MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/facebook3b74c5e3-e0aa-47e0-815d-5571fbc5eb04-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/facebook3b74c5e3-e0aa-47e0-815d-5571fbc5eb04-415x250-IndiaHerald.jpgకేజీఎఫ్ ఈ సినిమా తెలియని వారుండరు. దాదాపు రెండున్నర సంవత్సరాల క్రితం విడుదలైన కేజీఎఫ్ ఇండియన్ బాక్సాఫీస్‌లో ప్రభంజనాలు సృష్టించింది. ఓ కన్నడ సినిమా ఆ స్థాయిలో సంచలనాలు క్రియేట్ చేస్తుందని అప్పటి వరకూ ఎవ్వరూ ఉహించిఉండరు. అందులోనూ ఈ సినిమా విడుదలైన ప్రతి భాషలోనూ భారీ కలెక్షన్లను రాబట్టింది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో అంతగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా తన రిజల్ట్‌తో అందరినీ..facebook;rocky;india;cinema;tamil;kannada;hero;kgf;indianస్టార్ హీరో ఫేస్‌బుక్ హ్యాక్.. నిజమేనా..?స్టార్ హీరో ఫేస్‌బుక్ హ్యాక్.. నిజమేనా..?facebook;rocky;india;cinema;tamil;kannada;hero;kgf;indianSat, 08 May 2021 12:40:51 GMTకేజీఎఫ్ ఈ సినిమా తెలియని వారుండరు. దాదాపు రెండున్నర సంవత్సరాల క్రితం విడుదలైన కేజీఎఫ్ ఇండియన్ బాక్సాఫీస్‌లో ప్రభంజనాలు సృష్టించింది. ఓ కన్నడ సినిమా ఆ స్థాయిలో సంచలనాలు క్రియేట్ చేస్తుందని అప్పటి వరకూ ఎవ్వరూ ఉహించిఉండరు. అందులోనూ ఈ సినిమా విడుదలైన ప్రతి భాషలోనూ భారీ కలెక్షన్లను రాబట్టింది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో అంతగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా తన రిజల్ట్‌తో అందరినీ అవాక్కు చేసింది. అంతేకాకుండా ఈ సినిమా కలెక్షన్లు కూడా రోజురోజుకూ భారీగా పెరిగాయి. ఈ ఒక్క సినిమాతో రాకింగ్ స్టార్ యశ్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.

ఈ సినిమాతో యశ్‌‌కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ లభించింది. దాంతో కేజీఎఫ్ చాప్టర్2 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కేజీఎఫ్ సినిమాతో ఏ కన్నడ హీరోకు లేని క్రేజ్‌ను యశ్ అందుకున్నాడు. ఈ ఒక్క సినిమాతోనే సోషల్ మీడియాలో కూడా యశ్‌కు భారీ ఫాలోయింగ్ పెరిగింది. సోషల్ మీడియాలో యశ్ ఏదైన ఫోటో లేదా వీడియోను షేర్ చేసిన కొన్ని నిమిషాల్లోనే అది ట్రెండ్ అవుతుంది. అయితే తాజాగా యశ్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

యశ్ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్‌కు గురైందని అనేక వార్తలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా యశ్ ఫేస్ బుక్ ఎకౌంట్ సరిగి పనిచేయకపోవడంతోనే ఈ వార్త తలెత్తింది. ఈ వార్త విన్న అభిమానులు ఇందులో నిజమెంత అనేది తెలీయక జుట్టుపీక్కున్నారు. అయితే తాజాగా తేలిన దాని ప్రకారం యశ్  ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్‌కు గురికాలేదని, కొన్ని టెక్నికల్ సమస్యల కారణంగా ఖాతా సరిగా పనిచేయలేదని, ఇప్పుడు అంతా సరిగ్గా ఉందని సమాచారం. పూర్తి విషయం తెలియడంతో యశ్ ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్ అయిందని రూమర్లు వ్యాప్తి చేసేవారు తమ ఆకతాయి పనులను మానుకోవాలని రాకీ భాయ్ అభిమానులు సూచిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చిన్నారుల వలన కరోనా ముప్పు అధికం అంట. !

బిల్ గేట్స్ విడాకుల వ్యవహారంలో మూడో వ్యక్తి?

కడప పేలుడు : మృతులు ఈ ప్రాంతానికి చెందిన వారే..!

ఇదంతా వాళ్ల వల్లే..!!

తీవ్ర విషాదం : ముక్కలైన శరీరాలు.. చిదిలమైన బతుకులు !

శరీర భాగాలు తునాతునకలు..!!

కడప జిల్లాలో ఘోర ప్రమాదం..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>