MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actors/chalapathi-rao8b3697e1-18c1-4199-a91e-ae7a71e44756-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actors/chalapathi-rao8b3697e1-18c1-4199-a91e-ae7a71e44756-415x250-IndiaHerald.jpgచలపతిరావు.. అనే పేరుతో తెలుగు ప్రేక్షకులకు కొన్ని దశాబ్దాలుగా పరిచయం ఉంది. వందల సినిమాల్లో తనదైన నటనతో ప్రత్యేకమైన ముద్ర వేసిన నటుడు ఈయన. అయితే ఎన్ని సినిమాలు చేసినా కూడా ఈయనకు ఈ తరం వారిలో పెద్దగా క్రేజ్ లేదు. అన్నీ చేసినా రాని పేరు.. ఒక్క ఇన్సిడెంట్‌తో వచ్చేసింది. అదే అమ్మాయిలపై అసభ్యకరమైన కమెంట్స్ చేయడం.. రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో వేడుకలో అమ్మాయిలు పడుకోడానికి తప్ప ఇంకెందుకు పనికిరారు అంటూ ఓ కమెంట్ చేశారు. దాంతో సోషల్ మీడియాలో ఈయనపై ఇష్టమొచ్చినట్లు ట్రోల్ జరిగింది. తరవాత దానిని కవర్ చేసుకుChalapathi rao;ntr;krishna;krishna vamshi;cinema;audio;thief;nandamuri taraka rama rao;father;sakshi;donga;goodachari;takkari donga;chitramకృష్ణ సినిమాతో ఎంట్రీ.. ఎన్టీఆర్ కి తమ్ముడిగా మారి!కృష్ణ సినిమాతో ఎంట్రీ.. ఎన్టీఆర్ కి తమ్ముడిగా మారి!Chalapathi rao;ntr;krishna;krishna vamshi;cinema;audio;thief;nandamuri taraka rama rao;father;sakshi;donga;goodachari;takkari donga;chitramSat, 08 May 2021 14:00:00 GMTఆడియో వేడుకలో అమ్మాయిలు పడుకోడానికి తప్ప ఇంకెందుకు పనికిరారు అంటూ ఓ కమెంట్ చేశారు. దాంతో సోషల్ మీడియాలో ఈయనపై ఇష్టమొచ్చినట్లు ట్రోల్ జరిగింది. తరవాత దానిని కవర్ చేసుకున్నారు అనుకోండి అది వేరే విషయం. ఇక ఈరోజు ఆయన పుట్టిన రోజు ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

కృష్ణ నటించిన గూఢచారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన తరువాత సాక్షి, బుద్దిమంతుడు, టక్కరి దొంగ చక్కని చుక్క లాంటి సినిమాల్లో చేశారు. కానీ ఈన్టీఆర్ హీరోగా రూపొందిన 'కథానాయకుడు' (1969)లో కాసింత గుర్తింపు ఉన్న పాత్ర పోషించారు. అందులో యన్టీఆర్, నాగభూషణం వంటి హేమాహేమీలతో నటించారు. ఆ సినిమా దెబ్బకు ఆయన ఎన్టీఆర్  సొంత మనిషిగా మారిపోయారు. అప్పటి నుంచీ ఎన్టీఆర్ నటించిన పలు సినిమాల్లో చలపతిరావు ఏదో ఒక పాత్రలో కనిపించేవారు. ఎన్టీఆర్ సినిమాల్లో చలపతిరావుకు ఏదో ఒక వేషం ఉండేది. ముఖ్యంగా ఎన్టీఆర్ సొంత చిత్రాలలో చలపతిరావుకు గుర్తింపు ఉండే పాత్రలు లభించేవి. యన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో త్రిపాత్రాభినయం చేసి, నిర్మించిన 'దానవీరశూర కర్ణ' చిత్రంలో చలపతిరావు బహుపాత్రాభినయం చేశారు. అందులో సూతునిగా, దేవేంద్రునిగా, బ్రాహ్మణునిగా, యాచకునిగా, జరాసంధునిగా చలపతిరావు ఐదు పాత్రల్లో కనిపిస్తారు.

రామారావు దర్శకత్వంలో సినిమా గనుక ప్లాన్ చేస్తే అందులో చలపతిరావుకు ఏదో విధంగా ఓ పాత్ర సిద్ధంగా ఉండేది. చలపతిరావు కూడా తాను అన్న అని పిలుచుకుంటూ అభిమానించే రామారావు కోరగానే, ఇతర సినిమాలు సైతం వదలుకొని, ఎన్టీఆర్ సొంత సినిమాల్లో నటించేవారు. ఇక వందలాది చిత్రాలలో నటించిన చలపతిరావును కృష్ణవంశీ 'నిన్నే పెళ్ళాడతా' ఓ మలుపు తిప్పింది. అప్పటి దాకా ఎక్కువగా అన్ని సినిమాల్లో విలన్ వేషాలే వేసిన చలపతిరావు, 'నిన్నే పెళ్ళాడతా' తరువాత నుంచీ మంచి తండ్రిగా కూడా నటించి మెప్పించారు. అప్పటి నుంచి ఆయనకు అలాంటి పాత్రలు ఎక్కువ వచ్చాయి. ఇక   ఆయన తనయుడు రవిబాబు కూడా తండ్రి బాటలో నటుడిగా మారాడు. తరువాత దర్శకుడిగా మారి రవిబాబు కొన్ని చిత్రాలకు దర్శకత్వం కూడా వహించి, ఈ తరం దర్శకుల్లో తనకంటూ ఓ సెపరేట్ క్రేజ్ సంపాదించారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈ కాంబినేషన్ లో ఇంకో సినిమా వస్తే మాములుగా ఉండదు...

మ‌రో మంత్రిపై భూదందా ఆరోప‌ణ‌లు.. జ‌ప్తులో ఉన్న భూమి స్వాహా?

బిల్ గేట్స్ విడాకుల వ్యవహారంలో మూడో వ్యక్తి?

కడప పేలుడు : మృతులు ఈ ప్రాంతానికి చెందిన వారే..!

ఇదంతా వాళ్ల వల్లే..!!

తీవ్ర విషాదం : ముక్కలైన శరీరాలు.. చిదిలమైన బతుకులు !

శరీర భాగాలు తునాతునకలు..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>