Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronaed9a0b21-b2ab-4b82-9cac-adebbb4df8fb-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronaed9a0b21-b2ab-4b82-9cac-adebbb4df8fb-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశంలో కరోనా సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఒకరకంగా మహమ్మారి కరోనా వైరస్ రెండవ దశ దేశంలో విలయ తాండవం చేస్తూ మారణహోమం సృష్టిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. శర వేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతోమందికి ప్రాణ భయాన్ని కలిగిస్తుంది ఈ మహమ్మారి వైరస్. రోజురోజుకు వెలుగులోకి వస్తున్న కరోనా కేసుల సంఖ్యను చూస్తూ ఉంటే అందరి గుండెల్లో గుబులు పుడుతోంది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరుణ వైరస్ ను కంట్రోల్ చేయడంలో ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ మహమ్మారి కేసుల సంఖ్య మాత్రం ఎక్కడా తగCorona;health;deva;jeevitha rajaseskhar;central government;coronavirusకరోనా అంతం అవ్వదా.. కొత్త అధ్యయనంలో సంచలన నిజాలు?కరోనా అంతం అవ్వదా.. కొత్త అధ్యయనంలో సంచలన నిజాలు?Corona;health;deva;jeevitha rajaseskhar;central government;coronavirusSat, 08 May 2021 09:30:00 GMTకరోనా వైరస్ రెండవ దశ దేశంలో విలయ తాండవం చేస్తూ మారణహోమం సృష్టిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. శర వేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతోమందికి ప్రాణ భయాన్ని కలిగిస్తుంది ఈ మహమ్మారి వైరస్.  రోజురోజుకు  వెలుగులోకి వస్తున్న కరోనా కేసుల సంఖ్యను చూస్తూ ఉంటే అందరి గుండెల్లో గుబులు పుడుతోంది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరుణ వైరస్ ను కంట్రోల్ చేయడంలో ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ మహమ్మారి కేసుల సంఖ్య మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.  రోజురోజుకు వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతూనే ఉంది.


 అదే సమయంలో అటు ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  వైరస్ కారణంగా ఉపాధి కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఎప్పుడెప్పుడు ఈ మహమ్మారి వైరస్ పూర్తిగా తగ్గిపోతుందా ఎప్పుడు మళ్ళీ సాధారణ జీవితంలోకి అడుగు పెడతామా అని ప్రజలందరూ మొక్కని దేవుడు లేడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో అందరి గుండెలు పగిలే విషయాలు బయటపడ్డాయి. కరోనా వైరస్ ఎప్పటికీ పూర్తిగా తొలగిపోదని కరోనా వైరస్ తో సహజీవనం చేయక తప్పదు అంటూ అధ్యయనంలో వెల్లడైంది.జర్మనీకి చెందిన హైడల్ బర్గ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.



 కరోనా తో మరింత ఎక్కువగా మరణం సంభవించే అవకాశం ఉంది అంటూ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ప్రపంచంలోని ఉత్తర-దక్షిణ దేశాల్లో ఈ మహమ్మారి వైరస్ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని  అధ్యయనంలో వెల్లడైనట్లు తెలి పారు శాస్త్రవేత్తలు. వేసవి కాలం అయినా శీతాకాలం అయినా ఈ మహమ్మారి వైరస్ వ్యాప్తి లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు అంటూ చెప్పుకొచ్చారు. 117 దేశాల నుంచి నివేదికలు సేకరించిన తర్వాత విశ్లేషించి ఈ విషయాలను వెల్లడించినట్లు తెలిపారు.  వైరస్ పూర్తిగా తొలగిపోదని కానీ నియంత్రణ మాత్రమే సాధ్యమని  టీకా వేయించుకొన్న తర్వాత మాస్క్ ధరించడం లాంటి జాగ్రత్తలు పాటించాలి అని సూచిస్తున్నారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా సోకితే ఏంటీ.. మీకు నేనున్నా?

వ్యాక్సినేషన్ పై మోదీ చేతులెత్తేసినట్టేనా..?

క్యాన్సర్‌ చికిత్సలో సంచలనం.. ముంబై సంస్థ అద్భుత విజయం

బిగ్ బాస్ సీజన్ 5కి కొత్త కన్ఫ్యూజన్లు!

ఆ దేశంలో ఆగస్టు కల్లా కరోనా ఖతం ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఈటలను అన్నీ వైపులా బిగించేస్తున్న కేసీయార్

ఏంది జ‌గ‌న్ ఇది..భ‌య‌మా.. గౌర‌వ‌మా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>