MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kamal-kamaraju-interview-43b42fe6-4a58-4cb0-8392-c117824c854f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kamal-kamaraju-interview-43b42fe6-4a58-4cb0-8392-c117824c854f-415x250-IndiaHerald.jpgక‌రోనా పాజిటివ్ వ‌చ్చిందంటే చాలు ఎంతో ఆందోళ‌న చెందిపోతున్నారు. అయితే ఆందోళ‌న చెంద‌టం వ‌ల్ల ఇమ్యునిటీపై ప్ర‌భావం చూపుతుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. కాగా తాజాగా టాలీవుడ్ హీరో క‌మ‌ల్ కామ‌రాజ్ త‌న కుటుంబంలో ఆరుగురికి కోవిడ్ వ‌స్తే ఆందోళ‌న చెంద‌కుండా ఎదురుకున్న విధానాన్ని మీడియాతో పంచుకున్నారు. క‌మ‌ల్ మాట్లాడుతూ...ఎర్లీ డిటెక్షన్, ఇమ్మీడియట్‌ మెడికేషన్‌తో పాటు పాజిటివ్ ఆటిట్యూడ్ తో కరోనాను ఎదురుకుందామ‌న్నారు. సినిమా షూటింగ్ కోసం డెహ్రాడూన్ వెళ్లి వచ్చాను. ఎందుకైనా మంచిద‌ని క‌రోనా టెస్ట్ చేసుకుంkamal kamaraju;mandula;tollywood;cinema;wife;hero;bhopal;dehradunపాజిటివ్ వ‌చ్చినా పాజిటివ్ గానే తీసుకోవాలి : హీరోపాజిటివ్ వ‌చ్చినా పాజిటివ్ గానే తీసుకోవాలి : హీరోkamal kamaraju;mandula;tollywood;cinema;wife;hero;bhopal;dehradunSat, 08 May 2021 10:48:55 GMTక‌రోనా పాజిటివ్ వ‌చ్చిందంటే చాలు ఎంతో ఆందోళ‌న చెందిపోతున్నారు. అయితే ఆందోళ‌న చెంద‌టం వ‌ల్ల ఇమ్యునిటీపై ప్ర‌భావం చూపుతుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. కాగా తాజాగా టాలీవుడ్ హీరో క‌మ‌ల్ కామ‌రాజ్ త‌న కుటుంబంలో ఆరుగురికి కోవిడ్ వ‌స్తే ఆందోళ‌న చెంద‌కుండా ఎదురుకున్న విధానాన్ని మీడియాతో పంచుకున్నారు. క‌మ‌ల్ మాట్లాడుతూ...ఎర్లీ డిటెక్షన్, ఇమ్మీడియట్‌ మెడికేషన్‌తో పాటు పాజిటివ్ ఆటిట్యూడ్ తో కరోనాను ఎదురుకుందామ‌న్నారు. సినిమా షూటింగ్ కోసం డెహ్రాడూన్ వెళ్లి వచ్చాను. ఎందుకైనా మంచిద‌ని క‌రోనా టెస్ట్ చేసుకుంటే నెగిటివ్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం సెకండ్ వేవ్ ఉదృతి ఎక్కువ‌గా ఉండ‌టంతో భోపాల్ లో ఉంటున్న మా అత్త మామ‌ను ఇంటికి తీసుకువ‌చ్చాం. వారిద్ద‌రి వ‌య‌స్సు 70 ఏళ్ల పైనే ఉంటుంది. అంతే కాకుండా ఇద్ద‌రికీ షుగ‌ర్ బిపీ ఉన్నాయి. దాంతో ముందు జాగ్ర‌త్త‌గా వారు రాక‌ముందే మ‌రోసారి టెస్ట్ చేయించుకున్నాం. వారు ఇంటికి వ‌చ్చిన‌రోజే నా రిపోర్టు రాగా అందులో పాజిటివ్ వ‌చ్చింది. 

దాంతో ఎలాంటి ల‌క్ష‌ణాలు లేక‌పోయినా వెంట‌నే మా అత్త మామ తో పాటు నా భార్య, నా త‌ల్లి దండ్రులు, ప‌నిమ‌నుల‌ష‌కు టెస్ట్ లు చేయించా. మా అత్త‌మామ కు త‌ప్ప అంద‌రికీ పాజిటివ్ వ‌చ్చింది. ముందుగా వ్యాధిని గుర్తించ‌డం వెంట‌నే మందులు ప్రారంభించ‌డం మాకు చాలా ఉప‌యోగ‌ప‌డింది. మంచి ఆహారం తీసుకుంటూ ఆందోళ‌న చెంద‌కుండా మందు వేసుకున్నాం. నాకు ఒక రెండు రోజులు జ్వ‌రం వ‌చ్చింది త‌ప్ప ఇత‌ర ల‌క్ష‌ణాలేమీ లేవు. అంతే కాకుండా మా అత్తా మామ వ్యాక్సిన్ తీసుకుని ఉండ‌టంతో వారికి పాజిటివ్ రాలేదు. నా అభువంతో చెప్పేది ఏంటంటే పాజిటివ్ వ‌చ్చినా పాజిటివ్ గానే తీసుకుని మందులు వాడాలి. అంటూ కమ‌ల్ కామరాజు త‌న అనుభ‌వాల‌ను పంచుకున్నారు. ఇదిలా ఉండ‌గా క‌మల్ ఆవ‌కాయ్ బిర్యానీ సినిమాలో హీరోగా న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాకుండా ప‌లు సినిమాల్లో హీరోకి ఫ్రెండ్ గా, బ్రద‌ర్ గా న‌టించి ఆక‌ట్టుకున్నారు.  



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప‌సిబిడ్డ‌కు రూ. 16 కోట్ల ఇంజెక్ష‌న్..!!

యద్దనపూడి సులోచనారాణి ప్రభావం నుండి బయటపడలేకపోతున్న త్రివిక్రమ్ !

చరిత్ర: గతంలో సీఎంలను ఎదిరించిన మంత్రులెవరు? ఏమయ్యారు?

వ్యాక్సినేషన్ పై మోదీ చేతులెత్తేసినట్టేనా..?

క్యాన్సర్‌ చికిత్సలో సంచలనం.. ముంబై సంస్థ అద్భుత విజయం

బిగ్ బాస్ సీజన్ 5కి కొత్త కన్ఫ్యూజన్లు!

ఆ దేశంలో ఆగస్టు కల్లా కరోనా ఖతం ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>