KidsN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/children-d879324a-a100-4344-ace5-fa4aaf1d696b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/children-d879324a-a100-4344-ace5-fa4aaf1d696b-415x250-IndiaHerald.jpgచిన్న పిల్లలు ఎక్కువగా పక్క తడుపుతూ ఉంటారు. ఇక అస్తమానం పక్క మార్చలేక, దుప్పట్లు ఉతకలేక డైపర్ తొడిగేస్తుంటారు చాలామంది. ఏ బైటికి వెళ్లినప్పుడో బట్టలు పాడవకుండా డైపర్ వేయడంలో తప్పు లేదు కానీ... రోజంతా డైపర్ వేసి ఉండటం వల్ల ఒక్కోసారి పిల్లలకు ర్యాషెస్ వచ్చేస్తుంటాయి. పాపం దురద, మంట పిల్లల్ని వేధిస్తుంటాయి.children;air;cheque;oilబుడుగు: డైపర్ తో పిల్లలకు కాస్త డేంజరే..!బుడుగు: డైపర్ తో పిల్లలకు కాస్త డేంజరే..!children;air;cheque;oilSat, 08 May 2021 17:09:22 GMTచిన్న పిల్లలు ఎక్కువగా పక్క తడుపుతూ ఉంటారు. ఇక అస్తమానం పక్క మార్చలేక, దుప్పట్లు ఉతకలేక డైపర్ తొడిగేస్తుంటారు చాలామంది. ఏ బైటికి వెళ్లినప్పుడో బట్టలు పాడవకుండా డైపర్ వేయడంలో తప్పు లేదు కానీ... రోజంతా డైపర్ వేసి ఉండటం వల్ల ఒక్కోసారి పిల్లలకు ర్యాషెస్ వచ్చేస్తుంటాయి. పాపం దురద, మంట పిల్లల్ని వేధిస్తుంటాయి. అందుకే డైపర్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అయితే డైపర్ వేసేముందు ఓసారి వేడి నీటిలో ముంచిన బట్టతో శుభ్రంగా ఒళ్లు తుడిచి, తర్వాత పొడి బట్టతో తుడవండి. చక్కగా పౌడర్ రాసి అప్పుడు డైపర్  వేయండి. డైపరే కదా అని అలా వదిలేయకండి. తరచూ చెక్ చేయండి. పాస్ పోసినా, మల విసర్జన చేసినా వెంటనే తీసి శుభ్రం చేయండి. కాసేపు అలా వదిలేసి ఒళ్లు ఆరిన తర్వాతే డైపర్ వేయండి. డైపర్ మామూలుగా తొడిగేస్తుంటారు చాలామంది. కొన్నిసార్లు కొన్ని డైపర్ల వల్ల పిల్లలకు కంఫర్ట్ ఉండదు అన్న విషయాన్ని గమనించరు. మరీ టైట్ గా ఉన్నా, మెటీరియల్ పడకపోయినా పిల్లలు ఇబ్బంది పడటమే కాదు, చర్మ సమస్యలు కూడా వస్తాయి జాగ్రత్త.

ఇక ఒకవేళ డైపర్ వల్ల ర్యాషెస్ కనుక వస్తే అవి తగ్గే వరకూ మళ్లీ డైపర్ వేయకండి. ర్యాషెస్ వచ్చిన చోట ఆలివ్ ఆయిల్ తో కాసేపు మసాజ్ చేసి, వేడి నీటితో కడిగేయండి. తరచూ అలా చేస్తూ ఉంటే త్వరగా తగ్గిపోతాయి. కొబ్బరి నూనె  అయినా ఫర్వాలేదు. అన్నిటికంటే ఉత్తమం ఏమిటంటే.. బైటికి వెళ్లినప్పుడు తప్ప ఇంట్లో ఉన్నప్పుడు డైపర్ వేయకండి. కాస్త గాలి తగలనిస్తూ ఉండటం చాలా అవసరం. పిల్లలకు కూడా హాయిగా అనిపిస్తుంది.  ఈ జాగ్రత్తలు కనుక తీసుకోకుండా డైపర్ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే సేఫ్టీ కోసం వాడే డైపరే డేంజరస్ గా మారి... పిల్లలకు చర్మసంబంధిత సమస్యలు, అలర్జీలు రావడం మాత్రం ఖాయం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనాకి 5జీ టెస్టింగ్ కి సంబంధం ఉందా..?

టాలీవుడ్ బెస్ట్ కాంబినేషన్ : నాగార్జున, సౌందర్యల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఏంటో తెలుసా?

హీరోగా ఎదుగుతున్నాడు అనే మన హీరో లు సుమన్ ని జైలుకి పంపారా.. క్లారిటీ..!!

వారం నుండి 180 జిల్లాల్లో నో కరోనా..!!

తమిళనాడు కొత్త సీఎం మనోడే!

క్రాక్ ఎఫెక్ట్ ఖిలాడి మీద పడింది.. భారీ డీల్?

లోకేష్ టోన్ మారిందా.. జ‌గ‌న్ విష‌యంలో యూట‌ర్న్‌..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>