం అయినా సరే స్టాలిన్ పూర్వీకులు మన తెలుగు రాష్ట్రం నుంచి వెళ్లి తమిళనాడులో సెటిల్ అయ్యారట.ఆ లెక్కన ఆయన మనవాడే కదా మరి. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి కుమారులలో ఒకరైన ఎంకే స్టాలిన్ తమిళనాడుకు తాజాగా ముఖ్యమంత్రిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే స్టాలిన్‌ మూలాలు ప్రకాశం జిల్లాలో ఉన్నాయట. ఆయన పూర్వీకులు ఒంగోలు నగర పరిధిలోని పెళ్లూరు వెంకటగిరి రాజుల ఆస్థాన పరిధిలోని దేవాలయాలకు ఆస్థాstalin;kcr;udhayanidhi stalin;telangana;m. karunanidhi;pond;village;chief minister;king;chennai;tamilnadu;stalin;venkatagiri;eluruతమిళనాడు కొత్త సీఎం మనోడే!తమిళనాడు కొత్త సీఎం మనోడే!stalin;kcr;udhayanidhi stalin;telangana;m. karunanidhi;pond;village;chief minister;king;chennai;tamilnadu;stalin;venkatagiri;eluruSat, 08 May 2021 16:08:37 GMTఅది ఏంటది, పక్క రాష్ట్ర సీఎం మనవాడు ఎలా అవుతాడు ? అని అనుకుంటున్నారా! కావడానికి పక్క రాష్ట్రానికి ప్రస్తుతం సీఎం అయినా సరే స్టాలిన్ పూర్వీకులు మన తెలుగు రాష్ట్రం నుంచి వెళ్లి తమిళనాడులో సెటిల్ అయ్యారట.ఆ లెక్కన ఆయన మనవాడే కదా మరి.  తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి కుమారులలో ఒకరైన ఎంకే స్టాలిన్ తమిళనాడుకు తాజాగా ముఖ్యమంత్రిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే స్టాలిన్‌ మూలాలు ప్రకాశం జిల్లాలో ఉన్నాయట. ఆయన పూర్వీకులు ఒంగోలు నగర పరిధిలోని పెళ్లూరు వెంకటగిరి రాజుల ఆస్థాన పరిధిలోని దేవాలయాలకు ఆస్థాన విద్యాంసులుగా పనిచేస్తుండేవారు. 



ఈ క్రమంలో వారికి అక్కడికి అతి సమీపంలోని ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెం దగ్గరలో 150 ఎకరాల భూమిని, పెళ్లూరు చెరువు కింద 20 ఎకరాల మాగాణి భూమి, చెరువుకొమ్ముపాలెంలో నివాసం ఉండేందుకు భూమిని ఇచ్చినట్లు ఆ గ్రామస్తులు చెబుతున్నారు. వెంకటగిరి రాజుల వారసులు ఈ గ్రామంలో ఉన్నా దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి తాతల కాలంలో పంటలు పండక కరువు కాటకాల వల్ల ఇప్పటి చెన్నై అంటే అప్పటి చెన్నపట్నానికి వలస వెళ్ళినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అలా వెళ్ళిన వాళ్ళు ఏకంగా ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళడం తమ ఊరికి గర్వకారణం అని వారు చెబుతున్నారు. 


భూములు ఇప్పటికీ ఉన్నా వారు మాత్రం ఎప్పుడూ కూడా వచ్చిన దాఖలాలు మాత్రం లేవట. ఇక తమ పూర్వీకులది ఒంగోలు అని కరుణానిధి ఏలూరులో జరిగిన ఒక సాహిత్య సభలో ప్రస్తావించాడని, ఒంగోలులో జరిగే సాహిత్య సభకు కూడా త్వరలోనే వస్తానని చెప్పారని కానీ ఆయన రాలేదని అంటున్నారు. అన్నట్టు ఈ కుటుంబానిది నాయీ బ్రాహ్మణ కులం. ఎంతయినా మన తెలుగు వాళ్ళు పక్క రాష్ట్రానికి సీఎం అంటే మీకు వినడానికి, చెప్పుకోడానికి బాగుంది కదూ.. అన్నట్టు తెలంగాణ రాష్ట్ర సిఏం కేసీఆర్ ది సైతం విజయనగరం జిల్లానే. ఆయన పూర్వీకులు సైతం బ్రతుకు దెరువు కోసం తెలంగాణ వచ్చి సెటిల్ అయ్యారు.  




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనాకి 5జీ టెస్టింగ్ కి సంబంధం ఉందా..?

టాలీవుడ్ బెస్ట్ కాంబినేషన్ : నాగార్జున, సౌందర్యల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఏంటో తెలుసా?

హీరోగా ఎదుగుతున్నాడు అనే మన హీరో లు సుమన్ ని జైలుకి పంపారా.. క్లారిటీ..!!

వారం నుండి 180 జిల్లాల్లో నో కరోనా..!!

క్రాక్ ఎఫెక్ట్ ఖిలాడి మీద పడింది.. భారీ డీల్?

లోకేష్ టోన్ మారిందా.. జ‌గ‌న్ విష‌యంలో యూట‌ర్న్‌..!

ఎడిటోరియల్: మమత యుపిఏ నాయకత్వానికి తగిన వ్యక్తి కాదు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>