Moviespraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kamal-makal-nidhi-mayam-ika-mayamena4bf0e8f4-00d7-4c1c-b1cc-7e7115e3a99f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kamal-makal-nidhi-mayam-ika-mayamena4bf0e8f4-00d7-4c1c-b1cc-7e7115e3a99f-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినీ పరిశ్రమకు రాజకీయాలకు ఎంతో సంబంధం ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి సినీ పరిశ్రమలో ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న నటీనటులు రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసి అక్కడ రాణించిన వారు ఎంతోమంది ఉన్నారు. అదే సమయంలో సినిమాల్లో ఎంత క్రేజ్ తెచ్చుకున్నప్పటికీ కొంతమంది మాత్రం రాజకీయాల్లో అంతగా రాణించలేదు అని చెప్పాలి. కొంతమంది ఎన్నో అంచనాల మధ్య రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ చివరికి నిరాశే ఎదురై రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు విలక్షణ నటుడు మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమలహాసన్ పరిస్థితి కూడాKamal hasan;rani;kollywood;assembly;tamilnadu;partyకమల్ 'మక్కల్ నీది మయ్యం' ఇక మాయమేనా?కమల్ 'మక్కల్ నీది మయ్యం' ఇక మాయమేనా?Kamal hasan;rani;kollywood;assembly;tamilnadu;partySat, 08 May 2021 08:00:00 GMTపార్టీ అధినేత కమలహాసన్ పరిస్థితి కూడా ఇలాగే కాబోతోందా అంటే ప్రస్తుతం అవును అనే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.



 కమలహాసన్ కి భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయి పాత్రకు ప్రాణం పోస్తాడు.  ఇలా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్నప్పటికీ రాజకీయాల్లోకి ప్రవేశించి మక్కల్ నీది మయ్యం అనే పార్టీని స్థాపించాడు కమలహాసన్.  మొదటి నుంచి ఆయన భావజాలం ఎంతో భిన్నంగా వివాదాస్పదం గానే ఉంది. అయితే ఇటీవల తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పెట్టిన తర్వాత మొదటిసారి ప్రత్యక్షంగా పోటీ చేసింది కమల్ పార్టీ. కానీ ఇటీవలే పోటీచేసిన అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా నిరాశ ఎదురైంది.



 మక్కల్ నీది మయ్యం పార్టీ నుంచి పోటీ చేసిన ఒక అభ్యర్థి కూడా గెలవలేదు. స్వయంగా పార్టీ అధినేత సైతం ఓడిపోయాడు. దీంతో అభిమానులు కార్యకర్తలు పార్టీ నేతలు అందరిలో కూడా నైరాశ్యం నెలకొన్నట్లు  తెలుస్తుంది.  ఈ క్రమంలోనే ఇక ఎంతో మంది పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు స్వయంగా పార్టీ ఉపాధ్యక్షుడు సైతం పార్టీని వీడుతున్నట్లు ప్రకటించడం సంచలనం గా మారిపోయింది. ఈ క్రమంలోనే ప్రజలు కూడా కమల్ పార్టీ పట్ల ఆయన భావజాలం పట్ల ఏ మాత్రం ఆసక్తి గా లేనట్లు తెలుస్తుంది ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కమల్ రాజకీయాల నుంచి తప్పుకునే అవకాశం ఉంది అనే టాక్ వినిపిస్తోంది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

డ్రోన్లతో మందులు.. ప్రతిపక్షాల విమర్శలు..

బిగ్ బాస్ సీజన్ 5కి కొత్త కన్ఫ్యూజన్లు!

ఆ దేశంలో ఆగస్టు కల్లా కరోనా ఖతం ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఈటలను అన్నీ వైపులా బిగించేస్తున్న కేసీయార్

ఏంది జ‌గ‌న్ ఇది..భ‌య‌మా.. గౌర‌వ‌మా..?

పాక్ ప్రధాని ఇమ్రాన్ నోట.. భారత్ భేష్.. !

ఆచార్య ఆత్రేయ: మనసుకు హత్తుకునే కవి ఆత్రేయ..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>