PoliticsShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/etela-rajender6a768579-51f9-419b-a5cc-e66d52fd5d60-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/etela-rajender6a768579-51f9-419b-a5cc-e66d52fd5d60-415x250-IndiaHerald.jpgహైకోర్టు న్యాయవాద దంపతుల జంట హత్యల కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో రాజకీయ ప్రమేయం ఉందని అనేక ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. గట్టు వామన్ రావు దంపతులను పట్టపగలు నడిరోడ్డుపై దుండగులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో అక్కడి సీసీ టీవి కెమెరాలో రికార్డు అయింది. ఈవీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం పోలీసులు ఆరు బృందాలుగా గాలించారు. ఎట్టకేలకు మహరాష్ట్ర సరిహద్దుల్లో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారetela rajender;kcr;telangana rashtra samithi trs;telangana;police;minister;air;wife;arrest;murder.;bhimavaram;father;nijam;peddapalliఈటల రాజేందర్‌పై హత్యారోపణలు.. నిజమేనా..ఈటల రాజేందర్‌పై హత్యారోపణలు.. నిజమేనా..etela rajender;kcr;telangana rashtra samithi trs;telangana;police;minister;air;wife;arrest;murder.;bhimavaram;father;nijam;peddapalliSat, 08 May 2021 21:13:05 GMTహైకోర్టు న్యాయవాద దంపతుల జంట హత్యల కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో రాజకీయ ప్రమేయం ఉందని అనేక ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. గట్టు వామన్ రావు దంపతులను పట్టపగలు నడిరోడ్డుపై దుండగులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో అక్కడి సీసీ టీవి కెమెరాలో రికార్డు అయింది. ఈవీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం పోలీసులు ఆరు బృందాలుగా గాలించారు. ఎట్టకేలకు మహరాష్ట్ర సరిహద్దుల్లో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించిన పోలీసులు దేవాలయ భూములకు సంబంధించిన వివాదం కారణంగానే వామనరావు దంపతులను హతమార్చారని అనుమానం వ్యక్తం చేశారు.

అయితే తాజాగా దివంగత వామన రావు తండ్రి కిషన్ రావు తన కొడుకు హత్యోదంతంపై స్పందించారు. తన కుమారుడి హత్య కేసులో తెలంగాణ మాజి ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రమేయం ఉందని ఆరోపించారు. అంతేకాకుండా ఈ హత్య గురించి ఈటలకు ముందుగానే తెలుసని కూడా అన్నారు. ఈ మేరకు విచారణ చేపట్టాలని కోరారు. అంతేకాకుండా పెద్దపల్లి జడ్పీ చైర్మన్, టీఆర్ఎస్ నేత పుట్ట మధు భార్య శైలజకు కూడా ఈ హత్యతో సంబంధం ఉందని,  ఈ విషయంపై కేసీఆర్ చర్యలు తీసుకోవాలని కిషన్ రావు అన్నారు.

భూ కబ్జా కేసులో ఈటలను కేసీఆర్ సర్కార్ బర్తరఫ్ చేసింది. అతడిపై విచారణ కూడా వేగంగా సాగుతోంది. ఈ విషయంలో ఈటల కూడా కేసీఆర్‌పై, టీఆర్ఎస్‌పై వరుస ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో వామనరావు తండ్రి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే ఇది ఈటలను ఇరికించేందుకు మరో కుట్రనా..? లేక నిజంగానే ఆయనకు ఈ హత్యోదంతంతో సంబంధం ఉందా అనేదానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. అయితే మాజీ మంత్రి ఈటలతో పుట్ట మధు సన్నిహితంగా ఉండడం, తన కొడుకు హత్య తరువాత కూడా వీరి మధ్య సత్సంబంధాలు ఉండడం నేపథ్యంలోనే వామనరావు తండ్రి ఈ ఆరోపణలు చేసి ఉంటాడనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా పోలీసుల విచారణలో నిజం తేలే వరకు ఈ కేసులో ఈటలకు సంబంధం ఉందా లేదా అనే సస్పెన్స్ తేలే అవకాశం లేదు.

అయితే పుట్ట మధును పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. అతడిని భీమవరంలో అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న పుట్ట మధును పట్టుకోవడం పోలీసులకు టాస్క్‌గా మారింది. అయితే ఇటీవల మంత్రివర్గం నుంచి ఈటల బర్తరఫ్‌కు గురైన విషయం తెలిసిందే. అయినా ఈటల‌తో పుట్ట మధు సన్నిహితంగా ఉండటంతో సీఎం కేసీఆర్ అసంతృప్తి చెందారని, అందుకనే పుట్ట మధు అజ్ఞాతంలోకి వెళ్లాడని ప్రచారం జరిగింది. అంతేకాకుండా మరోవైపు మూడు నెలల క్రితం జరిగిన హైకోర్టు న్యాయవాదులు వామనరావు దంపతుల హత్యకేసులో పుట్ట మధుపై వచ్చిన ఆరోపణల కారణంగా పోలీసులు విచారణ జరుపుతున్నారనే చర్చ కూడా జరుగుతోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టన్నుల కొద్దీ గ్లామర్ ఉన్నా నో యూజేనా... ?

'జూనియర్ ఎన్టీఆర్ - సమంత' జోడిగా నటించిన సినిమాలు ఇవే.. ఇందులో ఎన్ని హిట్ అయ్యాయంటే.??

చంద్రబాబుపై సీఐడీ సంచలన వ్యాఖ్యలు.. కోర్టులో కౌంటర్

కరోనాకి 5జీ టెస్టింగ్ కి సంబంధం ఉందా..?

టాలీవుడ్ బెస్ట్ కాంబినేషన్ : నాగార్జున, సౌందర్యల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఏంటో తెలుసా?

హీరోగా ఎదుగుతున్నాడు అనే మన హీరో లు సుమన్ ని జైలుకి పంపారా.. క్లారిటీ..!!

వారం నుండి 180 జిల్లాల్లో నో కరోనా..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>