MoviesSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/illebaby7874df92-c792-4397-8580-bc336e492b00-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/illebaby7874df92-c792-4397-8580-bc336e492b00-415x250-IndiaHerald.jpgగోవా హాట్ బ్యూటీ ఇలియానా ఒకపుడు వెండి తెర మీద వెన్నెలలు చిలికించింది. ఆమె అందం ఎందరినో ఫిదా చేసింది. ఇలియానా యూత్ గుండెలను ముక్కలు చేసింది. కలల దేవతలా నీరాజనాలు అందుకుంది. ఆమె దేవదాస్ సినిమాతో పదిహేనేళ్ల క్రితం టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. illebaby;beauty;mahesh;ravi;amar;goa;audi;bollywood;tollywood;cinema;amazon;audience;silver;success;silver screen;devadas;ileana d'cruz;pokiri;fidaaఅక్కడ ఇల్లీ బేబీ ల్యాండ్ అవుతుందిట.... ?అక్కడ ఇల్లీ బేబీ ల్యాండ్ అవుతుందిట.... ?illebaby;beauty;mahesh;ravi;amar;goa;audi;bollywood;tollywood;cinema;amazon;audience;silver;success;silver screen;devadas;ileana d'cruz;pokiri;fidaaSat, 08 May 2021 20:00:00 GMTగోవా హాట్ బ్యూటీ ఇలియానా ఒకపుడు వెండి తెర మీద వెన్నెలలు చిలికించింది. ఆమె అందం ఎందరినో ఫిదా చేసింది. ఇలియానా యూత్ గుండెలను ముక్కలు చేసింది. కలల దేవతలా నీరాజనాలు అందుకుంది.

ఆమె దేవదాస్ సినిమాతో పదిహేనేళ్ల క్రితం టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత వరసపెట్టి సినిమాలు చేస్తూ హిట్లూ కొట్టింది. పోకిరి సినిమాలో మహేష్ బాబు పక్కన ఇలియానా ఆడి పాడిన తీరు ముచ్చట గొలుపుతుంది. ఆమె మూవీ లో ఉంటే సినిమా హిట్టే అన్న సెంటిమెంట్ కొన్నాళ్ళ పాటు సాగింది. టాలీవుడ్ లో పీక్ స్టేజ్ లో ఉండగానే బాలీవుడ్ వైపు ఈ అమ్మడు తొంగి చూసింది. అక్కడ ఏ మేరకు సక్సెస్ అయిందో తెలియదు కానీ టాలీవుడ్ లో టాప్ ప్లేస్ పోగొట్టుకుంది.

ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో రవితేజా తో చేసిన అమర్ అక్బర్ ఆంతోనీ మూవీ ఆమెకు కలసిరాలేదు. ఇదిలా ఉంటే ఇపుడు ఇల్లీ బేబీ కూడా వెబ్ ప్రపంచం వైపు చూస్తోంది అంటున్నారు. అంతటా ఓటీటీ రాజ్యమేలుతున్న వేళ ఇలియానా కూడా ఓటీటీ ఫ్లాట్ ఫారం ఎంచుకుందిట. ఆమెను ఒక అదిరిపోయే షో ద్వారా తీసుకురావడానికి అమెజాన్ ప్రైమ్  ఒప్పందం కుదుర్చుకుంది అంటున్నారు. ఇలియానా టాక్ షో  పేరిట ఇది జాతీయ స్థాయిలో ప్రసారం అవుతుంది అంటున్నారు.

ఈ టాక్ షో తో ఇల్లీ బేబీ సరికొత్త అవతారం ఎత్తుతుందని అంటున్నారు. ఇలియానాకు ప్రస్తుతం చేతిలో సినిమాలు లేవు. దాంతో టాక్ షో ద్వారా తన ఇమేజ్ ని మరింత పెంచుకోవచ్చు అలాగే ఆడియన్స్ కి దగ్గర కావచ్చు అని ఆమె ప్లాన్ చేస్తోంది. ఇక ఆదాయం విషయం చూసుకున్నా అమెజాన్ ప్రైమ్ బాగానే ముట్టచెబుతుంది అంటున్నారు. మొత్తానికి టాక్ షో లో ఇల్లీ బేబీ సరికొత్త గ్లామరసాన్ని ఒలకబోస్తూ మళ్ళీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది అన్న మాట.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మెహర్ రమేష్ రిక్వెస్ట్..సోనూ సూద్ యాక్సెప్ట్ ..!

టన్నుల కొద్దీ గ్లామర్ ఉన్నా నో యూజేనా... ?

'జూనియర్ ఎన్టీఆర్ - సమంత' జోడిగా నటించిన సినిమాలు ఇవే.. ఇందులో ఎన్ని హిట్ అయ్యాయంటే.??

చంద్రబాబుపై సీఐడీ సంచలన వ్యాఖ్యలు.. కోర్టులో కౌంటర్

కరోనాకి 5జీ టెస్టింగ్ కి సంబంధం ఉందా..?

టాలీవుడ్ బెస్ట్ కాంబినేషన్ : నాగార్జున, సౌందర్యల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఏంటో తెలుసా?

హీరోగా ఎదుగుతున్నాడు అనే మన హీరో లు సుమన్ ని జైలుకి పంపారా.. క్లారిటీ..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>