Moviesyekalavyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/varun-tej197b7790-4c02-4ea4-992c-550eadb9b1d2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/varun-tej197b7790-4c02-4ea4-992c-550eadb9b1d2-415x250-IndiaHerald.jpgమెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ ‘గద్దలకొండ గణేష్‌' తర్వాత ‘గని’ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో కొత్త వరుణ్‌ మనకు కనిపించబోతున్నాడు. బాక్సర్‌గా కండలు తిరిగిన దేహంతో ఉన్న వరుణ్ లుక్ ఇటీవలే విడుదలై సినిమాపై అంచనాలను పెంచేసింది. ఆ పాత్ర బాడీ లాంగ్వేజ్‌ కోసం వరుణ్‌ ఎంతో కష్టపడ్డాడు. కఠినమైన కసరత్తులు చేసి బాడీ షేప్ తెచ్చుకున్నాడు. అయతే కరోనా పెరుగుతున్న కారణంగా షూటింగ్‌..varun tej;ram charan teja;bhama;naveen chandra;pawan kalyan;ram pothineni;sunil;thaman s;upendra;varun;varun sandesh;varun tej;kiran korrapati;bollywood;cinema;lie;bobby;sunil shetty;chitram‘గని’ కోసం వరుణ్ అంత కష్టపడుతున్నాడా?.. షూటింగ్ ఆగిపోయినా..?‘గని’ కోసం వరుణ్ అంత కష్టపడుతున్నాడా?.. షూటింగ్ ఆగిపోయినా..?varun tej;ram charan teja;bhama;naveen chandra;pawan kalyan;ram pothineni;sunil;thaman s;upendra;varun;varun sandesh;varun tej;kiran korrapati;bollywood;cinema;lie;bobby;sunil shetty;chitramFri, 07 May 2021 22:05:00 GMTమెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ ‘గద్దలకొండ గణేష్‌' తర్వాత ‘గని’ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో కొత్త వరుణ్‌ మనకు కనిపించబోతున్నాడు. బాక్సర్‌గా కండలు తిరిగిన దేహంతో ఉన్న వరుణ్ లుక్ ఇటీవలే విడుదలై సినిమాపై అంచనాలను పెంచేసింది. ఆ పాత్ర బాడీ లాంగ్వేజ్‌ కోసం వరుణ్‌ ఎంతో కష్టపడ్డాడు. కఠినమైన కసరత్తులు చేసి బాడీ షేప్ తెచ్చుకున్నాడు. అయతే కరోనా పెరుగుతున్న కారణంగా షూటింగ్‌ నిలిచిపోయింది. దీంతో చిత్ర బృందం మొత్తం రిలాక్స్ అయిపోయింది. కానీ వరుణ్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

ఇప్పటివరకు కష్టపడి తెచ్చుకున్న బాడీ షేప్ కోల్పోకుండా ఉండేందుకు ఇప్పటికీ వర్కౌట్లు చేస్తూనే ఉన్నాడు. షూటింగ్‌ తిరిగి ప్రారంభమయ్యే వరకూ అదే బాడీ మెయిన్‌టెన్‌ చేయడం కోసమే ఈ విధంగా చేస్తున్నట్లు వరుణ్ చెప్పాడు. ఈ మేరకు ‘ఈజీగా ఫైట్‌ చేయడం కోసం ట్రైన్‌ అవుతున్నా’ అని వరుణ్‌తేజ్‌ జిమ్‌లో దిగిన ఓ ఫొటో షేర్‌చేశారు. ఇప్పుడీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్.. ‘ఇది డెడికేషన్ అంటే.. హ్యాట్సాఫ్ గని భాయ్’ అంటూ పోస్ట్‌లు చేస్తున్నారు. వరుణ్ డెడికేషన్ అలాంటిది మరి.

ఈ చిత్రానికి కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహిస్తుండగా.. సిద్దు ముద్ద, అల్లు బాబీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 4 నెలల క్రితం అంటే.. జనవరిలో 19న వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్,  ఫస్ట్ లుక్ విడుదలైంది. వీటిని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్వయంగా విడుదల చేసి వరణ్‌కు శుభాకాంక్షలు చెప్పారు. అప్పటినుంచి ఈ మూవీపై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. గద్దలకొండ గణేశ్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై విపరీతంగా హైప్ క్రియేట్ అయింది. దానికి తగ్గట్టుగానే వరుణ్ కూడా పూర్తి బాక్సర్ టైప్ బాడీ కోసం తెగ కష్టపడుతున్నాడు.
 
కాగా.. ఈ చిత్రంలో వరుణ్ సరసన బాలీవుడ్ భామ సాయీ మంజ్రేకర్ కనిపించనుంది. అలాగే ఉపేంద్ర సునీల్ శెట్టి, నవీన్ చంద్ర వంటి పెద్ద పెద్ద నటులంతా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు ఫుల్ ఫామ్‌లో ఉన్న థమన్ మ్యూజిక్ అందించబోతున్నాడు. అయితే కరోనాకు ముందు ఈ సినిమాను జూలై 30 విడుదల చేయనున్నట్లు ప్రకటించినా.. ప్రస్తుతం పరిస్థితుల్లో ఈ డేట్ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ డైరెక్టర్ నాకు చాలా క్లోజ్..ఎంత క్లోజ్ అంటే.. ?

పాక్ ప్రధాని ఇమ్రాన్ నోట.. భారత్ భేష్.. !

ఆచార్య ఆత్రేయ: మనసుకు హత్తుకునే కవి ఆత్రేయ..

సీఎం Vs సీఎం: మధ్యలో మోదీ... రచ్చ రంబోలా..!!

రెండూ మంచి ఛాన్స్ లే .... కానీ ముందుగా ఎవరితో .... ??

మోదీ సెంట్రల్ విస్టా - విండోస్ విస్టా !

'RRR' లో ఆలియా భట్ చేత ఆ పని చేయించనున్న రాజమౌళి..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>