Moviesyekalavyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhandacb382895-a8c8-49a8-bd0f-f2ef3e35ec41-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhandacb382895-a8c8-49a8-bd0f-f2ef3e35ec41-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ అఖండ. వీరిద్దరి కాంబోలో సినిమా అంటేనే ఫ్యాన్స్‌కు పండగ. బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్‌లకు, బోయపాటి అదిరిపోయే డైరెక్షన్ సినిమాను ఓ రేంజ్‌లో నిలబెడతాయి. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్‌లుగా నిలిచి కలెక్షన్ల సునామీ సృష్టించాయి. ఇక ఇప్పుడు హాట్రిక్ సినిమా కావడంతో అఖండపై అభిమానుల్లో అంతకుమించి..akhanda;view;ntr;balakrishna;jayanthi;boyapati srinu;poorna;pragya jaiswal;srikanth;thaman s;cinema;nandamuri balakrishna;industry;thriller;tsunami;nandamuri taraka rama rao;josh;legend;dwaraka;simha;ala vaikuntapuramlo;yashasvi jaiswal;jayamఅఖండ ఆల్బం రెడీ.. రిలీజ్ అప్పుడే..!అఖండ ఆల్బం రెడీ.. రిలీజ్ అప్పుడే..!akhanda;view;ntr;balakrishna;jayanthi;boyapati srinu;poorna;pragya jaiswal;srikanth;thaman s;cinema;nandamuri balakrishna;industry;thriller;tsunami;nandamuri taraka rama rao;josh;legend;dwaraka;simha;ala vaikuntapuramlo;yashasvi jaiswal;jayamSat, 08 May 2021 14:01:00 GMTనందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ అఖండ. వీరిద్దరి కాంబోలో సినిమా అంటేనే ఫ్యాన్స్‌కు పండగ. బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్‌లకు, బోయపాటి అదిరిపోయే డైరెక్షన్ సినిమాను ఓ రేంజ్‌లో నిలబెడతాయి. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్‌లుగా నిలిచి కలెక్షన్ల సునామీ సృష్టించాయి. ఇక ఇప్పుడు హాట్రిక్ సినిమా కావడంతో అఖండపై అభిమానుల్లో అంతకుమించి అంచనాలున్నాయి. దీనికి తగ్గట్లే ఈ సినిమాలో బాలకృష్ణ ట్రిపుల్ రోల్‌లో తన నట విశ్వరూపం చూపించబోతున్నాడు.

అందులో ఓ పాత్రల్లో బాలయ్య ఆఘోరగా కనిపిస్తుండడం, దానికి సంబందించి ఇటీవల వచ్చిన టైటిల్ రివీల్ క్లిప్‌లో బాలయ్య లుక్ ఫ్యాన్స్‌కు తెగ నచ్చేశాయి. యూట్యూబ్‌లో ఈ టీజర్‌ అతి తక్కువ సమయంలోనే 50 మిలియన్ల వ్యూస్ దక్కించుకున్న ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. ఈ పాత్రే ఇలా ఉంటే ఇక మిగిలిన పాత్రలు ఇంకే రేంజ్‌లో ఉంటాయో అంటూ అభిమానులంతా తెగ ఆత్రుతగా సినిమా కోసం ఎదురు చూడసాగారు.

ప్రేక్షకుల ఆశపడుతున్నట్లుగానే సినిమాను త్వరగా పూర్తి చేసి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ నెల 28న విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేసింది. కానీ కరోనా దెబ్బకు ఇప్పుడప్పుడే ఈ సినిమా విడుదలయ్యేలా కనపడడం లేదు. అంతేకాకుండా ఏకంగా సెప్టెంబర్‌లో ఈ సినిమా విడుదలవుతుందనే వార్తలు కూడా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఫ్యాన్స్ డీలా పడ్డారు. అయితే వారిలో తిరిగి జోష్ నింపేందుకు అఖండ టీమ్ రెడీ అయింది. అనుకున్నట్లుగా సినిమాను రిలీజ్ చేయలేకపోయినా.. మరో సర్ప్రైజ్ వారిని ఆనందపరచాలని ప్లాన్ చేస్తోంది.

అభిమానుల కోసం సినిమా నుంచి ఓ పాటను కానీ, లేదా మొత్తం ఆల్బంను కానీ విడుదల చేయాలని అఖండ టీం భావిస్తోంది. థమన్ సంగీతాన్ని అందించిన అఖండ ఆల్బం ప్రేక్షకులను మైమరిస్తుందని అఖండ టీం ధీమాగా ఉంది. అల వైకుంఠపురంలో ఆల్బం తర్వాత థమన్‌ మ్యూజిక్‌కు క్రేజ్ విపరీతంగా పెరిగింది. దీంతో అఖండ ఆల్బం కూడా అదే స్థాయిలో ఉంటుందని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా సినిమా ఫస్ట్ సింగిల్‌ని విడుదల చేస్తున్నారు. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రావల్సి ఉంది.

ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. నటి పూర్ణ ఓ ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్రలో బాలయ్యను ఢీకొట్టబోతున్నాడు. ఇక బోయపాటి డైరెక్ట్ చేస్తుండగా.. ఇక ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పాకిస్తాన్ లో సత్తా చాటిన హిందూ మహిళ..!

మ‌రో మంత్రిపై భూదందా ఆరోప‌ణ‌లు.. జ‌ప్తులో ఉన్న భూమి స్వాహా?

బిల్ గేట్స్ విడాకుల వ్యవహారంలో మూడో వ్యక్తి?

కడప పేలుడు : మృతులు ఈ ప్రాంతానికి చెందిన వారే..!

ఇదంతా వాళ్ల వల్లే..!!

తీవ్ర విషాదం : ముక్కలైన శరీరాలు.. చిదిలమైన బతుకులు !

శరీర భాగాలు తునాతునకలు..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>