EditorialMaddipati Lakshmi Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/mkstalin7211ff5d-6228-4302-b3e4-a57d8185bc3d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/mkstalin7211ff5d-6228-4302-b3e4-a57d8185bc3d-415x250-IndiaHerald.jpgత‌మిళ‌నాట ద్ర‌విడ పార్టీల‌దే సుదీర్ఘ‌కాలంగా హ‌వా. అక్క‌డ జాతీయ పార్టీల పాత్ర ఎప్పుడూ నామ‌మాత్ర‌మే. ఢిల్లీకి జీ హుజూర్ అనేందుకు త‌మిళ నేత‌లు ఎన్న‌డూ సిద్ధంగా ఉండ‌రు. అయితే రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను కాపాడుకునే విష‌యంలో మాత్రం వారు గొప్ప ఒడుపును ప్ర‌ద‌ర్శిస్తారు. అలాంటి సంద‌ర్భాల్లో అక్క‌డ అధికార ప‌క్షం, విప‌క్షం ఎలాంటి భేష‌జాలు లేకుండా ఒక్క‌ట‌వుతారు. ఢిల్లీ మెడ‌లు వంచి త‌మ‌కు కావాల్సింది సాధించుకుంటారు.MKstalin;view;tara;udhayanidhi stalin;delhi;bharatiya janata party;letter;central government;stalin;father;partyసెహ‌భాష్ స్టాలిన్‌..ఇది క‌దా రాజ‌కీయ‌మంటే..!సెహ‌భాష్ స్టాలిన్‌..ఇది క‌దా రాజ‌కీయ‌మంటే..!MKstalin;view;tara;udhayanidhi stalin;delhi;bharatiya janata party;letter;central government;stalin;father;partySat, 08 May 2021 21:07:55 GMTత‌మిళ‌నాట ద్ర‌విడ పార్టీల‌దే సుదీర్ఘ‌కాలంగా హ‌వా. అక్క‌డ జాతీయ పార్టీల పాత్ర ఎప్పుడూ నామ‌మాత్ర‌మే. ఢిల్లీకి జీ హుజూర్ అనేందుకు త‌మిళ నేత‌లు ఎన్న‌డూ సిద్ధంగా ఉండ‌రు. అయితే రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను కాపాడుకునే విష‌యంలో మాత్రం వారు గొప్ప ఒడుపును ప్ర‌ద‌ర్శిస్తారు. అలాంటి సంద‌ర్భాల్లో అక్క‌డ అధికార ప‌క్షం, విప‌క్షం ఎలాంటి భేష‌జాలు లేకుండా ఒక్క‌ట‌వుతారు. ఢిల్లీ మెడ‌లు వంచి త‌మ‌కు కావాల్సింది సాధించుకుంటారు. గ‌తంలో క‌రుణానిధి సార‌థ్యంలోని డీఎంకే, జ‌య‌ల‌లిత అధినేత్రిగా వ్య‌హ‌రించిన ఏఐఏడీఎంకే ప్ర‌భుత్వాలు అధికారంలో ఉన్న స‌మ‌యంలో విప‌క్షంపై క‌క్ష‌సాధింపు రాజ‌కీయాలు కొన‌సాగాయి. ఇవి క‌రుణానిధి-జ‌య‌ల‌లిత మ‌ధ్య వ్య‌క్తిగ‌త దాడులు, కేసులు వ‌ర‌కు దారితీశాయి. క్షేత్ర‌స్థాయిలో ఉభ‌య పార్టీల కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య భౌతిక దాడుల‌కు త‌ర‌చుగా కార‌ణ‌మ‌య్యేవి. ద‌శాబ్దాల పాటు త‌మిళ రాజ‌కీయాల‌ను శాసించిన ఆ ఇద్ద‌రు నేత‌లు ఇప్ప‌డు భౌతికంగా లేరు. ముఖ్య‌మంత్రిగా ఉండ‌గానే అనారోగ్యంతో జ‌య‌ల‌లిత మ‌ర‌ణించ‌డంతో ఉత్ప‌న్న‌మైన ప‌రిస్థితులు కేంద్రంలోని మోదీషాల ఆధ్వ‌ర్యంలోని బీజేపీ ప్ర‌భుత్వానికి అనుకోని అవ‌కాశ‌మిచ్చాయి. జ‌య‌లలిత వార‌సుల మ‌ధ్య‌ విభేదాల‌ను సృష్టించి వాటిని ఆస‌రా చేసుకుని ఆ రాష్ట్రంలో పాగా వేసేందుకు, ఏఐఏడీఎంకే ద్వారా త‌మిళ రాజ‌కీయాల‌ను నియంత్రించేందుకు బీజేపీ త‌న‌దైన శైలిలో వ్యూహాల‌ను అమ‌లుప‌ర‌చింది. ఈ విష‌యంలో కొంత‌వ‌ర‌కు విజ‌య‌వంత‌మైంది కూడా.

