PoliticsVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/china-vs-europena-union725f75ed-c651-4744-b668-e93c13be520b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/china-vs-europena-union725f75ed-c651-4744-b668-e93c13be520b-415x250-IndiaHerald.jpgగత సంవత్సరం నుండి జరుగుతున్న కరోనా కల్లోలం ఇంకా కొన్ని దేశాలను వదల్లేదు. అందులో భారత్ మొదటిదిగా చెప్పవచ్చు. అయితే ఈ కరోనా వైరస్ రావడానికి కారణమయిన చైనా దేశం పట్ల ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాలు తమ ఆగ్రహాన్ని రకరకాలుగా చూపిస్తున్నాయి.CHINA VS EUROPENA UNION;india;japan;germany;parliment;letter;coronavirus;beijing"డ్రాగన్" కంట్రీకి గుణపాఠం చెప్పిన యూరోపియన్ యూనియన్ ?"డ్రాగన్" కంట్రీకి గుణపాఠం చెప్పిన యూరోపియన్ యూనియన్ ?CHINA VS EUROPENA UNION;india;japan;germany;parliment;letter;coronavirus;beijingFri, 07 May 2021 17:45:40 GMTగత సంవత్సరం నుండి జరుగుతున్న కరోనా కల్లోలం ఇంకా కొన్ని దేశాలను వదల్లేదు. అందులో భారత్ మొదటిదిగా చెప్పవచ్చు. అయితే ఈ కరోనా వైరస్ రావడానికి కారణమయిన చైనా దేశం పట్ల ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాలు తమ ఆగ్రహాన్ని రకరకాలుగా చూపిస్తున్నాయి. ఇందులో భాగంగానే జపాన్ దేశం చైనాతో వారికున్న వ్యాపార వాణిజ్య వ్యవహారాలన్నింటినీ 90 శాతం వరకు రద్దు చేసుకుంది. అంతే కాకుండా జపాన్ భారత్ తో వ్యాపారం చేయడానికి మరియు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉంది. కానీ మళ్ళీ కరోనా తన ప్రభావాన్ని సెకండ్ వేవ్ రూపంలో చూపిస్తూ ఉండడంతో ప్రస్తుతానికి ఆ పనులు ఆగినట్లు తెలుస్తోంది. జపాన్ మాత్రమే కాకుండా ఇంతకు ముందు వరకు చైనాలో ఎక్కువ పెట్టుబడులు పెట్టిన దేశాల్లో ఒకటిగా ఉన్న యూరోపియన్ యూనియన్ కూడా ఇండియా లోనే పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ విషయంపై యూరోపియన్ యూనియన్ సమితిలో చర్చించి పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. యూరోపియన్ యూనియన్ బీజింగ్ తో వ్యాపారాల లావాదేవీల ద్రువీకరణను నిలిపి వేసిన తరువాత చైనా నుండి భారతదేశానికి రావడానికి మొగ్గు చూపిస్తోంది. అందులో భాగంగా యూరోపియన్ యూనియన్ గతంలో నిలిచి పోయిన వాణిజ్య ఒప్పందాలకు సంబంధించిన చర్చలను కొనసాగించాలని అడుగులు వేస్తోంది. భారతదేశంపై మాకున్న నమ్మకం మరియు భారతీయులు చూపించే గౌరవం, నిబద్ధత, సమానత్వం ఇవన్నీ మాకు బాగా నచ్చుతాయి. అందుకే మేము ఇండియాతో వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాము అని యూరోపియన్ యూనియన్ సమ్మిట్ లో తెలిపారు.

అంతే కాకుండా జర్మనీ కూడా భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపింది. ముఖ్యంగా వీరంతా ఒక్క ఇన్సూరెన్సు రంగంలోనే 49 శాతం పెట్టుబడిగా పెట్టనున్నారు. చైనా ఈ మధ్య కాలంలో యూరోపియన్ యూనియన్ కి సంబంధించిన పార్లమెంట్ సభ్యుల పట్ల వ్యవహరించిన తీరు కారణంగా వ్యాపార లావాదేవీలను రద్దు చేసుకున్నట్లు ఒక సమాచారం. ఈ సంఘటనను భారత్ సరిగ్గా ఉపయోగించుకుంది. ఇలా యూరోపియన్ యూనియన్ పెద్ద ఎత్తున భారత్ లో పెట్టుబడులు పెడితే, మనకు ఉద్యోగ అవకాశాలు మరింత పెరిగే అవకాశం ఉంది. మరి రానున్న రోజుల్లో ఏమి జరగనుందో తెలియాల్సి ఉంది.  





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పుష్ప లో కూడా విలన్ గానే చేస్తున్నారా .... ??

సీఎం Vs సీఎం: మధ్యలో మోదీ... రచ్చ రంబోలా..!!

రెండూ మంచి ఛాన్స్ లే .... కానీ ముందుగా ఎవరితో .... ??

మోదీ సెంట్రల్ విస్టా - విండోస్ విస్టా !

'RRR' లో ఆలియా భట్ చేత ఆ పని చేయించనున్న రాజమౌళి..!!

ఇంటి రహస్యాన్ని బయటపెట్టిన ప్రముఖ నటుడు ?

వకీల్ సాబ్ ఆమెకు ప్లస్ అవుద్ది అనుకుంటే పెద్ద మైనస్ అయ్యిందే..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>