LifeStylepraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/undefinedhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/undefinedకరోనా వైరస్ పుణ్యమా అని అటు ఉద్యోగులు అందరి కోరిక తీరింది. ఎందుకంటే ప్రతి రోజు నిర్దేశించిన సమయం లోపు ఆఫీసుకు వెళ్లి ఇక సమయం పూర్తయిన తర్వాత ఇంటికి రావడం ఆ మరునాడు అదేవిధంగా ఆఫీసుకు వెళ్లి రావడం చేస్తూ ఉండేవారు ఉద్యోగులు. అలా వర్క్ చేస్తున్న సమయంలో ఇంటి నుంచి పని చేసే వీలు ఉంటే ఎంత బాగుండు ఇంటి దగ్గరే హాయిగా కూర్చుని పని చేసుకునే వాళ్లం కదా అనుకున్నారు ఎంతోమంది. ఇలా ఉద్యోగులందరూ కోరుకున్నారో లేదో కరోనా వైరస్ రూపంలో వారికి దేవుడు వరం ఇచ్చాడు అని అనుకున్నారు కొన్ని రోజుల పాటు ఎంతో మంది ఉద్యోగులCorona;deva;korcha;butter;house;office;coronavirusవర్క్ ఫ్రమ్ హోమా.. ఇలా కూర్చొని చేయండి?వర్క్ ఫ్రమ్ హోమా.. ఇలా కూర్చొని చేయండి?Corona;deva;korcha;butter;house;office;coronavirusSat, 08 May 2021 12:00:00 GMTకరోనా వైరస్ పుణ్యమా అని అటు ఉద్యోగులు అందరి కోరిక తీరింది. ఎందుకంటే ప్రతి రోజు నిర్దేశించిన సమయం లోపు ఆఫీసుకు వెళ్లి ఇక సమయం పూర్తయిన తర్వాత ఇంటికి రావడం ఆ మరునాడు అదేవిధంగా ఆఫీసుకు వెళ్లి రావడం చేస్తూ ఉండేవారు ఉద్యోగులు. అలా వర్క్ చేస్తున్న సమయంలో ఇంటి నుంచి పని చేసే వీలు  ఉంటే ఎంత బాగుండు ఇంటి దగ్గరే హాయిగా కూర్చుని పని చేసుకునే వాళ్లం కదా అనుకున్నారు ఎంతోమంది.  ఇలా ఉద్యోగులందరూ కోరుకున్నారో లేదో కరోనా వైరస్ రూపంలో వారికి దేవుడు వరం ఇచ్చాడు అని అనుకున్నారు  కొన్ని రోజుల పాటు ఎంతో మంది ఉద్యోగులు. కానీ ఆ తర్వాతే అసలు బాధ ఏంటో తెలిసొచ్చింది.


 నాలుగు గోడల మధ్య ఒంటరిగా కూర్చొని పనిచేయడం కంటే నలుగురు స్నేహితుల మధ్య ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం లో పనిచేయడం ఎంతో బెటర్ అని అనుకున్నారు. కానీ ఏం చేస్తాం కరోనా వైరస్ తగ్గకపోవడంతో వద్దు వద్దు అనుకున్న వర్క్ ఫ్రొం హోమ్ చేయాల్సి వస్తుంది. అయితే దాదాపు ఏడాదికి పైగా ఎంతో మంది ఉద్యోగులు వర్క్ ఫ్రొం హోమ్ లో కొనసాగుతున్న తరుణంలో ఎంతో మంది వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.  నడుము నొప్పి మెడ నొప్పి లాంటివి ఎంతో మందిని వేధిస్తున్నాయి అయితే ఇక ఆఫీస్ లో చేసిన సమయం కంటే ఎక్కువ సమయంపాటు వర్క్ ఫ్రమ్ హోమ్ లో పని చేయాల్సి వస్తుంది.




 ఇలాంటి నేపథ్యంలో ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ముఖ్యంగా ఎంతోమందిని వర్క్ ఫ్రం హోం లో నడుము నొప్పి ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది. ఇలాంటి వారు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు నిపుణులు.  ఇంటి నుంచే పని చేసేటప్పుడు కుర్చీలో వెనక్కి అనుకొని కూర్చోవడం వల్ల వెన్నుముక పై ఎక్కువగా ప్రెజర్ పడే అవకాశం ఉండదు అని చెబుతున్నారు అంతేకాకుండా అలా కూర్చున్నప్పుడు పాదాలను పూర్తిగా నేలపై ఆనించడం ఎంతో మంచిదని చెబుతున్నారు. అంతేకాదు ఒకే చోట గంటల తరబడి కూర్చోవడం కూడా ఏ మాత్రం మంచిది కాదు అని చెబుతున్నారు.  ప్రతి 40 నిమిషాలకు ఒకసారి లేచి అటూ ఇటూ నడవడం చిన్నచిన్న స్ట్రెచెస్ లాంటివి చేయడం కూడా మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాల‌య్య‌- విజ‌యశాంతి కాంబో 17 సినిమాలు చేస్తే ఒక్క‌టే ఫ్లాప్!

యద్దనపూడి సులోచనారాణి ప్రభావం నుండి బయటపడలేకపోతున్న త్రివిక్రమ్ !

చరిత్ర: గతంలో సీఎంలను ఎదిరించిన మంత్రులెవరు? ఏమయ్యారు?

వ్యాక్సినేషన్ పై మోదీ చేతులెత్తేసినట్టేనా..?

క్యాన్సర్‌ చికిత్సలో సంచలనం.. ముంబై సంస్థ అద్భుత విజయం

బిగ్ బాస్ సీజన్ 5కి కొత్త కన్ఫ్యూజన్లు!

ఆ దేశంలో ఆగస్టు కల్లా కరోనా ఖతం ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>