అయితే త‌మిళ‌నాట ఢిల్లీ ఆట‌లు, ఆధిప‌త్యం సాగ‌వ‌ని తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో డీఎంకేను గెలిపించ‌డం ద్వారా ఆ రాష్ట్ర ఓట‌ర్లు స్ప‌ష్టంగా చాటిచెప్పారు. అంతేకాదు.. దాదాపు 40 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వ‌మున్నా.. క‌రుణానిధి లాంటి లెజెండ‌రీ నాయ‌కుడి నీడ‌లో నిన్న‌టిదాకా ఉండిపోయిన స్టాలిన్‌ ఇప్పుడు త‌న స‌త్తా ఏంటో మోదీషాల‌కు అర్థ‌మ‌య్యే రీతిలో పావులు క‌ద‌ప‌డం మొద‌లుపెట్టారు. 68 ఏళ్ల వ‌య‌సులో తొలిసారి ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిష్టించిన ఈ ద్ర‌విడ పార్టీ నాయ‌కుడు బీజేపీ వ్యూహాల‌ను ఆదిలోనే  అడ్డుకునే  చ‌ర్య‌లు చేప‌ట్టారు. డీఎంకే గెలిచిన వెంట‌నే ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు ప్ర‌తీకార చ‌ర్య‌ల్లో భాగంగా జ‌య‌ల‌లిత హ‌యాంలో ఏర్పాటు చేసిన అమ్మ క్యాంటీన్ల‌ను, ఆమె విగ్ర‌హాల‌ను ధ్వంసం చేయ‌డాన్ని ఆయ‌న నిర్ధ్వంద్వంగా ఖండించి, నిలువ‌రించారు. అంతేకాదు.. అమ్మ క్యాంటీన్ల ఏర్పాటు ఎంతో మంచి నిర్ణ‌య‌మ‌ని వాటితో పాటు, జ‌య‌ల‌లిత ప్ర‌భుత్వం అమ‌లు చేసిన మంచి కార్య‌క్ర‌మాల‌ను త‌న ప్ర‌భుత్వ హ‌యాంలో కూడా కొన‌సాగిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశాక సుహృద్భావ పూర్వ‌కంగా మాజీ ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామిని క‌లిసి ఆయ‌న స‌హ‌కారం, స‌ల‌హాలు అందించాలని కోర‌డం ద్వారా గొప్ప రాజనీతిజ్క్ష‌త‌ను, చ‌తుర‌త‌ను ప్ర‌ద‌ర్శించారు. గ‌తంలో ఆ రెండు పార్టీల నేత‌ల మ‌ధ్య ఎన్న‌డూ క‌నిపించ‌ని దృశ్య‌మిది. ఈ చ‌ర్యల‌ ద్వారా త‌న తండ్రి హ‌యాంలో సాగిన కక్ష‌పూరిత రాజ‌కీయాల‌కు తాను దూర‌మ‌ని చాటిచెప్పి అటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను, ఇటు త‌మిళ ప్ర‌జ‌ల మ‌న‌సుల‌ను స్టాలిన్ గెలుచుకున్నారు. అంతేకాదు.. ప‌ద‌విలోకొచ్చిన వెంట‌నే త‌న‌దైన సొంత ముద్ర‌ను క‌న‌బ‌రుస్తూ కీల‌క నిర్ణ‌యాల‌ను ప్ర‌క‌టించారు. క‌రోనా రిలీఫ్ ఫండ్ కింద రేష‌న్ కార్డు ఉన్న కుటుంబాల‌కు రూ. 4,000 చొప్పున ఇచ్చే ఫైల్‌పై సంత‌కం పెట్టారు. అదేవిధంగా బాలిక‌లు, మ‌హిళ‌ల‌కు బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం, పాల ధ‌ర లీట‌ర్‌కు రూ.3 త‌గ్గింపు వంటి చ‌ర్య‌లు తీసుకున్నారు. వీట‌న్నింటికి మించి ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్స ఖ‌ర్చుల‌ను ప్ర‌భుత్వమే భ‌రించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. త‌ద్వారా సంక్షేమ చ‌ర్య‌ల్లోనూ తాను ముందుంటాన‌ని తెలియ‌జెప్పారు. ఈ నేప‌థ్యంలో స్టాలిన్ ను రాజ‌కీయంగా ఎదుర్కోవ‌డం విప‌క్షాల‌కు, ముఖ్యంగా ద‌క్షిణాదిపై క‌న్నేసిన బీజేపీకి ఏమంత తేలిక కాద‌నే సంకేతాల‌ను ఆయ‌న స్ప‌ష్టంగానే పంపిన‌ట్టు రాజ‌కీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈటల రాజేందర్‌పై హత్యారోపణలు.. నిజమేనా..

టన్నుల కొద్దీ గ్లామర్ ఉన్నా నో యూజేనా... ?

'జూనియర్ ఎన్టీఆర్ - సమంత' జోడిగా నటించిన సినిమాలు ఇవే.. ఇందులో ఎన్ని హిట్ అయ్యాయంటే.??

చంద్రబాబుపై సీఐడీ సంచలన వ్యాఖ్యలు.. కోర్టులో కౌంటర్

కరోనాకి 5జీ టెస్టింగ్ కి సంబంధం ఉందా..?

టాలీవుడ్ బెస్ట్ కాంబినేషన్ : నాగార్జున, సౌందర్యల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఏంటో తెలుసా?

హీరోగా ఎదుగుతున్నాడు అనే మన హీరో లు సుమన్ ని జైలుకి పంపారా.. క్లారిటీ..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Maddipati Lakshmi Sailaja]]>